చేవెళ్ల రూరల్ (రంగారెడ్డి): అప్పుల బాధతో మనస్తాపం చెందిన ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కేసారం గ్రామంలో జరిగింది. పాలె పెంటయ్య (30) మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఓ వేడుక కోసం వెళ్లినట్టు సమాచారం. తిరిగి బుధవారం ఉదయం వారు ఇంటికి చేరుకోగా ఆత్మహత్య వెలుగు చూసింది. సాగు కోసం రూ.2 లక్షల వరకు అప్పులు చేసిన పెంటయ్య మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.