people movements
-
వాతావరణ మార్పులపై ప్రజా ఉద్యమం
వాషింగ్టన్: వాతావరణ మార్పుల సమస్యకు అడ్డుకట్ట వేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ అంశంపై ప్రపంచ బ్యాంకు ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి శనివారం ఆయన వీడియో లింక్ ద్వారా ప్రసంగించారు. ‘‘వాతావరణ మార్పులను అడ్డుకోవడం ప్రభుత్వాల స్థాయిలో జరగాల్సిన పని అని చాలామంది భావిస్తారు. ఇందులో వ్యక్తిగతంగా తామేమీ చేయలేమని అనుకుంటారు. కానీ ఈ విషయంలో మనమంతా ఎంతో చేయగలం. కేవలం సదస్సుల ద్వారా ఏమీ జరగదు. ఈ పోరు చర్చా వేదికల నుంచి ప్రతి ఇంట్లోనూ డిన్నర్ టేబుళ్ల దాకా వెళ్లాలి. అప్పుడే అది ప్రజా ఉద్యమంగా మారుతుంది. ఈ విషయంలో భారత ప్రజలు కొన్నేళ్లుగా ఎంతో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. జల పరిరక్షణ, సహజ సాగు, చిరుధాన్యాల వాడకం, ఆరోగ్యకరమైన జీవన విధానం, లింగ సమానత్వ సాధన, స్వచ్ఛత, సూక్ష్మసేద్యం వంటివాటిని ఓ ఉద్యమంగా చేపట్టి విజయవంతం చేస్తున్నారు. అన్ని దేశాల్లోనూ ఇలాంటి ప్రయత్నాలను ప్రోత్సహించడంలో అంతర్జాతీయ సంస్థలది కీలక పాత్ర’’ అన్నారు. -
అణుపార్కుకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం
రణస్థలం : కొవ్వాడలో ఏర్పాటు చేయతలపెట్టిన అణుపార్కుకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గోవిందరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ‘కొవ్వాడ అణువిద్యుత్ మాకొద్దు బాబు...ఉత్తరాంధ్రను శ్మశానం చేయెుద్దు బాబు..’ అనే నినాదంతో సీఐటీయూ, ప్రజా సంఘాలు, గ్రామస్తుల ఆధ్వర్యంలో గురువారం కొవ్వాడ వద్ద సముద్రతీర ప్రాంతంలో గోతులు తీసి అందులో దిగి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు అణువిద్యుత్ కేంద్రాన్ని వ్యతిరేకించి అధికారంలోకి రాగానే అనుకూల జీవోలను ఇచ్చి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు కూడా ప్రజలను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. భూకంపాల జోన్లో ఉన్న కొవ్వాడ ప్రాంతంలో అణుపార్కును ఏర్పాటు చేయాలని చూడడం దారుణమన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే తగిన బుద్ధి చెబుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నేతలు పి.తేజేశ్వరరావు, సీహెచ్ అమ్మన్నాయుడు, మైలపల్లి పట్టయ్య, కొమర లక్ష్మణరావు, ఎన్వీ రమణ, ఎస్.సీతారామరాజు, బాలి శ్రీనివాసరావు, ముంగం శ్రీనివాసరావు, మలిపెద్ది శ్యాంసుందరరావు, మైలపల్లి రమణ తదితరులు పాల్గొన్నారు. -
'హామీలు అమలు చేయకపోతే ప్రజా ఉద్యమాలు'
ఢిల్లీ: రెండు రాష్ట్రాలకు ఇచ్చిన వాగ్దాలను అమలు చేయాల్సిందే' అని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకపోతే ప్రజా ఉద్యమాలు చేస్తామని ఆయన అన్నారు. అలా జరిగితే దేశ సమైక్యత, సమగ్రతకు ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. గురువారం సాయంత్రం రాజ్యసభలో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంపై చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా ఏచూరి మాట్లాడారు. సిద్ధాంతం రీత్యా విభజనను తాము వ్యతిరేకించినట్టు తెలిపారు. ప్రభుత్వం తొందరపడుతుందని ఆ రోజే చెప్పామని అన్నారు. ఇచ్చిన వాగ్దాలను అమలు చేసే పరిస్థితి కనిపించడం లేదని చెప్పారు. కోల్పోయిన ఆదాయాన్ని భర్తీ చేస్తామని చెప్పారని తెలిపారు. తాము పదేళ్లు ఇస్తామంటూ కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆ రోజు చెప్పారని గుర్తు చేశారు. ఈ రెండేళ్లలో ఏం చేశారంటూ సూటిగా సీతారాం ఏచూరి ప్రశ్నించారు. -
'ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై కేసులు సరికాదు'
-
'ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై కేసులు సరికాదు'
విశాఖ: విశాఖ జిల్లా పాడేరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై కేసులు పెట్టడం సరికాదని గిరిజనులు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు సర్కార్ ప్రజా ఉద్యమాలను అణిచివేయాలని చూస్తోందని ధ్వజమెత్తారు. బాక్సైట్ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కేసులు పెడుతున్నారని బాక్సైట్ వ్యతిరేక పోరాట సంస్థలు విమర్శించాయి. రాజకీయ కక్ష సాధింపు కోసమే కేసులు బనాయిస్తున్నారని దుయ్యబట్టాయి. -
‘చేయెత్తి జైకొట్టి’న తొలితరం ప్రజాగళం!
చేయెత్తి జైకొట్టు తెలుగోడా! గతమెంతో ఘనకీర్తి గలవోడా!... అంటూ తెలుగునాట ఉర్రూతలూగించిన ఈ చైతన్య గీతికను అలనాటి కమ్యూనిస్టు ప్రముఖుడు వేములపల్లి శ్రీకృష్ణ రాయగా.. ఆ గేయం బహుళ ప్రచారం పొందడానికి కారకులు బి. గోపాలం. ఆరు దశాబ్దాల పాటు ప్రజోద్యమాల సైదోడుగా నిలిచిన తొలితరం ప్రజాగాయకుడు గోపాలం 1927లో ఇప్పటి నవ్యాంధ్ర రాజధాని తుళ్లూరులో బొడ్డు రామదాసు, మంగమ్మ దంపతు లకు జన్మించారు. హరికథలు చెప్పే తండ్రి తాను పాడే పాటలు, పద్యాల పట్ల గోపాలంలోని ఆసక్తిని గమనించి విజయవాడలోని ప్రముఖ వయొలిన్ విద్యాంసులు వారణాసి బ్రహ్మయ్యశాస్త్రి వద్ద సంగీ త శిక్షణకు చేర్పించారు. తర్వాత దుగ్గిరాలకు చెందిన కొండపనేని బలరామయ్య ప్రోత్సాహంతో గుంటూ రు జిల్లా ప్రజానాట్యమండలిలో చేరారు. వేముల పల్లి శ్రీకృష్ణ రచించిన ‘చేయెత్తి జైకొట్టు తెలు గోడా!’, పులుపుల శివయ్య రాసిన ‘పలనాడు వెల లేని మాగాణిరా’ గేయాలను అనేక సభల్లో వయొలి న్‌తో గోపాలం పాడుతుంటే ప్రజలు ఉర్రూతలూగే వారు. నాటి సభల్లో గోపాలం పాట, షేక్ నాజర్ బుర్రకథ తప్పక ఉండేవి. నాజర్ తన తంబుర వాయిద్యం తో బుర్రకథను కొత్తమలుపు తిప్పగా.. గోపాలం సామాజిక చైతన్యం కలిగిన అనేక పాటలకు నవ్యరీతిలో బాణీలు కట్టేవారు. 1943లో విజయవాడలో అఖిల భారత రైతు మహాసభలో ఫిడే లు వాయిస్తూ.. ‘స్టాలినో నీ ఎర్ర సైన్యం’ పాటలో సోవియెట్ యూని యన్ మూకలను ఎలా చెండాడిందో ఉద్రేకంతో పాట పాడి లక్ష మంది ప్రేక్షకుల ప్రశంశ లందుకున్నారు గోపాలం. 1948 నుంచి విజయ వాడ ఆకాశవాణిలో ఎంకి-నాయుడుబావ, భక్త రామదాసు, దేవులపల్లి కృష్ణశాస్త్రి ధనుర్దాసు, విశ్వ నాథ సత్యనారాయణ సంగీత రూపకాలు.. ఇంకా అనేక గేయాలు పాడారు. ఆ సమయంలో రేణుక అనే గాయనితో ఏర్పడిన పరిచయం వివాహానికి దారితీసింది. వారిది కులాంతర వివాహం. ప్రముఖ సినీదర్శకులు తాతినేని ప్రకాశరావు ఆహ్వానం మేరకు గోపాలం 1951 డిసెంబర్లో ఇప్పటి చెన్నైకు వెళ్లారు. మధురగాయకుడు, ఘంటసాల వెంకటేశ్వరరావు వద్ద సహాయకునిగా చేరి పల్లెటూరు, బతు కుదెరువు, పరోపకారం సినిమాలకు పనిచేశారు. పల్లెటూరు సినిమాలో ఎన్టీ రామారావుపై చిత్రీకరించిన ‘చేయెత్తి జైకొట్టు తెలుగోడా’ గేయా న్ని ఘంటసాల.. గోపాలం కట్టిన ట్యూన్‌తోనే పాడడం విశేషం! సి.నాగ భూషణం రక్తకన్నీరు, బికారిరాముడు నాటకాలకు సంగీతం సమకూర్చారు. నలదమయం తి, బికారిరాముడు, మునసబుగారి అల్లుడు, రౌడీ రంగడు, పెద్దలు మారాలి, విముక్తి కోసం తదితర 30 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలకు సంగీత దర్శ కత్వం వహించారు. సంగీత దర్శకుడు ఎస్.రాజేశ్వర రావుతో ‘రంగులరాట్నం, బంగారు పంజరం’, జోస ఫ్తో కలిసి ‘కరుణామయుడు’ సినిమాలకు పనిచే శారు. రంగులరాట్నంలో ‘నడిరేయి ఏ జాములో స్వామి నిను చేర దిగివచ్చునో’, కరుణామయుడు లోని ‘దావీదు తనయా హోసన్నా’ ‘ కదిలింది కరు ణ రథం’, బికారి రాముడులో ‘నిదురమ్మా’ రామాం జనేయ యుద్ధంలో ‘రామనీల మేఘశ్యామ’ తదితర పాటలకు గోపాలం కట్టిన బాణీలు నేటికీ అఖిలాం ధ్ర ప్రేక్షకులను అలరించడం విశేషం. అందాలనటులు శోభన్‌బాబు, హరనాథ్, చలం, కన్నడ రాజ్‌కుమార్ తదితరులకు ప్లేబ్యాక్ పాడారు. కూచిపూడి ఆర్ట్ అకాడమీ ప్రిన్సిపాల్ వెం పటి చినసత్యం కలిసి విదేశాల్లోనూ ప్రోగ్రాములు ఇచ్చారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి, పి.సుశీల, వాణీజయరాం, బొంబాయి సోదరీమణులు పాడిన అనేక భక్తిగీతాల క్యాసెట్లకు సంగీతం సమకూర్చారు. వం దేమాతరం శ్రీనివాస్ సంగీత మెలకువలు నేర్చుకు న్నది గోపాలం వద్దే. 1995లో చెన్నై నుంచి వచ్చిన తరువాత గోపాలం అనుబంధం మంగళగిరితో పెన వేసుకుంది. చిరునవ్వే ఆభరణంగా చరమాంకాన్ని గడిపిన గోపాలం 2004 సెప్టెంబర్ 22న కాలధర్మం చెందారు. పలు సామాజిక చైతన్య గీతాలతో అశేష జనవాహిని హృదయాల్లో సుస్థిరస్థానాన్ని సంపాదిం చిన తొలి తరం ప్రజాగళం బి.గోపాలం. - (నేడు ప్రజాగాయకుడు, సినీ సంగీత దర్శకుడు బి.గోపాలం 11వ వర్ధంతి ) అవ్వారు శ్రీనివాసరావు మంగళగిరి -
మల్లయ్య కొండ పరిరక్షణకు ప్రజా ఉద్యమాలు
తంబళ్లపల్లి(చిత్తూరు): చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండల కేంద్రంలోని మల్లయ్యకొండ పరిరక్షణ ప్రజా ఉద్యమాల ద్యారానే సాధ్యమవుతుందని మాజీ ఎమ్మెల్యే కంచెర్ల ప్రభాకర రెడ్డి అన్నారు. ఆయన మండలంలో సోమవారం పర్యటించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. మల్లయ్యకొండలో ఇనుప ఖనిజాలను దొచుకునేందుకు ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతూ ప్రభుత్వ జీవో జారీ చేసందని ఆయన అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు ఉద్యమాలకు సిద్ధం కావలని కోరారు.