pesara
-
అధిక వర్షాలతో పత్తికి విపత్తు
సాక్షి, హైదరాబాద్: వారం క్రితం వరకు వర్షాలు లేక ఇబ్బందులు పడగా, ఇప్పుడు ఎడతెరపి లేని వర్షాలతో పంటలను ఎలా కాపాడుకోవాలో రైతులు ఆందోళన చెందుతున్నారు. అనేక చోట్ల పత్తి పంటకు చేటు కలుగుతోంది. పత్తితోపాటు ఇతర ఆరుతడి పంటలైన సోయాబీన్, మొక్కజొన్న, కంది వంటి పంటలకు కూడా సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటీవల విత్తనాలు చల్లినచోట అధిక వర్షాలతో మునిగిపోయి ఆయా విత్తనాలు కుళ్లిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మొలక వచ్చినచోట కలుపు సమస్య, వేరుకుళ్లు, కాండం కుళ్లు తెగుళ్లు వస్తున్నాయి. వీటికి తోడు నిరంతర వర్షాల కారణంగా బ్యాక్టీరియా తెగుళ్లు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విత్తనాలు మొలకెత్తని చేలల్లో ఎక్కువ నీరు నిలిచిపోయే పరిస్థితి వస్తే పత్తి, సోయా, కంది వంటివి చేతికి రావనీ, వాటిని మరోసారి విత్తుకోవాల్సి ఉంటుందని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా విభాగం మాజీ సంచాలకులు ప్రొఫెసర్ జగదీశ్వర్ అంటున్నారు. 38 లక్షల ఎకరాల్లో పత్తి సాగు... రాష్ట్రంలో వానాకాలం సీజన్లో ఇప్పటివరకు 57.24 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఈ సీజన్ సాధారణ సాగు విస్తీర్ణం 1.24 కోట్ల ఎకరాలు కాగా, 46.06 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. ఇటీవల వర్షాలు పుంజుకోవడంతో వ్యవసాయ పంటల సాగు ఊపు మీద ఉంది. కాగా, పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 50.59 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 37.98 లక్షల ఎకరాల్లో (75.07%) సాగైంది. ఇక వరి సాధారణ సాగు విస్తీర్ణం 49.86 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 7.94 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. ఇక పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 9.43 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 4.04 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 4.13 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 4.05 లక్షల ఎకరాల్లో (98.21%) సాగైంది. ఇక మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 7.13 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 3 లక్షల ఎకరాల్లో సాగైంది. వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తుండటంతో ఆయా పంటలను కాపాడుకోవడం ఇప్పుడు రైతులకు కీలకమైన అంశంగా జగదీశ్వర్ చెబుతున్నారు. రైతులు ఏం చేయాలంటే? ఆరుతడి పంటలైన పత్తి, కంది, పెసర, సోయాచిక్కుడు, మొక్కజొన్న పంటల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తమ పొలాల్లో నిలిచిన మురుగునీరు పోయేందుకు కాల్వలు ఏర్పరచాలి. వర్షాలు ఆగిన వెంటనే తమ పొలాల్లో కలుపు ఏమాత్రం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రై తులు పంటల వారీగా కలుపు మందులను ఎంచుకొని సరైన మోతాదులో పిచికారీ చేయాలి. సాధ్యమైనంతవరకు గుంటకతో కానీ, దంతెలతో గానీ కలుపు తీసివేయాలి. పత్తిలో అధిక వర్షాలకు వేరుకుళ్లు, కాండం కుళ్లు, కాయ కుళ్లు ఆశించేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మొక్కల మొదళ్లను కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు ఒక లీటర్ నీటికి కలుపుకొని లేదా కార్బండాజిమ్ ఒక గ్రాము ఒక లీటర్ నీటికి కలుపుకొని మొక్కల అడుగు భాగంలో పిచికారీ చేయాలి. ప్రస్తుతం భూమిలో తేమను ఆధారం చేసుకొని ఆరుతడి పంటల్లో పైపాటుగా ఎరువులను యూరియా 30 కేజీలు, పొటాష్ 15 నుంచి 20 కేజీలు కలుపుతీసిన తర్వాత మొక్కలకు బెత్తెడు దూరంలో మట్టిలో లోతుగా వేయాలి. మే జూన్లలో వేసిన పత్తిలో వర్షాలు ఆగిన వెంటనే పేనుబంక, పచ్చదోమ ఆశించేందుకు అవకాశం ఉంటుంది. దీనికోసం ఎస్పేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయాలి. వర్షాలకు వరిలో బ్యాక్టీరియా ఎండాకు తెగులు లేదా అగ్గితెగులు సోకేందుకు చాలా అనుకూల వాతావరణం ఉంది. దీంతో వర్షాలు ఆగిన వెంటనే ప్రైసైక్లోజల్ 0.6 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని అగ్గి తెగులు నివారణకు చర్యలు చేపట్టాలి. ప్రస్తుతం బ్యాక్టీరియా తెగులు గమనించినట్లయితే తాత్కాలికంగా నత్రజని ఎరువులను వేయడం, వారం పది రోజుల వరకు ఆగి ముందస్తు చర్యగా కాపర్ఆజిక్లోరైడ్ 30 గ్రాములు, స్ట్రెప్లోమైసిన్ సల్ఫేట్ రెండు గ్రామలు పది లీటర్ల నీటికి కలుపుకొని ఎకరాకు 200 లీటర్ల ద్రావణాన్ని పిచికారీ చేయాలి. వరిలో ప్రస్తుతం వర్షాలను ఉపయోగించుకొని జూలై మాసాంతం వరకు స్వల్పకాలిక రకాలు (125 రోజులు) నారు పోసుకోవడానికి అనుకూలం. ఆ తర్వాత ఆగస్టు 15–20 తేదీల వరకు నాట్లు వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మధ్యకాలిక రకాలు (135 రోజులు) లేదా స్వల్పకాలిక రకాలు కూడా నేరుగా దమ్ము చేసిన పొలంలో డ్రమ్ సీడర్ ద్వారా గానీ, వెదజల్లుకు నే పద్ధతిలో గానీ వరిని విత్తుకున్నట్లయితే దాదా పుగా 15–20 రోజుల సమయం కలిసి వచ్చి మంచి దిగుబడులు రావడానికి అవకాశముంది. వెదజల్లే పద్ధతిలో విత్తుకునేప్పుడు నేల బాగా చదును చేసి ఉండాలి. ఆ తర్వాత వరి విత్తిన మూడు నుంచి ఐదు రోజుల లోపుల సిఫారసు చేసిన కలుపుమందులు తప్పనిసరిగా వాడాలి. -
‘పెసర’ లాభాదాయకం
అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్‌లో వర్షాధారంగా ప్రత్యామ్నాయ పంటగా పెసర సాగు చేసుకోవచ్చని కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కోఆర్డినేటర్ డాక్టర్ ఎం.జాన్‌సుధీర్, శాస్త్రవేత్త తిమ్మప్ప పేర్కొన్నారు. తక్కువ వర్షపాతం నమోదైనా పెసర దిగుబడి వస్తుందని అన్నారు.అయితే పెసరలో తెగుళ్లు నివారించుకోవాలని, ముఖ్యంగా పల్లాకు తెగులు నివారించుకుంటే లాభదాయకమమేనని అన్నారు. పల్లాకు తెగులు నివారణకు జాగ్రత్తలు తీసుకుంటే మంచి దిగుబడులు వస్తాయన్నారు. ప్రస్తుతం మార్కెట్లో క్వింటా 5,300 నుంచి రూ.6 వేల వరకు ధర పలుకుతోందన్నారు. యాజమాన్య పద్ధతులు ఇవీ : అన్ని రకాల నేలల్లో వేసుకోవచ్చు. ఎకరాకు 6 నుంచి 7 కిలోలు విత్తనం అవసరం. కిలో విత్తనానికి 5 గ్రాములు ఇమిడాక్లోప్రిడ్‌తో విత్తనశుద్ధి చేసుకుంటే 20 రోజుల వరకు రసంపీల్చు పురుగు నుంచి పంటను కాపాడుకోవచ్చు. ఎంజీజీ 295 (మధిర 295), డబ్ల్యుజీజీ 460, ఎల్జీజీ 460, ఎల్జీజీ 450 లాంటి స్వల్పకాలిక రకాల విత్తనాలు ఎంపిక చేసుకోవచ్చు. విత్తేటప్పుడు సాళ్ల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీ మీటర్లు దూరం పాటించాలి. విత్తే ముందు ఎకరాకు 8 కిలోల నత్రజని, 20 కిలోలు భాస్వరం ఎరువులు వేయాలి. కలుపు నివారణకు ఎకరాకు 1.3 నుంచి 1.6 లీటర్లు పెండీమిథాలిన్ లేదా ఒక లీటర్ 50 శాతం అలాక్లోర్ మందులు విత్తిన రోజు లేదంటే మరుసటి రోజు పిచికారీ చేసుకోవాలి. 20 నుంచి 25 రోజుల సమయంలో గొర్రుతో అంతరకృషి చేసుకుంటే కలుపు సమస్యను నివారించుకోవచ్చు. పల్లాకు తెగులు నివారిస్తే అధిక దిగుబడి : ఇది వైరస్జాతి తెగులు. తెల్లదోమ ద్వారా వ్యాపించి లేత ఆకుల మీద పసుపు రంగు మచ్చలు ఏర్పడుతాయి. తొలి దశలో ఆశిస్తే మొక్కలు గిడసబారిపోతాయి. పల్లాకు తెగులును తట్టుకునే డబ్ల్యుజీజీ–42, ఎంజీజీ–295, ఎల్జీజీ–407, ఎమ్ఎల్జీ–267, పీడీఎం–54, ఎల్జీజీ–460 లాంటి విత్తన రకాలు ఎంపిక చేసుకోవాలి. విత్తేముందు కిలో విత్తనానికి 5 మి.లీ ఇమిడాక్లోప్రిడ్ లేదా 5 గ్రాములు థయోమిథాక్సిమ్తో విత్తనశుద్ధి చేసుకోవాలి. పైరు చుట్టూ నాలుగు వరుసలు జొన్న, మొక్కజొన్న విత్తుకోవాలి. దీని వల్ల తెల్లదోమ, తామర పురుగులు, పేనుబంకను నివారించుకోవచ్చు. పొలం గట్ల మీద, పరిసర ప్రాంతాల్లో కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్త పడాలి. తెగులు సోకిన మొక్కలు పీకేసి నాశనం చేయాలి. పొలంలో అక్కడక్కడ పసుపురంగు పూసిన అట్టలకు గ్రీజు పూసి ఉంచితే తెల్లదోమను అదుపులో పెట్టవచ్చు. తెల్లదోమ నివారణకు ఎకరాకు 10 లీటర్లు వేపగింజల కషాయాన్ని పిచికారీ చేసుకోవాలి. లేదంటే 5 మి.లీ వేపనూనె లేదా 1 గ్రాము అస్ఫేట్ లేదా 1.5 మి.లీ ట్రైజోఫాస్ లేదా 1.6 మి.లీ మోనోక్రోటోఫాస్ లేదా 0.2 గ్రాములు అసిటామిప్రైడ్ లేదా 0.2 గ్రాములు థయోమిథాక్సామ్ లీటర్ నీటికి కలిపి మందులు మార్చి మార్చి పిచికారీ చేసుకుంటే పల్లాకు తెగులును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. -
పెసర సాగు లాభదాయకం
– పల్లాకు తెగులు నివారణపై దృష్టి పెట్టాలి – కళ్యాణదుర్గం కేవీకే కో ఆర్డినేటర్ జాన్‌సుధీర్ అనంతపురం అగ్రికల్చర్ : ఖరీఫ్‌లో వర్షాధారంగా పెసర పంట లాభదాయకంగా ఉంటుందని కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కోఆర్డినేటర్ డాక్టర్ ఎం.జాన్‌సుధీర్, శాస్త్రవేత్త తిమ్మప్ప తెలిపారు. తక్కువ వర్షపాతం నమోదైనా పెసర పండుతుందన్నారు. ప్రమాదకరమైన పల్లాకు తెగులు నివారణకు జాగ్రత్తలు తీసుకుంటే లాభదాయకంగా ఉంటుందన్నారు. నీటి వసతి కింద సాగుచేస్తే ఎకరాకు 12-14 క్వింటాళ్లు, వర్షాధారం అయితే 6-7 క్వింటాళ్ల దిగుబడి వస్తుందన్నారు. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాల్ రూ.5,300 నుంచి రూ.6,000 వరకు ధర పలుకుతోందని వారు తెలిపారు. పెసర పంట యాజమాన్యం అన్ని రకాల నేలల్లో పెసర పంట వేసుకోవచ్చు. ఎకరాకు 6 నుంచి 7 కిలోల విత్తనం అవసరం. కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్‌తో విత్తనశుద్ధి చేసుకుంటే 20 రోజుల వరకు రసంపీల్చు పురుగు నుంచి పంటను కాపాడుకోవచ్చు. ఎంజీజీ 295 (మధిర 295), డబ్లు్యజీజీ 460, ఎల్జీజీ 460, ఎల్జీజీ 450 లాంటి స్వల్పకాలిక రకాల విత్తనాలు ఎంపిక చేసుకోవచ్చు. సాళ్ల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు దూరంలో విత్తాలి. విత్తే ముందు ఎకరాకు 8 కిలోల నత్రజని, 20 కిలోలు భాస్వరం ఎరువులు వేయాలి. కలుపు నివారణకు ఎకరాకు 1.3 నుంచి 1.6 లీటర్లు పెండీమిథాలిన్ లేదా ఒక లీటర్ 50 శాతం అలాక్లోర్ మందులు విత్తిన రోజు లేదంటే మరుసటి రోజు పిచికారి చేసుకోవాలి. 20 నుంచి 25 రోజుల సమయంలో గొర్రుతో అంతరకృషి చేసుకుంటే కలుపు సమస్యను నివారించుకోవచ్చు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినపుడు అవకాశం ఉంటే ఒకట్రెండు నీటి తడులు ఇచ్చుకుంటే మంచి దిగుబడులు వస్తాయి. పెసరను ప్రత్తి, కందిలో 3:1, 7:1 నిష్పత్తిలో అంతర పంటగా వేసుకోవచ్చు. పల్లాకు తెగులు: ఇది వైరస్జాతి తెగులు. తెల్లదోమ ద్వారా వ్యాపించి లేత ఆకుల మీద పసుపు రంగు మచ్చలు ఏర్పడుతాయి. తొలి దశలో ఆశిస్తే మొక్కలు గిడసబారిపోతాయి. పల్లాకు తెగులును తట్టుకునే డబ్ల్యూజీజీ–42, ఎంజీజీ–295, ఎల్జీజీ–407, ఎంఎల్‌జీ–267, పీడీఎం–54, ఎల్జీజీ–460 లాంటి విత్తన రకాలు ఎంపిక చేసుకోవాలి. విత్తే ముందు కిలో విత్తనానికి 5 మి.లీ ఇమిడాక్లోప్రిడ్ లేదా 5 గ్రాముల థయోమిథాక్సిమ్తో విత్తనశుద్ధి చేసుకోవాలి. పైరు చుట్టూ నాలుగు వరుసలు జొన్న, మొక్కజొన్న విత్తుకోవాలి. దీని వల్ల తెల్లదోమ, తామర పురుగులు, పేనుబంకను నివారించుకోవచ్చు. పొలం గట్ల మీద, పరిసర ప్రాంతాల్లో కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్త పడాలి. తెగులు సోకిన మొక్కలు పీకేసి నాశనం చేయాలి. పొలంలో అక్కడక్కడా పసుపురంగు పూసిన అట్టలకు గ్రీజు పూసి ఉంచితే తెల్లదోమను అదుపులో పెట్టవచ్చు. తెల్లదోమ నివారణకు ఎకరాకు 10 లీటర్లు వేపగింజల కషాయాన్ని పిచికారి చేసుకోవాలి. లేదంటే 5 మి.లీ వేపనూనె లేదా 1 గ్రాము అసిఫేట్ లేదా 1.5 మి.లీ ట్రైజోఫాస్ లేదా 1.6 మి.లీ మోనోక్రోటోఫాస్ లేదా 0.2 గ్రాములు అసిటామిప్రైడ్ లేదా 0.2 గ్రాములు థయోమిథాక్సామ్ లీటర్ నీటికి కలిపి మందులు మార్చి మార్చి పిచికారి చేసుకుంటే పల్లాకు తెగులును సమర్థవంతంగా నివారించవచ్చు.