పిచ్చికుక్క దాడిలో గాయపడిన చిన్నారి మృతి
పెనుమదం(పోడూరు) : పెనుమదం గ్రామంలో కొద్దిరోజుల కిందట పిచ్చికుక్క దాడిలో తీవ్రంగా గాయపడిన రెండున్నరేళ్ల చిన్నారిS ధనాల రిషిత కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. గత నెల 9న పెనుమదం గ్రామంలో ఆరుగురు చిన్నారులపై పిచ్చికుక్క దాడి చేసింది. గ్రామానికి చెందిన ధనాల వెంకటచంటి, పుష్ప దంపతుల కుమార్తె రిషిత ఈ దాడిలో తీవ్రంగా గాయపడింది. దీంతో తల్లిదండ్రులు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చిన్నారికి యాంటీ రాబిస్ ఇంజక్షన్లు చేయించారు. ఈ నేపథ్యంలో గతనెల 25న రిషిత ఆరోగ్యం విషమించడంతో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ బాలిక మృతిచెందినట్టు బంధువులు తెలిపారు.