Petition Inquiry
-
రఘురామ కృష్ణరాజు: పిటిషన్ 6 వారాలు వాయిదా
న్యూఢిల్లీ: నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజును కొట్టారనే ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ కొనసాగింది. అయితే తన పిటిషన్‌ను సవరించుకున్న రఘురామ తరఫు న్యాయవాది రోహత్గీ సవరించుకున్నారు. ప్రతివాదులుగా కేవలం కేంద్రం, సీబీఐ మాత్రమే కావాలనే విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తికి సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. అయితే సుప్రీంకోర్టు నిర్ణయంపై న్యాయవాది దవే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీ సర్కారు వాదనలు వినకుండా ఉత్తర్వులు ఇవ్వబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఆ కేసును ఆరు వారాలకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారిని కించపరుస్తూ, ఓ సామాజిక వర్గాన్ని, మతాన్ని టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేసిన రఘురామకృష్ణరాజుపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసి.. అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. -
‘రాఫెల్’పై విచారణకు సుప్రీం అంగీకారం
న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందంపై స్టే విధించాలని దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. వచ్చే వారం ఈ పిటిషన్‌ను విచారిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం ప్రకటించింది. తన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలన్న న్యాయవాది ఎంఎల్ శర్మ విజ్ఞప్తిని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. రాఫెల్ ఒప్పందంలో పలు లొసుగులు ఉన్నాయని, దాని అమలుపై స్టే విధించాలని శర్మ కోర్టును కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ రక్షణ మంత్రి మనోహర్ పరీకర్, వ్యాపారవేత్త అనిల్ అంబానీ, ఫ్రెంచ్ రక్షణ సంస్థ డసాల్ట్‌లపై కేసులు నమోదుచేసి విచారించాలని కోరారు. -
ఆ సీటు రద్దయింది
సుప్రీంలో టీ సర్కార్ అఫిడవిట్ సాక్షి, న్యూఢిల్లీ: కళింగ సామాజిక వర్గాన్ని బీసీ కులాల జాబితా నుంచి తొలగించడంతో మెడిసిన్‌లో ప్రవేశం కోల్పోయిన ఓ విద్యార్థికి సంబంధించిన పిటిషన్ విచారణలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. గత వారం ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు విద్యార్థి తరపున న్యాయవాది సుబ్బారావు వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు ఆధారంగా మెడిసిన్‌లో సీటు పొందారని, ఆ సందర్భంలో ఫీజు కూడా చెల్లించారని, ఆ తరువాత హైకోర్టు డివిజన్ బెంచి ఇచ్చిన తీర్పుతో ఆ సీటు రద్దయిందని, మరోసారి సీటు అంశం పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్.దత్తు నేతృత్వంలోని ధర్మాసనం సీటు ఉంటే పరిశీలించాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. హైకోర్టు తీర్పుతో సీటు రద్దయిందని, ఇప్పుడు సీట్లు కూడా లేవని, ఫీజు త్వరగా వెనక్కి ఇచ్చేస్తామంటూ ప్రభుత్వం గురువారం అఫిడవిట్ సమర్పించింది. దీంతో ధర్మాసనం ఈ ఏడాదికి ఏమీ చేయలేమని పేర్కొంది. అయితే కళింగ, శెట్టి బలిజ కులాలను బీసీ జాబితా నుంచి తొలగించిన అంశంపై మాత్రం విచారణ కొనసాగనుంది.