people tension
-
నకిలీ రెండు వేల రూపాయల నోటు కలకలం
మహబూబాబాద్ : కొత్త రెండు వేల రూపాయల నోట్లు మార్కెట్లోకి వచ్చి నాలుగు రోజులు కూడా గడవక ముందే నకిలీ నోట్లు సామాన్యులను దడ పుట్టిస్తున్నాయి. పెద్దనోట్లు మార్చుకోవడానికి ప్రజలంతా బ్యాంకులు, పోస్టాఫీసుల ముందు బారులు తీరుతుంటే.. సందట్లో సడేమియాలాగా కొందరు నకిలీ నోట్లను చలామణిలోకి తీసుకొస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కురవిలోని ఓ పెట్రోల్ బంక్లో ఆదివారం పెట్రోల్ నింపించుకోవడానికి వచ్చిన ఓ వ్యక్తి నకిలీ రెండు వేల రూపాయల నోటు ఇచ్చాడు. పెట్రోల్ బంక్ సిబ్బంది అప్రమత్తమయ్యే లోపే దుండగుడు అక్కడి నుంచి ఉడాయించాడు. నకిలీ నోట్ల చలామణిపై వ్యాపారులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
నెల్లూరు జిల్లాలో మరోసారి స్వల్ప భూకంపం
నెల్లూరు: నెల్లూరు జిల్లాల్లో ఆదివారం ఉదయం కూడా మరోసారి స్వల్పంగా భూమి కంపించింది. ఉదయగిరి, సీతారామపురం, వరికుంటపాడు మండలాల్లో భూప్రకంపనలు రావటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. ఇళ్లల్లోని వస్తువులు కింద పడిపోయాయి. గత 24 గంటల్లో ఈ ప్రాంతాల్లో 4 సార్లు భూమి కంపించింది. శనివారం ఉదయం ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని స్వల్ప భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. -
మరోసారి కుంగిన భూమి
వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లా చింత కొమ్మ దిన్నె ప్రజలు భయంతో బిక్కు బిక్కు మంటున్నారు. వరుసగా భూమి కుంగుతుండటంతో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. ఆదివారం మరోసారి భూమి భారీగా కుంగింది. చింతకొమ్మదిన్నె మండలం పెద్దముసలిరెడ్డిపల్లిలోని ఓ పసుపుతోటలో 20 అడుగుల వెడల్పు, 45 అడుగుల లోతుతో పెద్ద గొయ్యి ఏర్పడింది. జిల్లాలో వరుసగా పెద్దపెద్ద గోతులు ఏర్పడటంతో గ్రామస్తులతో పాటు ప్రజలు భయందళోనలు గురవుతున్నారు. చింతకొమ్మదిన్నె మండలంలో గత పదిహేను రోజుల్లో రెండు సార్లు భూమి కుంగడం జరిగింది. -
ఆ గ్రామంలో వింత పరిస్థితి
వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లాలో వింత పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. చింతకొమ్మదిన్నె మండలం బుగ్గలపల్లి గ్రామంలో తరచూ భూమి కుంగిపోతుంది. దీంతో ఎప్పుడు ఎక్కడ భూమి కుంగుతుందోనన్న భయంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. బుగ్గమల్లేశ్వరస్వామి ఆలయం సమీపంలో బుధవారం 20 అడుగుల వెడల్పు మేర గుండ్రంగా భూమి పొరలు పొరలుగా చీలిపోయి 15 అడుగుల లోతుకు కుంగిపోయింది. ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు పలు మార్లు చోటు చేసుకున్నాయి. దీనికి కారణాలు తెలియడం లేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అసెంబ్లీ ఫలితాలపైనే అందరి దృష్టి