వైభవంగా ‘ఫాల్గుణ మేళా’
రాధేశ్యామ్ నామస్మరణ... భక్తుల జయజయ ధ్వానాల మధ్య బుధవారం శ్యామ్‌బాబా ‘ఫాల్గుణి మేళా’ వేడుకలు ఘనంగా జరిగాయి. బుధవారం కాచిగూడ స్టేషన్ ఎదురుగా వీరన్నగుట్ట పై కొలువుదీరిన శ్యామ్మందిర్లో ఉదయం నుంచి పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించారు.
అనంతరం నగరంలోని మలక్‌పేట, అఫ్జల్‌గంజ్, గుల్జార్‌హౌజ్, చార్మినార్, నాచారం, దిల్సుఖ్నగర్, బేగంబజార్, సుల్తాన్‌బజార్ ప్రాంతాల నుంచి నిషాన్ శోభాయాత్రలు నిర్వహించారు. ఒంటెలు, గుర్రాలు ఈ ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యువకులు నేలపై పొర్లుకుంటూ మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ ఊరేగింపునకు శ్యామ్‌సేవా సమితి కార్యదర్శి శివశంకర్ అగర్వాల్, జీహెచ్ఎంసీ కాంగ్రెస్ ఫ్లోర్‌లీడర్, బర్కత్‌పుర కార్పొరేటర్ దిడ్డి రాంబాబు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో కాచిగూడ కార్పొరేటర్ కన్నె ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.