'హామీలు అమలు చేయకపోతే ప్రజా ఉద్యమాలు'
ఢిల్లీ: రెండు రాష్ట్రాలకు ఇచ్చిన వాగ్దాలను అమలు చేయాల్సిందే' అని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకపోతే ప్రజా ఉద్యమాలు చేస్తామని ఆయన అన్నారు. అలా జరిగితే దేశ సమైక్యత, సమగ్రతకు ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. గురువారం సాయంత్రం రాజ్యసభలో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంపై చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా ఏచూరి మాట్లాడారు. సిద్ధాంతం రీత్యా విభజనను తాము వ్యతిరేకించినట్టు తెలిపారు.
ప్రభుత్వం తొందరపడుతుందని ఆ రోజే చెప్పామని అన్నారు. ఇచ్చిన వాగ్దాలను అమలు చేసే పరిస్థితి కనిపించడం లేదని చెప్పారు. కోల్పోయిన ఆదాయాన్ని భర్తీ చేస్తామని చెప్పారని తెలిపారు. తాము పదేళ్లు ఇస్తామంటూ కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆ రోజు చెప్పారని గుర్తు చేశారు. ఈ రెండేళ్లలో ఏం చేశారంటూ సూటిగా సీతారాం ఏచూరి ప్రశ్నించారు.