ఎండతో చర్మం జిడ్డుగా ఉందా?
బ్యూటిప్స్
* జిడ్డు చర్మం వేసవిలో చెమట వల్ల మరింత జిడ్డుగా మారుతుంది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మొటిమలు, యాక్నె సమస్యలు బాధిస్తాయి.
* ముందు వెచ్చని నీటితో తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. దీని వల్ల స్వేద గ్రంధుల జిడ్డు, తద్వారా మురికి తొలిగి చర్మకాంతి తగ్గకుండా ఉంటుంది.
* దూది ఉండతో క్లెన్సింగ్ మిల్క్‌ను ముఖమంతా రాసి తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. రెండు రోజులకు ఒకసారి ఈ విధంగా చే స్తే స్వేదగ్రంధులు చక్కగా శుభ్రపడతాయి. ముఖ చర్మం జిడ్డుగా మారదు.
* జిడ్డు తొలగిపోవాలని స్క్రబ్‌తో ముఖాన్ని ఎక్కువగా రుద్దకూడదు. వారానికి 2 సార్లు స్క్రబ్ చేస్తే మృతకణాలు, బ్లాక్‌హెడ్స్ తగ్గుతాయి. నూనెలు, ఇతర మాయిశ్చరైజర్ క్రీమ్‌లను ఈ కాలం ఉపయోగించకపోవడమే మేలు.
* ముల్తానా మిట్టి లేదా గంధం పొడి వారానికి ఒకసారి ప్యాక్‌లా వేసుకొని ఆరాక శుభ్రపరుచుకోవాలి. దీంతో అదనపు జిడ్డు తొలగిపోయి, చర్మం మృదువుగా మారుతుంది.
* ప్రతి రోజూ ముఖాన్ని శుభ్రపరుచుకోవడానికి ముందు టిష్యూ ప్యాడ్‌తో తుడవాలి. ఇలా చేయడం వల్ల అదనపు జిడ్డు సులువుగా వదిలిపోతుంది. నేరుగా చెయ్యి ముఖానికి తగలడం వల్ల మొటిమలు, యాక్నె సమస్య పెరుగుతుంది.
* ఈ కాలం వేపుళ్లు, నూనె పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల జిడ్డు సమస్య పెరుగుతుంది. విటమిన్ -ఎ అధికంగా ఉండే క్యారట్, ఆకుకూరలు, తాజా పండ్లు తినాలి.
* రోజూ 2-4 లీటర్ల నీళ్లు తప్పక తాగాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే జిడ్డు సమస్య బాధించదు.