గోవిందా..గోవిందా..!
కురుమూర్తిస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుతున్నాయి. ప్రధాన ఘట్టమైన అలంకారోత్సవం మంగళవారం రాత్రి కనులపండువగా సాగింది. ఆత్మకూర్ ఎస్బీహెచ్ లాకర్లో భద్రపర్చిన స్వామివారి ఆభరణాలను బయటకు తీసి ప్రత్యేకపూజలు నిర్వహించారు. పోలీసు బందోబస్తు మధ్య చిన్నచింతకుంట మండలం కొత్తపల్లి, దుప్పల్లి గ్రామాల మీదుగా అమ్మాపురం సంస్థానాధీశులు రాజాసోంభూపాల్ ఇంటికి చేర్చారు. ఒక్కసారిగా గోవిందా.. నామస్మరణ మారుమోగింది.
ఆనవాయితీ ప్రకారం ముక్కెర వంశీయులు రాజా శ్రీరాంభూపాల్ ఇంటిలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం అమ్మాపురం గ్రామానికి చెందిన నంబి వంశస్తులు అంభోరుమధ్య కాలినడకన కురుమూర్తి కొండకు చేర్చారు. ముత్యాలు, పడగాలు, పచ్చలు, కెంపులు, మాణిక్యాలు, వజ్రాలు, వైఢూర్యాలు పొదిగిన ఏడువారాల నగలను శ్రీనివాసుడికి అలంకరించడంతో స్వర్ణకాంతులతో కాంచనగృహ పులకరించిపోయింది.
చిన్నచింతకుంట :
తెలంగాణ ప్రజల ఆరాధ్యదైవమైన శ్రీకురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన అలంకరణోత్సవంలో స్వామివారి నామస్మరణం మార్మోగింది. మంగళవారం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఆత్మకూర్ నుం చి మేళతాళాలతో ప్రారంభమైన ఆభరణా ల ఊరేగింపు పరమేశ్వరుడి చెరువు కట్ట వ రకు చేరింది.
అక్కడ పూజలు చేసిన అనంతరం పోలీసు కాన్వాయ్‌లో చిన్నచింతకుం ట మండలం కొత్తపల్లి నుంచి దుప్పల్లికి చేరుకుంది. గ్రామస్తులు, పెద్దఎత్తున స్వామివారి నామస్మరణం చేస్తూ స్వాగతం పలి కారు. స్థానిక రామాలయంలో ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అక్క డి నుంచి ఊరేగింపు అమ్మాపురం చేరుకుం ది. ఆనవాయితీ ప్రకారం ముక్కెర వంశీ యులు రాజా శ్రీరాంభూపాల్ ఇంటిలో గంటన్నర పాటు ప్రత్యేక పూజలు జరిగా యి. ఆయా గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తులు ఆభరణాలను దర్శించుకున్నారు.
అనంతరం నంబి వంశస్తులు ఆభరణాలను తలపై పెట్టుకొని కాలిననడకన కురుమూర్తి కొండలకు బయలు దేరారు. ప్రధాన ఆల యంలో ప్రత్యేక పూజల అనంతరం ఎమ్మె ల్యే ఆల దంపతులు, ఏసీ శ్రీనివాసమూర్తి, ఆలయ ఈఓ గురురాజ, అధికారుల సమక్షంలో అభరాణాలు కీరిటం, హస్తాలు, పాదుకలు, కోర మీసా లు, కెంపు, ముత్యాలహారం, కనకహారాలతో పాటు ఇతర ఆభరాణాలను ప్రధాన పూజారులు వెంకటేశ్వర్లకు అందజేయగా ఆయన కాంచన గృహ లో కొలువుదీరిన శ్రీనివాసుడికి అలంకరిం చారు.
స్వర్ణ కాంతులతో కాంచన గృహ పులకరించింది. రాత్రి 10 గంటలకు స్వామివారికి అశ్వవాహన సేవను ఘనంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలను మోగి స్తుండగా అర్చకులు మంత్రోర్చన చేశారు. దాసులు, స్వామి వారిని భూజన పెట్టుకొని ప్రధాన మెట్ల గుండా ముఖద్వారం వరకు ఊరేగించారు. పూజా కార్యక్రమాల్లో ముక్కెరవంశపు రాజువారసుడు శ్రీరాంభూపాల్, ఎంపీపీ క్రాంతిఆంజనేయులు, జిల్లా పరి షత్ సభ్యురాలు లక్ష్మీ ప్రభాకర్, వైస్ ఎంపీ పీ సులోచన సత్యనారాయణగౌడ్, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.