PG Medical fees hike
-
పీజీ వైద్య విద్య మళ్లీ భారం!
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో పీజీ వైద్య విద్య సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుత పరిణామాలను గమనిస్తే కేవలం డబ్బున్న వారికే వైద్య విద్య అన్నట్టుగా ఉంది. 2014 – 19 మధ్య బాబు పాలనలో మెడికల్ పీజీ ఫీజులను భారీగా పెంచేశారు. ఇది సామాన్య, పేద వర్గాలకు భారంగా మారడంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫీజులను గణనీయంగా తగ్గించారు. ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన జీవో రద్దవడంతో కొత్తగా పీజీ కోర్సుల్లో చేరుతున్న వారి పరిస్థితి గందరగోళంగా మారింది. పెరిగే ఫీజులు కట్టేలా బాండ్లు ఇప్పటివరకూ అన్ని ప్రైవేటు కళాశాలలకు ఒకే విధమైన ఫీజుల విధానం ఉంది. కొత్త విధానంలో కళాశాలల వారీగా ఫీజులు నిర్ణయిస్తారని తెలుస్తోంది. దీంతో తాజాగా అడ్మిషన్లు పొందిన విద్యార్థుల నుంచి 2020–23 బ్లాక్ పిరియడ్ ఫీజులపై 15 శాతం అదనంగా కట్టించుకుంటున్నారు. మరోవైపు ఫీజు పెరిగితే ఆ మొత్తాన్ని చెల్లించేలా నాన్ జ్యుడిíÙయల్ బాండ్ పేపర్‌పై అగ్రిమెంట్లు రాయించుకుంటున్నారు. చాలా ప్రైవేట్ కళాశాలల్లో ఎ, బి కేటగిరీ సీట్లు పొందిన విద్యార్థుల కుటుంబాలు ప్రస్తుతం ఉన్న ఫీజుల ఆధారంగా కోర్సు పూర్తయ్యే నాటికి ఎంత ఖర్చవుతుందో అంచనా వేసుకుని బ్యాంక్ రుణాలు, ఆస్తులు తనఖా లేదా అమ్మడం ద్వారా డబ్బు సమకూర్చుకుంటున్నారు. కోర్సు మధ్యలో ఫీజులు భారీగా పెరిగితే ఆర్థికంగా చిన్నాభిన్నం అవుతామని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఏడు రెట్లు ఫీజులు పెంచిన ఘనత 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం పీజీ వైద్య విద్యను కోటీశ్వరులే చదువుకొనేలా ఫీజులను ఏకంగా ఏడు రెట్లు పెంచింది. అప్పటివరకూ కన్వినర్ కోటాలో క్లినికల్ డిగ్రీ/డిప్లొమా కోర్సుల్లో ప్రైవేట్ కళాశాలల్లో రూ.2.90 లక్షలుగా ఉన్న ఫీజును 2017–18లో ఏకంగా రూ.6.90 లక్షలకు పెంచింది. యాజమాన్య కోటా ఫీజును రూ.5.25 లక్షల నుంచి రూ.24.20 లక్షలకు పెంచింది. దీంతో పేద విద్యార్థులకు కన్వినర్ కోటా కూడా కష్టంగా మారింది. పేద, మధ్య తరగతి వర్గాల కష్టాలను గమనించిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఫీజులను 40 నుంచి 50 శాతం తగ్గించింది. దీనిని సవాలు చేస్తూ మంత్రి నారాయణకు చెందిన నారాయణ మెడికల్ కాలేజీ యాజమాన్యం కోర్టుకు వెళ్లింది.సుప్రీం కోర్టు నారాయణ కళాశాల యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్య అంటే వ్యాపారం కాదంటూ తలంటింది. అంతేకాకుండా రూ.5 లక్షలు ఫైన్ వేసింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ ప్రైవేటు కళాశాలలకు మేలు చేయడం కోసం పేద, మధ్య తరగతి వర్గాలపై భారాన్ని మోపే ప్రయత్నం చేస్తోంది.ఎటు తేల్చుకోలేక పోతున్నారు ప్రస్తుతం బి కేటగిరి సీటుకు సంవత్సరానికి రూ.10 లక్షల వరకూ ఫీజు ఉంది. దీని ఆధారంగా నాలాంటి ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, మధ్య తరగతి కుటుంబాల వారు పిల్లలను బి కేటగిరి సీట్లలో చేర్చడానికి డబ్బులు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఫీజులు ఏడాదికి రూ.20 లక్షలకు పైబడి పెరుగుతాయని చెబుతున్నారు. కన్వినర్ కోటా ఫీజులు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ప్రభుత్వం మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇప్పుడున్న ఫీజుల ఆధారంగా కోర్సుల్లో చేరి, మధ్యలో ఫీజులు భారీగా పెరిగితే పరిస్థితి తలకిందులవుతుంది. మధ్యలో కోర్సు నిలిపేసినా పెనాల్టీలు కట్టాలి. దీంతో ఎటూ తేల్చుకోలేక విద్యార్థులు, తల్లిదండ్రులు సతమతం అవుతున్నారు. ఇప్పటికే రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తయింది. ప్రభుత్వం వెంటనే ఫీజుల విధానంపై స్పష్టత ఇవ్వాలి. ప్రస్తుతం ఉన్న ఫీజులను కొనసాగించాలి. – రఘుబాబు, వైద్య విద్యార్థి తండ్రి, గుంటూరు -
పీజీ మెడికల్ సీట్ల ఫీజుల పెంపు
సాక్షి, హైదరాబాద్: పీజీ మెడికల్ సీట్ల ఫీజును తెలంగాణ సర్కారు పెంచింది. కన్వీనర్ కోటా సీటు ఫీజును ఆయా కాలేజీల ప్రకారం రూ.7 లక్షల నుంచి రూ.7.75 లక్షలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బీ కేటగిరీ సీటు ఫీజు గతంలో రూ. 24.20 లక్షలు ఉండగా, కొన్నిచోట్ల అదే ఫీజు ఖరారు చేసింది. కొన్ని కాలేజీల్లో రూ.23 లక్షలకు తగ్గించింది. సీ కేటగిరీ సీటుకు గరిష్టంగా రూ.72 లక్షల వరకూ వసూలు చేసుకోవడానికి ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అనుమతినిచ్చింది. (వైరస్‌ను అంతం చేసే యూవీ బ్లాస్టర్...) ఇక డెంటల్ పీజీ ఏ కేటగిరీ ఫీజును రూ.5.15 లక్షలుగా, బీ కేటగిరీ సీటు ఫీజును రూ.8 లక్షలుగా నిర్ణయించారు. సీ కేటగిరీ సీటుకు రూ.12 లక్షల వరకూ వసూలు చేసుకోవచ్చు. వాస్తవానికి 2017లోనే మెడికల్ పీజీ సీటు ఫీజును రూ.6.90 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ పెంపుపై జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్, హెల్త్ రిఫార్మర్స్ డాక్టర్స్ అసోసియేషన్లు కోర్టుకు వెళ్లాయి. దీంతో ఫీజుల పెంపును తాత్కాలికంగా నిలిపివేస్తూ, తుది తీర్పు వచ్చే వరకు సగం ఫీజును వసూలు చేయాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. (తెలంగాణ నుంచి బయలుదేరిన రెండో రైలు) -
పీజీ వైద్య ఫీజుల పెంపునకు సర్కారు ఓకే!
- ప్రైవేటు కాలేజీల విన్నపాన్ని ఏఎఫ్ఆర్సీకి పంపిన వైద్యారోగ్యశాఖ - ఎంతెంత పెంచాలన్న దానిపై లేఖ తీసుకురమ్మని కాలేజీలకు సూచన సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని పీజీ వైద్య సీట్ల ఫీజు పెంపునకు సర్కారు పచ్చజెండా ఊపింది. ఫీజుల పెంపునకు సంబంధించి ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఇచ్చిన వినతిపత్రాన్ని ‘అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేషన్ కమిటీ (ఏఎఫ్ఆర్సీ)’కి పంపించింది. మరోవైపు ఫీజులు ఎంతెంత పెంచాలన్న దానిపై స్పష్టమైన ప్రతిపాదనలతో రావాలని ప్రైవేటు కాలేజీలకు సూచించింది. వాటిని కూడా ఏఎఫ్ఆర్సీకి పంపించి తుది నిర్ణయం తీసుకుంటామని వైద్యారోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. సీట్లను మార్చండి పీజీ వైద్య ఫీజులను పెంచకుంటే ఆయా సీట్లన్నింటినీ తాము ఉపసంహరించుకుంటామని రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీలు ప్రభుత్వానికి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కన్వీనర్ కోటాలోని 50 శాతం సీట్లుపోగా.. మిగతా సీట్లలో 25 శాతం బీ కేటగిరీగా, మరో 25 శాతం ఎన్నారై కోటా సీట్లుగా మార్చాలని డిమాండ్ చేశాయి. కన్వీనర్ కోటా, బీ కేటగిరీ సీట్లను ఉమ్మడి కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయాలని, ఎన్నారై కోటా సీట్లను సొంతంగా భర్తీ చేసుకోవడానికి అవకాశం కల్పించాలని కోరాయి. అన్ని రకాల ఫీజులను పెంచాలని కోరాయి. ప్రస్తుతం క్లినికల్ కన్వీనర్ కోటా సీటుకు రూ.3.2 లక్షల ఫీజు ఉండగా.. రూ.12 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశాయి. యాజమాన్య కోటా సీట్లకు ఫీజు రూ.5.8 లక్షలుగా ఉండగా.. వాటిని విభజించి బీ కేటగిరీ సీట్లకు రూ.25 లక్షలకు, ఎన్నారై కోటా సీట్లకు రూ.50 నుంచి 60 లక్షల వరకు పెంచాలని డిమాండ్ చేశాయి. అయితే ఈ ఫీజుల విషయంలో ప్రైవేటు కాలేజీల మధ్య ఏకాభిప్రాయం లేనందున పూర్తి స్పష్టతతో రావాలని సర్కారు సూచించినట్లు తెలిసింది. ఉమ్మడి కౌన్సెలింగ్‌పై సుప్రీంకు.. రాష్ట్రంలోని 8 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 460 క్లినికల్ పీజీ సీట్లు, 138 నాన్ క్లినికల్ సీట్లు ఉన్నాయి. క్లినికల్ సీట్లకు విద్యార్థుల నుంచి డిమాండ్ ఎక్కువ. ప్రస్తుతం 460 క్లినికల్ సీట్లలో 50 శాతం (230 సీట్లు) కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తుండగా.. మిగతా 230 సీట్లను యాజమాన్యాలు భర్తీ చేసుకుంటున్నాయి. ఇందుకోసం భారీగా ఫీజులు వసూలు చేసుకుంటున్నాయి. అయితే నీట్ ర్యాంకుల నేపథ్యంలో ఈసారి నుంచి ఉమ్మడి కౌన్సెలింగ్‌కు సర్కారు ఏర్పాట్లు చేస్తుండటంతో మెడికల్ కాలేజీల యాజమాన్యాలు కంగుతిన్నాయి. పీజీ వైద్య సీట్ల అడ్మిషన్లకు ఉమ్మడి కౌన్సెలింగ్ వద్దని, యాజమాన్య సీట్లను సొంతంగా భర్తీ చేసుకుంటామని పట్టుబట్టాయి. అయితే కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నందున తామేమీ చేయలేమని, ఉమ్మడి కౌన్సెలింగ్‌కు అంగీకరించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ప్రైవేటు మెడికల్ కాలేజీలు సుప్రీంకోర్టుకు వెళ్లినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.