మరో చోట కుంగిన భూమి
Published Fri, Nov 27 2015 11:37 AM | Last Updated on Sun, Sep 3 2017 1:07 PM
చింతకొమ్మదిన్నె: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చింతకొమ్మ దిన్నె మండలం నాయనోవారిపల్లె, ముసల్ రెడ్డిపల్లె, బుగ్గమల్లేశ్వరస్వామి ఆలయం ప్రాంతాల్లో భారీ పరిమాణంలో భూమి కుంగిపోయి కలకలం సృష్ణిస్తున్న నేపథ్యంలో ఇదే మండలంలో మరో చోట ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మండలంలోని గూడవాండ్లపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు రెడ్డి అనే రైతు పొలంలో శుక్రవారం భూమి కుంగింది. సుమారు 20 అడుగుల వెడల్పుతో పెద్ద గొయ్యిలాగా ఏర్పడింది. భూమి క్రమేపి కుంగుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని అధికారులకు తెలియజేయడంతో వారు హుటాహుటిన సంఘటన స్థలికి చేరుకుని సమీక్షిస్తున్నారు.
కాగా బుధవారం రాత్రి వేంపల్లి మండలంలోని బుగ్గకొట్టాల పరిసరాల్లో రైతు వెంకటశివ పొలంలా రెండు చోట్ల భూమి కుంగిపోయింది. అయితే గురువాంర ఆ ప్రాంతానికి వెళ్లి చూడగా భూమి యధాతథంగా ఉంది. దీంతో భూగర్భ జల శాస్ర్తవేత్తలు భూమి కుంగిన ప్రాంతాన్ని పరిశీలించి ప్రస్తతం ఇబ్బంది లేదని స్ధానికులకు ధైర్యం చెప్పారు.
Advertisement
Advertisement