pharma firm
-
పేటెంట్ వివాదానికి స్వస్తి : షేరు దూకుడు
సాక్షి,ముంబై: దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ కు కాలం కలిసి వస్తోంది. తాజా పరిణామాలతో శుక్రవారం నాటి మార్కట్లో హైదరాబాద్‌కు చెందిన ఔషధ తయారీ సంస్థ డా.రెడ్డీస్ షేరు దూసుకు పోతోంది. వరుసగా నాల్గోరోజూ కొనుగోళ్ళ మద్దతుతో 5 శాతానికి పైగా ఎగిసి రికార్డు స్థాయిని నమోదు చేసింది. ఇటీవల నోవావాక్స్ కరోనా వ్యాక్సిన్ తయారీ ఒప్పందానికి తోడు, అమెరికాకు చెందిన సెల్జీన్తో వివాదం పరిష్కరించుకున్నట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ అధికారికంగా ప్రకటించింది. సెల్జీన్తో వివాదం పరిష్కరించుకున్నట్లు డాక్టర్ రెడ్డీస్ గురువారం నాటి రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. దీంతో ఇన్వెస్టర్ల ఆసక్తిభారీగా నెలకొంది. ('స్పుత్నిక్ వి' వ్యాక్సిన్ : డా.రెడ్డీస్ భారీ డీల్) కేన్సర్ వ్యాధుల చికిత్సలో ఉపయోగించే ‘రెవ్లీమిడ్’ ఔషధంపై యూఎస్ కంపెనీ ‘సెల్జీన్’ తో డాక్టర్ రెడ్డీస్‌కు పేటెంట్ వివాదాన్ని తాజాగా పరిష్కరించుకుంది. వ్యాజ్యం లోని అన్న అసాధారణమైన వివాదాల పరిష్కారం, రెగ్యులేటరీ ఆమోదానికి లోబడి డీల్ కుదిరినట్టు తెలిపింది. దీంతో 2022 మార్చి తరువాత ప్రపంచంలోని ‘టాప్-10’ ఔషధాల్లో ఒకటైన ‘రెవ్లీమిడ్’ ఔషధంపై సెల్జీన్ యూఎస్ మార్కెట్లో విక్రయించే అంశంపై ఇరు కంపెనీలు ఒప్పందాన్ని ఆమోదించినట్టు తెలిపింది. తద్వారా 2022 మార్చి తర్వాత యూఎస్‌లో ‘రెవ్లీమిడ్’ జనరిక్ ఔషధం విక్రయాలకు డాక్టర్ రెడ్డీస్‌కు అనుమతి లభించింది. అలాగే 2026 జనవరి 31 వరకు కొంత పరిమితితోను. ఆ తర్వాత పరిమితి లేకుండా విక్రయం చేసుకోవచ్చని డాక్టర్ రెడ్డీస్ నార్త్ అమెరికా జెనెరిక్స్ సీఈఓ మార్క్ కికుచి చెప్పారు. మల్టిపుల్ మైలోమా, మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్స్, మాంటిల్ సెల్ లింఫోమా, ఫోలిక్యులార్ లింఫోమా లాంటి కేన్సర్ వ్యాధుల చికిత్సలో ఈ ఔషధాన్ని వినియోగిస్తారు. కాగా వరుస నష్టాలకు చెక్ చెప్పిన లాభాల మార్కెట్లో నిఫ్టీ ఫార్మా దాదాపు 4 శాతం ఎగిసింది. ముఖ్యంగా డాక్టర్ రెడ్డీస్, లుపిన్, సిప్లా సన్ ఫార్మా లాభాల్లో కొనసాగుతున్నాయి. -
మౌత్ స్ర్పేతో నిమిషాల్లో కరోనా ఖతం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కోరలు చాస్తోంది. మరోవైపు ఈ మహమ్మారిని నిలువరించేందుకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేలా దిగ్గజ ఫార్మా సంస్థలు తీవ్ర ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నాయి. ఈ నేపథ్యంలో స్వీడన్ లైఫ్ సైన్స్ సంస్థ ఎంజైమాటికా కీలక విషయాన్ని ప్రకటించింది. తమ మౌత్ స్ప్రే ద్వారా కేవలం 20 నిమిషాల్లో కరోనా వైరస్‌ను నిరోధించవచ్చని ప్రకటించింది. మహమ్మారికి కారణమైన సార్స్-కోవ్2 వైరస్‌ను క్రియారహితం చేస్తుందని తమ ప్రాథమిక ఫలితాల్లో తేలిందని కంపెనీ సోమవారం ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. (9 కోట్ల మోతాదుల వ్యాక్సిన్ కొనుగోలు) ఎంజైమాటికాకు చెందిన మౌత్ స్ప్రే ‘కోల్డ్‌జైమ్’ కేవలం 20 నిమిషాల్లో కరోనా వైరస్‌ను 98.3 శాతం నాశనం చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఇన్-విట్రో (ల్యాబ్ టెస్ట్) అధ్యయన ఫలితాల ప్రకారం కరోనా జాతికి చెందిన వివిధ రకాల వైరస్‌లను నిరోధించడంలో ప్రభావవంతంగా పనిచేసినట్టుగా ఫలితాలు సూచించాయని కంపెనీ తెలిపింది. అలాగే నోటి ద్వారా వ్యాపించే ఇతర వైరస్‌లను కూడా ఇది నిరోధిస్తుందని ప్రకటించింది. తాజా అధ్యయనంలో కోవిడ్-19 మహమ్మారిని పూర్తిగా నాశనం చేయడంలో దీని సామర్థ్యాన్ని అంచనా వేయనున్నామని పేర్కొంది. అమెరికాకు చెందిన మైక్రోబాక్ లాబొరేటరీస్ ద్వారా ఇంటర్నేషనల్ టెస్ట్ మెథడ్‌లో ఈ అధ్యయనం నిర్వహించామని వెల్లడించింది. ఇది స్వతంత్ర, గుర్తింపు పొందిన ధృవీకరించబడిన ల్యాబ్ అని ఎంజైమాటికా వివరించింది. కోల్డ్‌జైమ్ ఎలా పని చేస్తుంది? ప్రధానంగా గ్లిసరాల్, అట్లాంటిక్ కాడ్ ట్రిప్సిన్లతో కూడిన సొల్యూషన్‌తో నిండిన కోల్డ్‌జైమ్‌ను ఉపయోగించి వైరసిడల్ ఎఫికసీ సస్పెన్షన్ పరీక్ష జరిగిందని కంపెనీ వెల్లడించింది. కోల్డ్‌జైమ్‌ను నోరు, గొంతు లోపలికి స్ప్రే చేస్తే ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీంతో స్థానికంగా వైరల్ లోడ్ తగ్గుతుంది. ఫలితంగా వైరస్ వ్యాప్తిని కూడా బాగా తగ్గిస్తుందని కంపెనీ పేర్కొంది. ప్రస్తుత ఇన్ విట్రో ఫలితాల ద్వారా నేరుగా క్లినికల్ పరీక్షలకు వెళ్లే శక్తి లేనప్పటికీ సమర్థవంతంగా వైరస్‌ను ఎదుర్కొనే సామర్ధ్యం కలిగి ఉందని వెల్లడైందని ఎంజైమాటికా సీఈఓ క్లాజ్ ఎగ్‌స్ట్రాండ్ ప్రకటించారు. -
ఎఫ్ డీసీ ఔషధాల నిషేధంపై ఫార్మా సంస్థలకు ఊరట
మార్చి 21 దాకా స్టే ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు న్యూఢిల్లీ: కొన్ని ఫిక్సిడ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్డీసీ) ఔషధాల నిషేధం అంశంలో ఫార్మా సంస్థలకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. నిషేధాజ్ఞలపై న్యాయస్థానం మార్చి 21 దాకా స్టే ఇచ్చింది. దీంతో పీఅండ్‌జీకి చెందిన విక్స్ యాక్షన్ 500 ఎక్స్ట్రా, రెకిట్ బెన్కిసర్ ఉత్పత్తి డీకోల్డ్, పిరమాల్‌కి చెందిన సారిడాన్ తదితర ఉత్పత్తులపై 21 దాకా నిషేధం వర్తించదు. సురక్షితమైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయన్న కారణంతో నిర్దిష్ట కాంబినేషన్లోని 300 పైగా ఔషధాలను కేంద్ర ఆరోగ్య శాఖ నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో విక్స్ యాక్షన్ 500 ఎక్స్ట్రా ట్యాబ్లెట్లు మొదలుకుని ఆస్కోరిల్ దగ్గు మందులు, క్యాండిడ్ ఇయర్ డ్రాప్స్ మొదలైనవి ఉన్నాయి. దీంతో నిషేధాజ్ఞలను సవాల్ చేస్తూ ఫైజర్, అబాట్ హెల్త్‌కేర్, మెక్లియోడ్స్ ఫార్మా, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, గ్లెన్‌మార్క్, రెకిట్ బెన్కిసర్ మొదలైన సంస్థలు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా తాజా ఉత్తర్వులు వచ్చాయి.