వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లా చింత కొమ్మ దిన్నె ప్రజలు భయంతో బిక్కు బిక్కు మంటున్నారు. వరుసగా భూమి కుంగుతుండటంతో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది.
ఆదివారం మరోసారి భూమి భారీగా కుంగింది. చింతకొమ్మదిన్నె మండలం పెద్దముసలిరెడ్డిపల్లిలోని ఓ పసుపుతోటలో 20 అడుగుల వెడల్పు, 45 అడుగుల లోతుతో పెద్ద గొయ్యి ఏర్పడింది. జిల్లాలో వరుసగా పెద్దపెద్ద గోతులు ఏర్పడటంతో గ్రామస్తులతో పాటు ప్రజలు భయందళోనలు గురవుతున్నారు. చింతకొమ్మదిన్నె మండలంలో గత పదిహేను రోజుల్లో రెండు సార్లు భూమి కుంగడం జరిగింది.