చెల్లిని చూసేందుకు వెళ్లి... అంతలోనే...
చీపురుపల్లి: పట్టణంలోని మెయిన్రోడ్లో గల నటరాజ్ జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం పట్టణానికి చెందిన వస్త్ర వ్యాపారి ఎ.రామస్వామి అక్కడికక్కడే మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. మంగళవారం ఉదయం 7.30 గంటల సమయంలో విజయనగరం నుంచి రాజాం వైపు స్కూటీపై వెళ్తున్న రామస్వామికి చీపురుపల్లిలో ప్రధాన రహదారిపై ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు తగలడంతో డివైడర్‌ను ఢీకొట్టి ట్రాక్టర్ కింద పడిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు.
తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిపల్లి రోడ్, నమ్మక్కల్‌కు చెందిన రామస్వామి విజయనగరంలో స్థిరపడి బాలాజీ మార్కెట్లో 404వ నంబర్ దుకాణంలో వస్త్ర వ్యాపారం సాగిస్తున్నాడు. వ్యాపార విస్తరణలో భాగంగా రాజాం వైపు అరువులు ఇచ్చి డబ్బులు వసూలు చేసుకుంటాడు. ఈ నేపథ్యంలో విజయనగరంలో మంగళవారం మార్కెట్ సెలవు కావడంతో రాజాం పరిసర ప్రాంతాల్లో బకాయిల వసూలు కోసం ఉదయం 6 గంటలకే స్కూటీపై విజయనగరం నుంచి బయిలుదేరాడు. ఇంతలో చీపురుపల్లి వచ్చేసరికి రోడ్డు ప్రమాదంలో మృత్యువు కబళించింది. ట్రాక్టర్ డ్రైవర్ వెంకటరమణను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై సన్యాశినాయుడు చెప్పారు.
విద్యుత్ షాక్‌తో టిప్పర్ డ్రైవర్..
చీపురుపల్లి రూరల్: కుటుంబపోషణ కోసం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షాడోల్ జిల్లా బుదవా మండలం జరియా గ్రామం నుంచి వచ్చిన టిప్పర్ డ్రైవర్ ఓంప్రకాశ్ చీపురుపల్లి పట్టణంలో విద్యుత్ షాక్‌తో మంగళవారం మృతిచెందాడు. ఈ సంఘటనకు సంబంధించి హెచ్‌సీ రమణమూర్తి అందించిన వివరాలిలా ఉన్నాయి. పట్టణ సమీపంలో రెడ్డిపేట వద్ద జరుగుతున్న తోటపల్లి కాలువ పనులకు డ్రైవర్ ఓంప్రకాశ్ టిప్పర్‌తో రాతిబుగ్గిని తీసుకువెళ్లాడు.
రాతిబుగ్గిని అన్లోడ్ చేసిన అనంతరం పూర్తిగా అన్లోడ్ అయ్యిందో లేదో చూసేందుకు వెనుక వైపు ఉన్న డోర్‌ను పట్టుకున్నాడు. అప్పటికే టిప్పర్ వెనుక భాగాన విద్యుత్‌వైరు తగిలి ఉండడంతో పట్టుకున్న వెంటనే విద్యుత్‌షాక్ తగిలి కిందపడిపోయాడు. విషయాన్ని గమనించిన స్థానికులు ద్విచక్రవాహనంపై చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లగా వైద్యసిబ్బంది పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఆటోనుంచి జారిపడి ఒకరు..
పాలకొండ రూరల్: మండలంలోని తలవరం–అట్టలి రహదారి మధ్య మంగళవా ఆటోలో నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. అవలంగి గ్రామానికి చెందిన నగరపు కృష్ణంనాయుడు (55) పాలకొండలో ఉన్న చెల్లిని చూసేందుకు పయనమై నవగాం కూడలిలో ఆటో ఎక్కి పాలకొండ వస్తున్నాడు. అట్టలి సమీపంలోని ఆర్సీఎం డొమినిక్ పాఠశాల వద్దకు చేరుకుంటున్న సమయంలో ఆటో అదుపు తప్పడంతో కృష్ణంనాయుడు ఆటోలో నుంచి జారి కిందపడగా తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108కు సమాచారం మివ్వగా వాహనం సంఘటనా స్థలానికి చేరుకునే సరికే మృతిచెందాడు. ఆయనకు భార్య గోవిందమ్మ ఉంది. రైతు కూలీగా జీవనం గడుపుతున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.
పిల్లలు లేకపోవడం, భర్త మరణించడంతో గోవిందమ్మ కన్నీటి పర్యంతమైంది. ఈ ఘటనపై ఎస్సై సీహెచ్ ప్రసాద్ కేసు నమోదు చేశారు. పట్టణంలోని మెయిన్రోడ్లో గల నటరాజ్ జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం పట్టణానికి చెందిన వస్త్ర వ్యాపారి ఎ.రామస్వామి అక్కడికక్కడే మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. మంగళవారం ఉదయం 7.30 గంటల సమయంలో విజయనగరం నుంచి రాజాం వైపు స్కూటీపై వెళ్తున్న రామస్వామికి చీపురుపల్లిలో ప్రధాన రహదారిపై ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు తగలడంతో డివైడర్‌ను ఢీకొట్టి ట్రాక్టర్ కింద పడిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిపల్లి రోడ్, నమ్మక్కల్‌కు చెందిన రామస్వామి విజయనగరంలో స్థిరపడి బాలాజీ మార్కెట్లో 404వ నంబర్ దుకాణంలో వస్త్ర వ్యాపారం సాగిస్తున్నాడు.
వ్యాపార విస్తరణలో భాగంగా రాజాం వైపు అరువులు ఇచ్చి డబ్బులు వసూలు చేసుకుంటాడు. ఈ నేపథ్యంలో విజయనగరంలో మంగళవారం మార్కెట్ సెలవు కావడంతో రాజాం పరిసర ప్రాంతాల్లో బకాయిల వసూలు కోసం ఉదయం 6 గంటలకే స్కూటీపై విజయనగరం నుంచి బయిలుదేరాడు. ఇంతలో చీపురుపల్లి వచ్చేసరికి రోడ్డు ప్రమాదంలో మృత్యువు కబళించింది. ట్రాక్టర్ డ్రైవర్ వెంకటరమణను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై సన్యాశినాయుడు చెప్పారు.
(చదవండి: 186 దేశాలు పర్యటించిన తెలుగు ట్రావెలర్)