Seetaram Echuri
-
దేశవ్యాప్తంగా దళితులపై దాడులు పెరిగాయి
-
వైఎస్సార్సీపీ ఎంపీల దీక్షకు జాతీయ స్థాయిలో మద్దతు
-
'హామీలు అమలు చేయకపోతే ప్రజా ఉద్యమాలు'
ఢిల్లీ: రెండు రాష్ట్రాలకు ఇచ్చిన వాగ్దాలను అమలు చేయాల్సిందే' అని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకపోతే ప్రజా ఉద్యమాలు చేస్తామని ఆయన అన్నారు. అలా జరిగితే దేశ సమైక్యత, సమగ్రతకు ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. గురువారం సాయంత్రం రాజ్యసభలో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంపై చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా ఏచూరి మాట్లాడారు. సిద్ధాంతం రీత్యా విభజనను తాము వ్యతిరేకించినట్టు తెలిపారు. ప్రభుత్వం తొందరపడుతుందని ఆ రోజే చెప్పామని అన్నారు. ఇచ్చిన వాగ్దాలను అమలు చేసే పరిస్థితి కనిపించడం లేదని చెప్పారు. కోల్పోయిన ఆదాయాన్ని భర్తీ చేస్తామని చెప్పారని తెలిపారు. తాము పదేళ్లు ఇస్తామంటూ కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆ రోజు చెప్పారని గుర్తు చేశారు. ఈ రెండేళ్లలో ఏం చేశారంటూ సూటిగా సీతారాం ఏచూరి ప్రశ్నించారు. -
ఏచూరికే చాన్స్!
సీపీఎం నూతన సారథిగా దాదాపు ఖరారు విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) కొత్త రథసారథి (ప్రధాన కార్యదర్శి)గా సీతారాం ఏచూరి పేరు దాదాపు ఖరారైంది. శనివారం విశాఖలో జరిగిన సీపీఎం పొలిట్‌బ్యూరో సమావేశంలో ఈమేరకు నేతలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ సమావేశంలో ఏచూరి కూడా పాల్గొనడం ఆయన నియామకానికి మరింత ఊతమిచ్చినట్లయింది. ఏదైనా అత్యంత కీలక పరిణామం జరిగితే పేరు మారవచ్చని, లేదంటే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆదివారం మధ్యాహ్నానికి ఏచూరి పేరును అధికారికంగా ఖరారు చేస్తారని పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. పార్టీ అత్యున్నత పదవికి ఏచూరి, రామచంద్రన్ పిళ్లై పోటీ పడుతున్నారు. దీంతో పార్టీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పార్టీ 50 ఏళ్ల చరిత్రలో ఇంత గట్టి పోటీ జరగడం ఇదే ప్రథమం. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ కూడా నూతన సారథిపై తన మనసులో మాట బయటపెట్టలేదు. శనివారంనాటి పరిణామాలు, సీనియర్ నేత అచ్యుతానందన్ ఏచూరికి శుభాకాంక్షలు తెలపడం, ఏచూరి పొలిట్ బ్యూరోలో పాల్గొనడం వంటి ఘటనలు ఆయన ప్రధాన కార్యదర్శి అవుతారన్న వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ప్రధాన కార్యదర్శి పదవికి పోటీలో ఉన్న రామచంద్రన్ పిళ్లై కూడా దీనిపై నోరు విప్పలేదు. ‘సీతారాం ఏచూరికి అచ్యుతానందన్ శుభాకాంక్షలు చెప్పారు. మీకు చెప్పారా?’ అని విలేకరులు పిళ్లైని అడగ్గా.. ‘‘ఏచూరికి ఏమి చెప్పారో నాకు తెలియదు, నాకైతే చెప్పలేదు’’ అని అసహనం వెలిబుచ్చారు. పార్టీలో వ్యక్తిగత నిర్ణయాలు ఉండవన్నారు. పొలిట్ బ్యూరో సమావేశమై కేంద్ర కమిటీ కూర్పుపై ముసాయిదాను రూపొందిస్తుందని, దానిని ప్రస్తుత కేంద్ర కమిటీ ముందుంచుతుందని చెప్పారు. ఇది కూడా ప్రతిపాదన మాత్రమేనని, మహాసభకు హాజరైన ప్రతినిధులు కేంద్ర కమిటీని ఎన్నుకుంటారని అన్నారు. విశాఖలో నేడు సీపీఎం బహిరంగ సభ సీపీఎం 21వ జాతీయ మహాసభల చివరిరోజైన ఆదివారం విశాఖపట్నంలో భారీ బహిరంగసభ జరగనుంది. ఇక్కడి ఆర్కే బీచ్‌లో కాళీమాత ఆలయం వద్ద నిర్వహిస్తున్న ఈ సభకు లక్షమందికిపైగా హాజరవుతారని అంచనా. బహిరంగసభకు పార్టీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. సభలో పార్టీ ప్రముఖులు ప్రకాశ్ కారత్, బీవీ రాఘవులు, సీతారాం ఏచూరి, బృందాకారత్‌తోపాటు త్రిపుర సీఎం మాణిక్ సర్కార్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు, కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ నరసింగరావు ప్రసంగిస్తారు. సభకు ముందు ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని సంపత్ వినాయక టెంపుల్ నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు మహా ప్రజాప్రదర్శన ప్రారంభమవుతుంది. -
సీపీఎం సారథి ఏ రాముడో!
పోటీలో సీతారాం.. రామచంద్రన్ ఆ ఇద్దరి చుట్టూ తిరుగుతున్న సభలు నాయకత్వ మార్పిడిపై తర్జన భర్జన (విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): సీపీఎంలో నాయకత్వ మార్పిడి అనుకున్నంత సునాయాసంగా కన్పించడం లేదు. ప్రధాన కార్యదర్శి పదవికి పోటీపడుతున్న దక్షిణాది నేతలిద్దరూ ఉద్దండులే కావడంతో ఈ పరిస్థితి తలెత్తింది. వీరిద్దరిలో ఎవరిని ఎన్నుకోవాలో తేల్చుకోలేక ప్రతినిధులు సతమతమవుతున్నారు. ‘మా పార్టీ నాయకత్వ ఎన్నిక మీరు(మీడియా) అనుకున్నంత క్లిష్టమైందో, బూర్జువా పార్టీల మాదిరి హోరాహోరీ జరిగేదో కాదు’ అని సీపీఎం నేతలు చెబుతున్నంత తేలి గ్గానైతే పరిస్థితి లేదు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ పదవీకాలం ఈ నెల 19తో ముగియనుంది. విశాఖలో జరుగుతున్న పార్టీ 21వ జాతీయ మహాసభ 19న కొత్త ప్రధాన కార్యదర్శిని, పొలిట్‌బ్యూరోను ఎన్నుకోవాల్సి ఉంది. నూతన రాజకీయ, ఎత్తుగడల పంథా, సరికొత్త రాజకీయ విధానం, పార్టీ పునర్నిర్మా ణం, వచ్చేఏడాది జరుగనున్న పశ్చిమబెంగాల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ కొత్త రథసారథి ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రధాన కార్యదర్శి పదవికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీతారాం ఏచూరి, కేరళకు చెందిన రామచంద్రన్ పిళ్లై పోటీపడుతున్నారు. ఇద్దరూ పొలిట్‌బ్యూరో సభ్యులే. సీనియర్లే. సీతారాం తెలుగువారే అయినా బెంగాల్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడి పార్టీ వ్యవహారాలను చూస్తున్నారు. కాగా ఈసారి మహిళకు అవకాశమిస్తే ఎలా ఉంటుందన్న భావనా వ్యక్తమైంది. కానీ ప్రస్తుతం ఆస్థాయి వ్యక్తి పార్టీలో ఎవరూలేరు. ఉన్న ఏకైక పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ ప్రస్తుత ప్రధాన కార్యదర్శి కారత్ భార్య. ఆయన తప్పుకోగానే ఆమెకు ఈ పదవిస్తే ప్రజల్లోకి తప్పు భావన వెళ్లే వీలున్నందున ప్రస్తుతానికీ అంశాన్ని పక్కనబెట్టారు. దీంతో ఏచూరి, పిళ్లై మధ్యనే పోటీ కేంద్రీకృతమైంది. పార్టీ వ్యవహారాల్లో చేయితిరిగిన నేత ఏచూరి ... అగ్రవర్ణానికి చెందిన సీతారాం ఏచూరి(63) అటు పార్లమెంటరీ ఇటు పార్టీ వ్యవహారాల్లోనూ చేయితిరిగిన నేత. పలు భాషల్లో మాట్లాడగల దిట్ట. వయసు రీత్యానూ ప్రస్తుత పొలిట్‌బ్యూరో సభ్యుల్లో చిన్నవారు. పార్టీ సైద్ధాంతిక, వ్యూహకర్తల్లో ఒకరు. ప్రస్తుతం పార్టీ తీవ్ర సంక్షోభంలో ఉన్నందున ఈయనకు అవకాశమిస్తే ఇప్పటి కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా పార్టీని నడిపిస్తారన్న అభిప్రాయం ఓ వర్గంలో ఉంది. బెంగాల్లో త్వరలో ఎన్నికలు జరుగనున్నందున.. వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల్ని, చిన్నచిన్న ఎంఎల్ గ్రూపులను ఏకతాటిపైకి తెచ్చి పార్టీకి పునరుజ్జీవం కల్పిస్తారన్న భావనా ఉంది. బెంగాల్‌తోపాటు త్రిపుర, తెలంగాణ, తమిళనాడు, కొన్ని ఉత్తరాది రాష్ట్రాలు పూర్తిగా, ఆంధ్రా నుంచి పాక్షిక మద్దతు లభిస్తున్నట్టు తెలుస్తోంది. చెప్పుకోదగిన ఉద్యమ చరిత్ర లేదని, మిలిటెంట్ ఉద్యమాలు నిర్వహించలేదని, తెరవెనుక వ్యవహారాలు నిర్వహిస్తుంటారన్న విమర్శలు ఆయనకున్న ప్రతికూలతలు. సుదీర్ఘ అనుభవం రామచంద్రన్ సొంతం కేరళలో బలమైన వెనుకబడిన వర్గానికి చెందిన రామచంద్రన్ పిళ్లై(77)కు సుదీర్ఘ అనుభవం ఉంది. ఉద్యమ చరిత్ర ఉన్నవారు. వ్యవసాయరంగ సమస్యలపై మంచి పట్టుంది. సైద్ధాంతిక అవగాహనా అపారమే. కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ వ్యతిరేకవర్గంతోపాటు బిహార్, తమిళనాడు, ఏపీలో కొంతమేరకు మద్దతుంది. ప్రకాశ్ కారత్ మద్దతూ ఆయనకే ఉన్నట్టు సమాచారం. హిందీ సరిగా మాట్లాడలేకపోవడం, వయస్సు ప్రతికూలతలు. ఎన్నిక జరిగే విధానమిలా.. మహాసభకు హాజరైన ప్రతినిధులు కేంద్ర కమిటీని ఎన్నుకుంటారు. ఈ కమిటీ ప్రధానకార్యదర్శిని ఎన్నుకుంటుంది. ప్రధాన కార్యదర్శి పొలిట్‌బ్యూరో సభ్యులను ఎంపిక చేసి కేంద్ర కమిటీకి తెలియజేస్తారు. ఆ కమిటీ ఆమోదం తర్వాత పేర్లను మహాసభలో ప్రకటిస్తారు. మహా సభల్లో ఈ ప్రక్రియ అంతా ఆదివారం జరుగుతుంది. -
ఒకేరోజు ‘త్రీ స్టార్స్’
నేడు జిల్లాకు రానున్న కేసీఆర్, జైరాం రమేష్, ఏచూరి హెలికాప్టర్లో సుడిగాలి పర్యటన చేయనున్న గులాబీ బాస్ మధిర, ఖమ్మంలో జైరాం.. మధిర, భద్రాచలంలో సీతారాం సాక్షి, ఖమ్మం: జిల్లాలో రాజకీయ ప్రచారం వేడెక్కింది. పార్టీల అగ్రనేతలను రప్పించి ప్రచార జోరు పెంచేందుకు అన్ని పార్టీలు సై అంటున్నాయి. మంగళవారం ఒక్కరోజే మూడు ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు స్టార్ క్యాంపెయినర్లు జిల్లాకు రానున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి, కాంగ్రెస్ నేత, కేంద్ర మంత్రి జైరాం రమేష్ జిల్లాలో నేడు సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఇప్పటివరకు స్తబ్దుగా ఉన్న పార్టీలు అగ్రనేతలు వస్తుండడంతో వారి ప్రచార పర్యటనను విజయవంతం చేయడంలో నిమగ్నమయ్యాయి. నాలుగు చోట్ల ‘గులాబీ’ సభలు.. జిల్లాలో టీఆర్ఎస్ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. చాలా కాలం తర్వాత గులాబీ దళపతి కేసీఆర్ జిల్లాకు వస్తుండడం, ఆ పార్టీ తొలిసారి ఎన్నికల బరిలోకి దిగడంతో.. శ్రేణులంతా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఖమ్మం, మణుగూరు, కొత్తగూడెం, ఇల్లెందులో కేసీఆర్ సభలకు నేతలు ఏర్పాట్లు చేశారు. అలాగే కాంగ్రెస్‌లో ఇప్పటి వరకు ప్రచారానికి చరిష్మా ఉన్న నాయకుడు లేకపోవడంతో చివరకు కేంద్రమంత్రి జైరాం రమేష్‌ను తెలంగాణలో ప్రచారానికి టీపీసీసీ రంగంలోకి దింపింది. ఆయన జిల్లాలోని మధిర, ఖమ్మం నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. అలాగే వైఎస్సార్సీపీ, సీపీఎం అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి మధిర, భద్రాచలంలో ప్రచారం నిర్వహించనున్నారు. ఇంకా ఎన్నికల ప్రచారానికి ఆరు రోజులు మాత్రమే ఉండడంతో అన్ని పార్టీల అగ్రనేతలు తమ అభ్యర్థుల తరఫున సుడిగాలి పర్యటనకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. కేసీఆర్ టూర్ షెడ్యూల్ ఇలా.. మధ్యాహ్నం 3.20 గంటలకు హెలికాప్టర్ ద్వారా వరంగల్ జిల్లా నుంచి ఖమ్మం చేరుకుంటారు. ఇక్కడ పెవిలియన్ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన సభలో ఆయన ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు మణుగూరు చేరుకొని అక్కడ సభలో పార్టీ శ్రేణులనుద్దేశించి మాట్లాడుతారు. సాయంత్రం 5 గంటలకు ఇల్లెందు, 6 గంటలకు కొత్తగూడెం సభలలో ప్రసంగిస్తారు. అనంతరం కొత్తగూడెం నుంచి రోడ్డు మార్గం ద్వారా ఖమ్మం చేరుకొని ఇక్కడే రాత్రి బస చేయనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. సీతారాం ఏచూరి పర్యటన ఇలా.. ఉదయం 8 గంటలకు మధిర చేరుకుం టారు. అక్కడ వైఎస్సార్సీపీ, సీపీఎం ఆ ధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధిర నియోకజవర్గ స్థాయి సెమినార్లో ప్రసంగిస్తారు. ఆ తర్వాత భద్రాచలంలో ప్రచారంలో పాల్గొంటారు. జైరాం రమేష్పర్యటన ఇలా.. సాయంత్రం 4 గంటలకు మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం నాగులవంచలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అనంతరం 6 గంటలకు ఖమ్మం నగరంలో రోడ్ షో నిర్వహిస్తారు. -
అసెంబ్లీ తీర్మానానికి జాతీయపార్టీలు సానుకూలం: విజయమ్మ
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై అసెంబ్లీ తీర్మానం పెట్టాలని తాము జాతీయ పార్టీలను కోరుతున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చెప్పారు. జాతీయ పార్టీలన్నీ సానుకూలంగా స్పందిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈరోజు ఆమె ఇక్కడ తమ పార్టీ ముఖ్యనేతలతో కలిసి డీఎంకే ఎంపీ కనిమొళి, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌కారత్, ఆ పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి, లను కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి సహకరించాలని ఆమె వారికి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ముందు నుంచీ తాము సమైక్యాంధ్ర కోరుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర విభజనకు నియమించిన మంత్రుల కమిటీ మరో సైమన్ కమీషన్ లాంటిదని ఆమె విమర్శించారు. వైఎస్ఆర్ సిపి బృందం మరికొందరు జాతీయ పార్టీల నేతలను కలుసుకుంటుంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం చేయవలసిన ప్రయత్నాలన్నీ ఆ పార్టీ చేస్తోంది. -
అసెంబ్లీ తీర్మానానికి జాతీయపార్టీలు సానుకూలం: విజయమ్మ