చౌక మద్యంపై సరైన నిర్ణయం
ప్రభుత్వాలకు ఆదాయం రావాలి. దీనిని ఎవరూ కాదనలేరు. కానీ ప్రజా సంక్షేమాన్నీ, ఆరోగ్యాన్నీ ఫణంగా పెట్టి ఆదాయం పెంచుకోవడం ప్రజాస్వామ్య యుగానికి సరికాదు. రూపాయికో, రెండు రూపాయలకో బియ్యం పంపిణీ చేస్తూ, ఆబ్కారీ ఆదాయాన్ని పెంచుకోవాలని చూడ టం పెద్ద దగా తప్ప మరొకటి కాదు. ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగానే అయినా గుర్తించినందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించవల సిందే. చౌక మద్యం ప్రవేశపెట్టాలన్న నిర్ణయం తీసుకున్నప్పటికీ, తరు వాత ప్రజాభిప్రాయానికి తలొగ్గి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టడం హర్షించదగినదే. గుడుంబా తాకిడిని అరికట్టడానికే చౌకమద్యం తేవాలని భావించినట్టు ముఖ్యమంత్రి చెప్పడం సబబు కాదు.
మద్యం, గుడుంబా రెండూ ప్రజలకు హాని చేస్తాయి. గుడుంబా తక్షణం సంసారాలనూ, ఆరోగ్యాన్నీ పతనం చేస్తుంది. చౌకమద్యం కాస్త ఆలస్యంగా చేస్తుంది. ఏమైనా రెండూ కింది వర్గాలను నాశనం చేసేవే. అబ్కారీ విధానం ప్రస్తుతానికి యథాతథంగానే ఉంటుందని ప్రకటిం చిన ముఖ్యమంత్రికి అభినందనలు. పథకాలు పేదలకు ఉపకరించ కున్నా, వారిని గుల్ల చేసే రీతిలో ఉండకపోతే మేలు. ఒక చేత్తో సాయం చేస్తున్నట్లు కనిపిస్తూ, మరో చేత్తో జేబుకు చిల్లు పెట్టే కార్యక్రమాన్ని ప్రజాహిత ప్రభుత్వాలేవి కూడా తీసుకోకూడదు. పేద ప్రజల బలహీ నత మీద ప్రభుత్వాలను బతికించాలని చూడరాదు.
తునికి పెద్దగంగారాం మోతే, కరీంగనగర్ జిల్లా