కరువు నివారణకు శాశ్వత చర్యలు
అనంతపురం సప్తగిరి సర్కిల్: జిల్లాలో కరువు నివారణకు శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. బుధవారం నగర ప్రెస్‌క్లబ్‌లో గోపాల్‌రావు ఠాగూర్ స్మారక సమితి ఆధ్వర్యంలో సిక్కిం మాజీ గవర్నర్ గురించి ముద్రించిన ‘ఆదర్శ ప్రజాప్రతినిధి వి.రామారావు’ పుస్తకం ఆవిష్కరణ జరిగింది. ఆర్ఎస్ఎస్ సంఘ్ చాలక్కాకర్ల రంగయ్య, స్మారక సమితి సభ్యులు కరణాకర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ‘అనంత కరువు– పరిష్కరాలు’ అనే అంశంపై విశ్లేషించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో తాగునీటికి సైతం కటకటలాడాల్సిన దుర్భర పరిస్థితులు ఉన్నాయన్నారు. గిట్టుబాటు ధర వచ్చే వరకు పంట నిల్వ చేసుకోవడానికి గోదాములు నిర్మాణం, పశుగ్రాసం, పశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు, రాయదుర్గం నియోజకవర్గంలో ఎడారిఛాయల నివారణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు పంపించాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి, నాయకులు లక్ష్మిదేవమ్మ, శ్రీనివాసరెడ్డి, రాఘవేంద్ర పాల్గొన్నారు.