'ఏం మాట్లాడారో చంద్రబాబు బయటపెట్టాలి'
కడప: రుణమాఫీపై ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారో బయటపెట్టాలని శాసనమండలి కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ రామచంద్రయ్య డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను ఇప్పటిదాకా చంద్రబాబు నెరవేర్చలేదని విమర్శించారు. అందువల్ల ప్రజల్లో అభద్రతాభావం నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టిడిపిలో చేర్చుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను తన పార్టీలోకి చేర్చుకోవడం చంద్రబాబుకు ఎంతవరకూ సమంజసం? అని రామచంద్రయ్య ప్రశ్నించారు.