ఆ గ్రామంలో వింత పరిస్థితి | people tension at ysr district due to land changes | Sakshi
Sakshi News home page

ఆ గ్రామంలో వింత పరిస్థితి

Published Wed, Nov 18 2015 5:52 PM | Last Updated on Sun, Sep 3 2017 12:40 PM

people tension at ysr district due to land changes

వైఎస్సార్ జిల్లా:  వైఎస్సార్ జిల్లాలో వింత పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. చింతకొమ్మదిన్నె మండలం బుగ్గలపల్లి గ్రామంలో తరచూ భూమి కుంగిపోతుంది. దీంతో  ఎప్పుడు ఎక్కడ భూమి కుంగుతుందోనన్న భయంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

బుగ్గమల్లేశ్వరస్వామి ఆలయం సమీపంలో బుధవారం 20 అడుగుల వెడల్పు మేర గుండ్రంగా భూమి పొరలు పొరలుగా చీలిపోయి 15 అడుగుల లోతుకు కుంగిపోయింది. ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు పలు మార్లు చోటు చేసుకున్నాయి. దీనికి కారణాలు తెలియడం లేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement