భవనాల పరిశీలన
మరికల్ (ధన్వాడ) : కొత్త మండలంగా ఏర్పడిన మరికల్లో తాత్కాలిక తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటుకు బుధవారం ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ శంకరయ్య ప్రభుత్వ భవనాలను పరిశీలించారు. తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటుకు పంచాయతీ కార్యాలయం అణువుగా ఉంటుందని, ఆర్డీఓ ప్రజాప్రతినిధులకు సూచించారు. పాత ఆస్పత్రిలో తహసీల్దార్ కార్యాలయం కొనసాగిస్తే బాగుటుందని సర్పంచ్ జోగులక్ష్మీరామస్వామి అధికారులకు వివరిం చారు. ఇందుకు గాను అధికారులు మరికల్లోని పాత పీహెచ్సీ ఆస్పత్రి, సింగిల్విండో కార్యాలయం, వ్యవసాయగోదాం, గ్రంథాలయం, ఆయుర్వేద ఆస్పత్రి, పశుఆస్పత్రి భవనలను పరిశీలించారు. వీటిలో ఏదో ఒక భవనం ఎంపిక చే సి తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకుం టామని తహసీల్దార్ శంకరయ్య తెలిపారు. పరిశీలించిన ప్రభుత్వ భవనాల వివరాలను ఉన్నత అధికారులకు నివేదిక అందజేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు రామస్వామి, బుచ్చప్ప, రవి, వెంకట్రామారెడ్డి, తిరుపతయ్య, హన్మిరెడ్డి, కృష్ణయ్య, రాములు, వెంకట్రెడ్డి పాల్గొన్నారు.