Pepper powder
-
Summer Drinks: నీర్ మోర్.. ఎసిడిటీ సమ్యసలు దూరం! ఇంకా..
Summer Drinks- Neer Mor: పెరుగుతో తయారు చేసే నీర్ మోర్‌ను మంచి ఎండల్లో తాగడం వల్ల డీహైడ్రేషన్‌కు గురికారు. దాహం కూడా తీరుతుంది. జీర్ణక్రియను సక్రమంగా జరిగేలా ప్రోత్సహించి, ఎసిడిటీ సమస్యలను దరిచేరనివ్వదు. రక్త పోటు(బీపీ)ను నియంత్రణలో ఉంచుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ సమ్మర్ డ్రింక్ తయారీ విధానం తెలుసుకుందామా! నీర్ మోర్ తయారీకి కావలసినవి: ►పెరుగు – కప్పు, నీళ్లు – కప్పు ►అల్లం తరుగు – టీస్పూను ►మిరియాల పొడి – పావు టీస్పూను ►పచ్చిమిర్చి – ఒకటి ►కరివేప ఆకులు – ఏడు, కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు ►ఉప్పు – రుచికి సరిపడా. ►తాలింపునకు: ఆయిల్ – టీస్పూను, ఆవాలు – పావు టీస్పూను, ఇంగువ – చిటికెడు. నీర్ మోర్ తయారీ విధానం: ►బ్లెండర్లో కప్పు పెరుగు, అల్లం, పచ్చిమిర్చి, మిరియాల పొడి, కరివేపాకు వేసి గ్రైండ్ చేయాలి. ►ఇవన్నీ గ్రైండ్ అయ్యాక కప్పు నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసి మరోసారి గ్రైండ్ చేయాలి. ►ఈ మిశ్రమాన్ని గ్లాసులో పోసి కొత్తిమీర తరుగు వేసి పక్కన పెట్టుకోవాలి. ►ఇప్పుడు బాణలిలో ఆయిల్ వేసి వేడెక్కాక ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. ►తర్వాత ఇంగువ వేసి దించేయాలి. ►తాలింపు మిశ్రమాన్ని మజ్జిగ మిశ్రమంలో వేసి తిప్పితే నీర్ మోర్ రెడీ. దీనిని వెంటనే తాగితే చాలా బావుంటుంది. చదవండి👉🏾 Maredu Juice: మారేడు జ్యూస్ తాగుతున్నారా.. ఇందులోని టానిన్, పెక్టిన్‌ల వల్ల.. చదవండి👉🏾Thati Munjala Smoothie: తాటి ముంజలలో ఫైటో కెమికల్స్ పుష్కలం.. కాబట్టి.. -
Weight Loss: బరువును అదుపులో ఉంచే మిరియాలు
టీస్పూను మిరియాలు తీసుకుని పొడిచేసుకోవాలి. ఈ పొడికి టీ స్పూను అల్లం తురుము జోడించి వీటిని కప్పు నీళ్లలో వేసి ఐదు నిమిషాలపాటు మరిగించాలి. తరువాత ఈ నీటిని వడగట్టి టీస్పూను తేనె, టీస్పూను నిమ్మరసం వేసి తాగాలి. ఈ డ్రింక్ జీవక్రియల పనితీరు సక్రమంగా జరిగేలా చేసి బరువును అదుపులో ఉంచుతుంది. చదవండి: Health Tips In Telugu: బీట్రూట్, క్యారట్, గ్రీన్ టీ.. వీటిని తరచుగా తీసుకుంటే.. -
ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ ఫ్రైడ్ చికెన్: ఓ లుక్కేయండి మరి!
వివిధ రెస్టారెంట్లలో దొరికే ఫ్రైడ్ చికెన్ క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తింటే మళ్లీమళ్లీ తినాలనిపిస్తుంది. ఎంతో రుచికరంగా ఉండే ఫ్రైడ్ చికెన్‌ను ఇంట్లో కూడా సులభంగా తయారు చేసుకోవచ్చు. అదెలాగో చదవండి! కావాల్సిన పదార్థాలు చికెన్ డ్రమ్‌స్టిక్స్: ఆరు, కోడిగుడ్డు: ఒకటి, ఉప్పు: రుచికి సరిపడా, తెల్ల మిరియాల పొడి: రెండు స్పూన్లు, మైదా: ఒక కప్పు, కారం: ఒక స్పూను, అల్లం తురుము: ఒక స్పూను, వెల్లుల్లి తురుము: ఒక స్పూను, ఉల్లిపాయ పేస్టు ఒక స్పూను, వాము పొడి: ఒక స్పూను, బరకగా దంచిన ఎండు మిరపకాయల పొడి: ఒక స్పూను, తులసి ఆకుల పొడి: ఒక స్పూను, బ్రెడ్ స్లైసులు: మూడు, ఆయిల్: డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ ►ముందుగా చికెన్ డ్రమ్‌స్టిక్ పీసులను ఒక గిన్నెలో తీసుకుని కొద్దిగా ఉప్పు, అరస్పూను మిరియాల పొడి వేసి డ్రమ్స్టిక్స్కు పట్టించి, మారినేట్ చేసుకోవాలి. ►ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దానిలో గుడ్డు పగుల కొట్టి సొన వేసి బాగా కలపాలి. కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేసి మరింత బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ►ఇప్పుడు మరోక గిన్నె తీసుకుని.. మైదా, ఉప్పు, కారం, అల్లం, వెల్లులి, ఉల్లిపాయ, వాము పొడి, బరకగా దంచిన ఎండు మిరపకాయల పొడి, ఒకటిన్నర స్పూను తెల్లమిరియాల పొడి, తులసి ఆకుల పొడిని వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ►బ్రెడ్ స్లైస్‌లు మూడు తీసుకుని వాటి చుట్టూ ఉన్న అంచును కట్ చేయాలి. తరువాత మధ్యలో తెల్లని స్లైస్‌ను కాస్త బరకగా ఉండేలా పొడి చేసి పెట్టుకోవాలి. ►ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి కాగనివ్వాలి. మరోపక్క మారినేట్ చేసుకున్న చికెన్ పీస్ తీసుకుని, ముందుగా మసాలాలన్ని కలిపి పెట్టుకున్న పొడిలో ముంచాలి, తరువాత గుడ్డు సొన మిశ్రమంలో ముంచాలి. చివరిగా బ్రెడ్స్లైస్ పొడిలో ముంచాలి. ఇలా ముక్కకు ఈ మూడు రకాల మిశ్రమాలను కోటింగ్‌లా పట్టిన తరువాత మరుగుతున్న ఆయిల్లో వేసి సన్నని మంటమీద డీప్ ఫ్రై చేసుకోవాలి. పీస్‌లు బాగా ఉడికి క్రిస్పీగా వేగితే రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై రెడీ అయినట్లే. కాస్త వేడిగా ఉన్నప్పుడు ఈ ఫ్రై తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది. చూశారా ఫ్రైడ్ చికెన్ తయారు చేయడం ఎంత సులభమో, ఇంకెందుకాలస్యం... వెంటనే మీరుకూడా ట్రై చేసి రుచిచూడండి. గమనిక: ఉప్పు మూడుసార్లు వేసేటప్పుడు ఎంతెంత వేస్తున్నామో గమనించి రుచికి సరిపడా వేసుకోవాలి. -
పళ్లు జివ్వుమంటున్నాయా?
హెల్త్‌టిప్స్ అర టీ స్పూన్ నల్ల మిరియాల పొడి, కొద్దిగా లవంగ నూనెలను తీసుకుని మిశ్రమంగా తయారు చేయాలి. దాన్ని నొప్పి పెడుతున్న పన్నుపై అప్లై చేయాలి. రోజూ ఇలా చేస్తుంటే పంటినొప్పి తగ్గడంతోపాటు పళ్లు దృఢంగా తయారవుతాయి. గొంతునొప్పి, మంట, దగ్గులకు... టేబుల్ స్పూన్ తాజా నిమ్మరసం, అర స్పూన్ నల్ల మిరియాల పొడి, టీస్పూన్ ఉప్పును ఒక గ్లాస్ వేడినీటిలో కలిపి మిశ్రమంగా తయారు చేయాలి. దీన్ని నోటిలో పోసుకుని పుక్కిలిస్తూ ఉంటే గొంతునొప్పి, మంట, దగ్గు తగ్గుతాయి. తలనొప్పి నివారణకు యాస్ప్రిన్ వేసుకోవడం అందరూ చేసే పనే. అలా కాకుండా దాల్చిన చెక్కను నీటితో తడిపి అరగదీసి కణతలకు పూస్తూ ఉంటే తలనొప్పి ముఖ్యంగా జలుబు వల్ల వచ్చే తలనొప్పి సులువుగా తగ్గిపోతుంది. అజీర్తి, పులితేన్పులు వస్తుంటే రెండు చిటికలు దాల్చిన చెక్కపొ, రెండు చిటికలు శొంఠిపొడి, నాలుగు చిటికలు యాలకుల పొడీ కలిపి రోజూ భోజనానికి ముందు సేవిస్తూ ఉంటే అజీర్ణం, తేన్పులు రాకుండా ఉంటాయి. -
హెల్త్ టిప్స్
పంటి నొప్పి తగ్గాలంటే ఒక స్పూను దాల్చినచెక్క పొడిలో ఐదు స్పూన్ల తేనె కలిపి నొప్పి ఉన్న చోట పెట్టాలి. ఇలా రోజుకు మూడుసార్లు చేస్తే నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. ఇవి లేకపోతే... లవంగాన్ని కొద్దిగా చిదిమి నొప్పి ఉన్నచోట అదిమినట్లు పెట్టి కొద్దిసేపు అలాగే ఉంచాలి. శ్వాస తాజాగా ఉండాలంటే ఉదయం పళ్లు తోముకున్న తరువాత ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో ఒక స్పూను తేనె, ఒక స్పూను దాల్చిన చెక్క కలిపి ఆ మిశ్రమంతో పుక్కిలించాలి. ఉదయం ఒకసారి ఇలా చేస్తే రోజంతా నోరు శుభ్రంగా ఉండి దుర్వాసన దరి చేరదు.కఫంతో కూడిన దగ్గు బాధిస్తుంటే... గోరువెచ్చటి పాలలో చిటికెడు మిరియాల పొడి కలిపి తాగాలి.