pet names
-
కుక్కకు పేరు పెడతావా..?
మీరు కుక్కపిల్లను పెంచుకుంటున్నారా..? ముద్దుముద్దుగా ఉందని.. ముద్దుగా పిలుచుకునేందుకు ఏదైనా పేరు పెట్టారా..? అవును అందులో కొత్తేముంది. టామీ, పప్పీ, రాకీ, రాజు, ఇలా చాలా పేర్లే పెట్టుకుంటుంటారు. అయితే చైనాలో ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కకు పేరు పెట్టినందుకు కటకటాలపాలయ్యాడు. కుక్కకు పేరు పెట్టడం కూడా చైనాలో నేరమా అనుకుంటున్నారా..? అసలు కథేంటో మీరే చదివి తెలుసుకోండి. 30 ఏళ్ల బాన్ అనే వ్యక్తి తన రెండు పెంపుడు కుక్కలకు పేర్లు పెట్టాడు. అక్కడితో ఆగకుండా.. వీచాట్ సోషల్ మీడియాలో వాటి ఫొటోలతో పాటు పేర్లు కూడా పోస్ట్ చేశాడు. ఒక కుక్క పేరేమో చెన్గువాన్, మరో కుక్క పేరేమో షీగువాన్. ట్రాఫిక్ పోలీసులను అక్కడ షీగువాన్ అంటారట. ఆ పేర్లు కుక్కలకు పెట్టడం నిషేధం ఉందట. దీంతో పోలీసులకు తిక్కరేగి అతడిని అరెస్ట్ చేశారు. తనకు వాటికి పేర్లు పెట్టడం చట్టవ్యతిరేకమని తెలియదని, ఏదో జోక్ చేద్దామని అలా పెట్టానని పోలీసులకు చెప్పాడు. అయితే అందులో పోలీసులకు జోక్ కనిపించలేదట. అందుకే విచారణ జరిపి అతడిని అరెస్ట్ చేసి పది రోజుల పాటు కటకటాల వెనక్కి పంపారు. అందుకే ఏదైనా పని చేసేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించాలి.. లేదంటే ఇదిగో ఇలాగే అవుతుంది. -
అసలు పేరు కంటే కొసరు పేరే ముద్దు
అసలు పేరు ఎంతున్నా.. కొందరు ముద్దుపేర్లతోనే పాపులర్ అవుతుంటారు. ఇలాంటి వారిలో రాజకీయ నాయకులే ఎక్కువ. గోదావరి జిల్లాల్లో.. అది కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో మరీ ఎక్కువ. ఇక్కడ పలువురు నాయకుల అసలు పేర్లు చాలామందికి తెలియవు. వాళ్లంతా ముద్దుపేర్లతోనే ప్రాచుర్యం పొందారు. అలాంటివాళ్లలో కొందరి వివరాలు చూద్దాం.. ఏలూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆళ్ల నాని అసలు పేరు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్. ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు పూర్తి పేరు మాగంటి వెంకటేశ్వరరావు. తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఈలి నాని పూర్తి పేరు ఈలి వెంకట మధుసూదనరావు. రాజ్యసభ మాజీ సభ్యుడు యర్రా నారాయణస్వామిని బెనర్జీగా పిలుస్తుంటారు. మాజీ మంత్రి కలిదిండి రామచంద్రరాజును అబ్బాయిరాజుగా పిలిచేవారు. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావును కృష్ణబాబుగా పిలుస్తారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు జీఎస్ రావు అసలు పేరు గెడ్డం సుర్యారావు. డీసీసీ మాజీ అధ్యక్షుడు గోకరాజు రామరాజును రామం అంటారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే పీవీఎల్ నరసింహరాజును యండగండి నరసింహరాజుగా పిలుస్తారు. డీసీసీబీ చైర్మన్ ముత్యాల రత్నం అసలు పేరు వెంకటేశ్వరరావు. రత్నం అంటే తప్ప ఎవరికీ తెలియదు. అత్తిలి మాజీ ఎమ్మెల్యే వీకేడీవీ సత్యనారాయణరాజును పాందువ్వ కనకరాజుగా పిలుస్తుంటారు. ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు అంటే ఎవరికీ తెలియదు. కలవపూడి శివ అంటేనే తెలుస్తుంది. పెనుగొండ మాజీ ఎమ్మెల్యే కూనపరెడ్డి రాఘవేంద్రరావును చినబాబు అంటారు.