ఇంటికి కాపలా.. 'ఈ' గుడ్ల గూబ
ఇప్పుడు దొంగలనుంచి మీ ఇంటిని రక్షించే కొత్త గుడ్ల గూబ సెక్యూరిటీ కెమెరా మీకు అందుబాటులోకి రానుంది. ఈ కెమెరా ఎప్పటికప్పుడు ప్రత్యక్ష ఫుటేజ్ ను మీ స్మార్ట్ ఫోన్ కు పంపుతుంటుంది. అచ్చం గుడ్లగూబ కళ్ళలా కనిపించే ఇందులోని రెండు ఎల్ ఈ డీ స్క్రీన్లు వాచ్ నుంచి విషయాన్ని ఫోన్ కు పంపేందుకు ఉపయోగ పడతాయి. వైఫై నెట్వర్క్ అందుబాటులో లేనప్పుడు ఫుటేజ్ ను రికార్డు చేసి ఈ మెయిల్ పంపిస్తుంది.
గుడ్లగూబలా కనిపించే ఈ కెమెరా 270 డిగ్రీల్లో చుట్టూ దాదాపు పరిసరాలన్నింటిపై నిఘా పెట్టి ఉంచగలదు. ఓ ఫ్రెంచ్ డిజైనర్ రూపొందించిన ఈ పక్షి రూపంలోని కెమెరా ఇంటరాక్టివ్ హోమ్ మానిటరింగ్ సిస్టమ్ కలిగి ఉండి, ప్రపంచంలో ఎక్కడైనా ఉపయోగించే వీలుంది. ఇది కంటి కదలికలతో మొబైల్ ఫోన్ కు కనెక్ట్ అవుతుంటుందని దీని సృష్టికర్త.. వివెన్ ముల్లర్ చెప్తున్నారు. ఎటువంటి చిత్రాలు, ఐకాన్లు దీని స్క్రీన్లపై కనిపించవు. ఈ పరికరంలోని రెండు అద్దాలు ముక్కులాగా ఉండి, అంతర్నిర్మితంగా మోషన్ సెన్సార్ కలిగి ఉన్న గుడ్ల గూబ కళ్ళను బయటకు కనిపించకుండా చేస్తాయి. దీనిలోని ఎల్ ఈ డీ స్క్రీన్లు (కళ్ళు) మీకు ఏం చెప్పాలనుకుంటోందో తెలియజేస్తుంటాయి. దీని కళ్ళ రంగును, ఆకారాన్ని కంపెనీ వెబ్ సైట్ నుంచి గాని, యాప్ నుంచి గాని గుర్తించవచ్చు. ఇది కళ్ళు వాల్చి నిద్రపోతున్నట్లుగా కనిపిస్తే బ్యాటరీ డౌన్ అయినట్లుగా అర్థం చేసుకోవాలి. ఎవరైనా యాప్ నుంచి ఫోటో తీస్తే... కళ్ళు ఎవరినో అనుసరిస్తున్నట్లుగానూ... వీడియో చూస్తుంటే.. మెల్లకన్ను లాగానూ దీని కదలికలు కనిపిస్తుంటాయి.
ఈ గుడ్లగూబ పరికరం వాటర్ ప్రూఫ్ తో బయట ఉంచినప్పుడు సుమారు 14 డిగ్రీల ఫారన్ హీట్ నుంచి, 122 డిగ్రీల వరకు తట్టుకునేట్లు ఉంటుంది. తలపై చిన్నగా కొడితే యాక్టివేట్ అయ్యే ఈ పరికరంలో బ్యాటరీ వారానికోసారి ఛార్జి చేయాల్సి వస్తుంది. ఒకవేళ వైఫై లేకుండా దీన్ని వినియోగించాలనుకుంటే.. దీని నుదుటిపై చిన్నగా రెండుసార్లు కొడితే చాలు అలర్ట్ మోడ్ లోకి మారుతుంది. స్మార్ట్ ఫోన్ అందుబాటులో లేని సమయంలో ప్రతి విషయాన్నీయానిమేటెడ్ జిఫ్ గా రికార్డు చేసి ఈ మెయిల్ కు పంపుతుంది. మరో రూమ్ లో ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు ఈ పరికరం సులభ మార్గమని ముల్లర్ చెప్తున్నారు. ఈ ఆకట్టుకునే కొత్త గుడ్లగూబ నిఘా కెమెరా 2016 నవంబర్ నాటికి సుమారు ఎనిమిది వేల రూపాయలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని మద్దతుదారులు చెప్తున్నారు.