pentaiah
-
తాను వేసిన వలే.. కాళ్లకు చిక్కుకొని.. ఆపై మృత్యుపాశమై..
సాక్షి, మెదక్: చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడికి తాను వేసి వలె మృత్యుపాశమైంది. చేపలకోసం వేసిన వల చిక్కుకొని మత్య్సకారుడు మృతి చెందిన ఘటన సోమవారం పెద్దశంకరంపేటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లే పేటకు చెందిన బొగ్గుల పెంటయ్య(32) చేపలు పట్టుకొని అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. సోమవారం పెద్దశంకరంపేట మండలం సంగారెడ్డిపేట శివారులోని నిజాంసాగర్ బ్యాక్‌వాటర్‌లో చేపలు పట్టేందుకు వెళ్లాడు. నీటిలో వల విసిరిన తర్వాత ప్రమాదవశాత్తు అదే వలకు చిక్కుకొని నీటిలో మునిగిపోయాడు. అతడితో వెళ్లిన వారు గమనించి బయటకు తీసేలోపే మృతి చెందాడు. పెంటయ్యకు భార్య పుష్ప, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
పెళ్లికి వెళ్లి వస్తూ అనంత లోకాలకు...
ఇద్దరు మృతి, మరో ఐదుగురికి గాయాలు యాలల (రంగారెడ్డి జిల్లా) పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ఓ డీసీఎం వ్యాన్ రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు మృతి చెందగా, మరో ఐదుగురురికి తీవ్రగాయాలైన సంఘటన యాలాల మండలం దండమీదపల్లి గ్రామంలో బుధవారం జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ మండలంలోని అన్నారం గ్రామాస్తులు కర్ణాటకలో ఓ పెళ్లికి హాజరయై తిరిగి వస్తున్నారు. యాలల మండలం దండమీదపల్లి వద్ద డీసీఎం వ్యాన్ వెనుక డోర్ ఊడిపోయింది. వెనక భాగంలోని వారు రోడ్డుపై పడ్డారు. అందులో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా, మరో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. మృతులు మహబూబ్‌నగర్ అన్నారానికి చెందిన నర్సింహులు(20), పెంటయ్య(14) గా గుర్తించారు. -
నగల కోసం తల్లిని హతమార్చాడు
హన్వాడ(మహబూబ్‌నగర్): నగల కోసం తల్లిని చంపాడో కిరాతకుడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం తిరుమలగిరిలో సోమవారం ఉదయం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన పత్తెపురం పెంటయ్య, చెన్నమ్మ(55) దంపతులు. వీరి ఏకైక కొడుకు కిష్టయ్య. ఆదివారం ఉదయం పెంటయ్య తన అత్తగారి గ్రామమైన గండీడ్ మండలం చౌదర్‌పల్లికి వెళ్లాడు. రాత్రి తిని పడుకునే సమయంలో చెవిగంటీలు తీసి ఇవ్వాలని కిష్టయ్య తన తల్లి చెన్నమ్మపై ఒత్తిడి పెంచాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన కిష్టయ్య.. విపరీతంగా కొట్టడంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. అనంతరం తల్లి చెవులను కొడవలితో కోసి గంటీలను తీసుకెళ్లిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో చెన్నమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. సోమవారం ఉదయం పెంటయ్య రావడంతో ఈ ఘటన వెలుగుచూసింది. కాగా, నిందితుడు కిష్టయ్య క్రూరుడని, ఇప్పటికే మూడు పెళ్లిళ్లు అయ్యాయని, ఇతని ప్రవర్తన కారణంగా భార్యలు ఉండడం లేదని గ్రామస్తులు తెలిపారు. -
బాల్య వివాహాన్ని అడ్డుకున్న పోలీసులు
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మద్దూరు గ్రామంలో ఓ బాలికకు తలపెట్టిన పెళ్లిన అధికారులు ఆపు చేయించారు. గ్రామానికి చెందిన నాగుల పెంటయ్య కూతురు(15)కు అదే గ్రామానికి చెందిన కప్పెర యాదయ్య కుమారుడు ప్రకాశ్‌కు ఇచ్చి వివాహం చేసేందుకు రెండు కుటుంబాల వారు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీనిపై స్థానికులు ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించారు. కాసేపట్లో పెళ్లి కానుండగా పోలీసులతోపాటు అధికారులు అక్కడికి చేరుకుని పెళ్లిని అడ్డుకున్నారు. బాలికను నగరంలోని చైల్డ్వెల్ఫేర్ ఆఫీసుకు తరలించారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. బాల్య వివాహాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్ఐ రాజు, ఏఎస్ఐ శంకరయ్య పేర్కొన్నారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
చేవెళ్ల రూరల్ (రంగారెడ్డి): అప్పుల బాధతో మనస్తాపం చెందిన ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కేసారం గ్రామంలో జరిగింది. పాలె పెంటయ్య (30) మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఓ వేడుక కోసం వెళ్లినట్టు సమాచారం. తిరిగి బుధవారం ఉదయం వారు ఇంటికి చేరుకోగా ఆత్మహత్య వెలుగు చూసింది. సాగు కోసం రూ.2 లక్షల వరకు అప్పులు చేసిన పెంటయ్య మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. -
ఆ నేమ్.. ఫేమ్ ఎందుకు?
సిటీలో కొన్ని ప్రాంతాల పేర్లు చూస్తే కాస్త ఆశ్చర్యం వేస్తుంటుంది. వాటికీ పేర్లు ఎందుకు పెట్టారా అని! కానీ తరచి చూస్తే అందులోనూ ఎంతో ఔచిత్యం, బోలెడంత లాజిక్కూ ఉన్నాయని నాకు అర్థమైంది. నా చిన్నప్పుడు మా అమ్మ ఓ కథ చెప్పేది. అది మరో అమ్మ కథ. ఆ కథలో సదరు మాతృమూర్తి తన పిల్లలకు చాలా పాత పేర్లూ, పిలవడానికి ఇబ్బందిగా ఉండే పేర్లూ పెడుతుందట. ఎందుకంటే ఆ అమ్మకు పుట్టిన పిల్లలంతా చనిపోతూ ఉండబట్టి అలాంటి పేర్లు ఎంచుకునేదట. ఏ తల్లీ - ఏ బిడ్డకూ పెట్టడానికి ఇష్టపడని ఆ పేర్ల వల్ల సదరు పిల్లల్ని మిగతా చిన్నారులంతా ఎగతాళి చేసేవారట. అయినా సరే... తన పిల్లలు బతికితే చాలనే బలమైన కోరికతో ఇష్టం లేకపోయినా ఇబ్బందికరమైన ఆ పేర్లు పెట్టిందట. ఆ పేర్లే... పెంటయ్య, పిచ్చయ్య. దాంతో ఆ పిల్లలకు తగలాల్సిన దిష్టి అంతా ఆ పేర్లకు తగిలి... ఆ పిల్లలు బాగా ఎదుగుతారని ఆ తల్లి నమ్మకం. చిత్రమేమిటంటే... ఆ పిల్లలే పెద్దయ్యాక చాలా గొప్పవాళ్లూ, ఆ ఊరిపెద్దలూ అయ్యారట. ఆ ఊరి ప్రజలంతా వాళ్ల పేర్లను ఎంతో గౌరవంతో నోరారా పిలిచేవారట. ఆ తర్వాత పుట్టిన పిల్లలందరికీ మాత్రం చాలా అందమైన పేర్లు పెట్టిందట ఆ తల్లి. ఇక మన హైదరాబాద్ నగరమనే మాతృమూర్తికీ ఇలాంటి సెంటిమెంట్ ఏదైనా ఉందేమోనన్న డౌట్ నాది! ఎందుకంటే... ఇక్కడి కొన్ని ప్రాంతాల పేర్లు చాలా చిత్రం, పరమ విచిత్రం. ఉదాహరణకు చూడండి... చత్తాబజార్. దాని నిజమైన అర్థం ఏమిటంటే ‘ఒకే కప్పు కింద ఉండే పెద్ద మార్కెట్’ అని!. కానీ ఆ అర్థం ఎంతమందికి తెలుసు? అక్కడ మంగళకరమైన శుభకార్యాలకు ఇన్విటేషన్స్ అమ్మే ఆహ్వానపత్రికల షాపులే ఎక్కువ. అలాగే ‘కవాడీగూడ’ కూడా! కవాడీ అంటే ‘వ్యర్థం, చెత్త’ అనే అర్థం. కానీ ఈరోజు అలనాటి పాతకాలపు ‘వైస్రాయ్’ అంతటి అత్యంత అధునాతనమైన అంతర్జాతీయ ఐదునక్షత్రాల హోటలు, ఎంతో అందమైన వీధులూ అక్కడే ఉన్నాయి. చప్పున చటుక్కుమంటూ చర్మంలోకి సూది దింపినట్టు కుట్టేసి, రక్తాన్ని పీల్చేసే దోమల పేరిట ఈలోకంలో ఎవడైనా ఓ ఏరియా పేరు పెట్టుంటాడా? కానీ మన హైదరాబాదీయులు తమ విశాల హృదయంతో ‘దోమలగూడ’ అనే పేరు పెట్టుకున్నారు. అదెంత అధునాతనమైన ప్రాంతమంటే... ట్యాంక్‌బండ్ పక్కనే ఉండే కొన్ని పోష్ కాలనీల్లో చాలామంది కీలకమైన వ్యక్తులు ‘దోమలుదూరని’ భవంతుల్లో నివసిస్తుంటారక్కడ. ఇక ‘బొగ్గులకుంట’ విషయానికి వద్దాం. వేమన చెప్పిన ప్రతిమాటా వేదమే. కానీ... ఒక్క వీధి పేరు విషయంలో మాత్రం ఒక్క మినహాయింపు ఉందేమో అనిపిస్తుంటుంది. ‘బొగ్గు పాల కడుగ పోవునా మలినంబు’ అన్నాడాయన. నిజమైన బొగ్గు విషయంలో అది వాస్తవమేమోగానీ... ‘బొగ్గులకుంట’ ఏరియా మాటకొస్తే మాత్రం అది పూర్తిగా అబద్ధం. పేరుకు బొగ్గులకుంటేగానీ... కోఠీ-ఆబిడ్స్ మధ్యన ఉన్న కీలకమైన ఈ ప్రాంతంలో... మనసులను తెల్లగా మార్చగల మహావిద్యాలయాలూ, మసిబొగ్గు లాంటి హృదయాలనూ మేలిమిముత్యాల్లా మెరిసేలా ప్రక్షాళన చేయగల తల్లిపాల బ్యాంకులతో సేవలందించే పెద్దాసుపత్రులూ ఉన్నాయి. ‘మరెందుకిలాంటి పేర్లూ..?’ అని కాస్త తరచి ఆలోచించా. నగరమాతల్లి తన అభివృద్ధికీ, తన విస్తరణకూ, విరాజిల్లుతూ ఉండే తన తీరుతెన్నులకూ ఎక్కడ దిష్టి తగులుతుందో అన్న బెంగతోనో, ఏమో... ఇలాంటి కొన్ని ప్రాంతాలకు అలాంటి విచిత్రమైన పేర్లు ఉండేలా చూసిందేమో అన్నది ఓ అభిప్రాయం. ఈ నగరమాత కూడా అచ్చం పిచ్చయ్య, పెంటయ్యల అమ్మలాంటిదే కదూ!! యాసీన్