Pharmaceuticals Export Promotion Council of India
-
ఫార్మా ఎగుమతులు 4 శాతం అప్
హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో (ఏప్రిల్–అక్టోబర్) ఫార్మా ఎగుమతులు 4.22 శాతం వృద్ధి చెంది 14.57 బిలియన్ డాలర్లకు చేరాయి. గత ఏడాది ఇదే వ్యవధిలో ఎగుమతులు 13.98 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఇవి 27 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనాలు నెలకొన్నాయి. కేంద్ర వాణిజ్య శాఖలో భాగమైన ఫార్మా ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మెక్సిల్) డైరెక్టర్ జనరల్ ఉదయ భాస్కర్ ఈ విషయాలు వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఫార్మా ఎగుమతులు 24.62 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. జూలై, అక్టోబర్ ఎగుమతులు కాస్త తగ్గినప్పటికీ సెప్టెంబర్‌లో సానుకూలంగానే ఉన్నాయని, ఇదే ధోరణి పూర్తి ఆర్థిక సంవత్సరంలోను కొనసాగవచ్చని భాస్కర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అక్టోబర్‌లో ఫార్మా ఎగుమతులు 5.45 శాతం క్షీణించి 1.95 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలతో పాటు కొన్ని కీలక కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలపడటం కూడా ఎగుమతుల తగ్గుదలకు కారణమైనట్లు భాస్కర్ చెప్పారు. ‘ఉదాహరణకు భారత ఫార్మాకు టాప్ 5 మార్కెట్లలో నైజీరియా కూడా ఒకటి. అమెరికా డాలర్‌తో పోలిస్తే నైజీరియా నైరా క్షీణత కొనసాగుతుండటంతో ఆ దేశం దిగుమతులను తగ్గించుకోవాల్సి వస్తోంది‘ అని ఆయన తెలిపారు. ప్రస్తుతం భారత్‌కు అమెరికా, కెనడా, మెక్సికోతో పాటు యూరప్, ఆఫ్రికా దేశాలు టాప్ మార్కెట్లుగా ఉంటున్నాయి. -
24.44 బిలియన్ డాలర్లకు దేశీయ ఫార్మా ఎగుమతులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్ధిక సంవత్సరంలో దేశీయ ఫార్మా ఎగుమతులు 18 శాతం వృద్ధి చెంది 24.44 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2020 ఆర్ధిక సంవత్సరంలో ఇవి 20.58 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని ఫార్మాసూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మాగ్జిల్) తెలిపింది. ఈ ఏడాది మార్చిలో ఫార్మా ఎగుమతులు 2.3 బిలియన్ డాలర్లను దాటాయని పేర్కొంది. 2020 మార్చి నెలతో పోలిస్తే 48.5 శాతం వృద్ధి అని.. ఆ నెలలో ఎగుమతులు 1.54 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని ఫార్మాగ్జిల్ డైరెక్టర్ జనరల్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. 2020 మార్చిలో ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా సప్లయి చెయిన్‌లో అంతరాయం ఏర్పడిందని దీంతో ఎగుమతులు క్షీణించాయని.. ఈ కారణంగా ఈ ఏడాది మార్చి ఎగుమతుల్లో పెద్ద వృద్ధి రేటుగా అనిపిస్తున్నాయని చెప్పారు. గతేడాది ప్రపంచ ఫార్మా మార్కెట్ 1–2 శాతం క్షీణంచి.. ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న సమయంలో నాణ్యత, అందుబాటు కారణంగా భారతీయ జనరిక్ మందులకు డిమాండ్ ఏర్పడిందని చెప్పారు. దేశీయ ఫార్మా ఎగుమతులు అత్యధికంగా ఎగుమతి అవుతున్న దేశాల్లో 34 శాతం వాటాతో ఉత్తర అమెరికా ప్రధమ స్థానంలో ఉంటుంది. ఆ తర్వాత కెనడా 30 శాతం, మెక్సికో 21.4 శాతంగా ఉన్నాయి. -
ఫార్మాకు కలిసొచ్చిన ఉత్తర అమెరికా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19, లాక్డౌన్ అడ్డంకులు ఉన్నప్పటికీ భారత్ నుంచి ఔషధ ఎగుమతులు ఏప్రిల్–జూన్‌లో వృద్ధి చెందాయి. ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మెక్సిల్) గణాంకాల ప్రకారం గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఎగుమతులు 7.16 శాతం అధికమై రూ.37,875 కోట్ల నుంచి రూ.40,590 కోట్లకు చేరాయి. డ్రగ్ ఫార్ములేషన్స్, బయాలాజిక్స్ ఒక్కటే వృద్ధికి తోడైంది. ఇతర విభాగాలన్నీ నిరాశపరిచాయి. డ్రగ్ ఫార్ములేషన్స్, బయాలాజిక్స్ విభాగం 15.14 శాతం వృద్ధితో రూ.31,042 కోట్లు నమోదైంది. మొత్తం ఎగుమతుల విలువలో ఈ విభాగం వాటా ఏకంగా 76.48 శాతం ఉండడం గమనార్హం. వ్యాక్సిన్స్ 30 శాతం, ఆయుష్ 25, సర్జికల్స్ 15.8, బల్క్ డ్రగ్స్, డ్రగ్ ఇంటర్మీడియేట్స్ 8 శాతం, హెర్బల్ ప్రొడక్ట్స్ 2.5 శాతం తిరోగమన వృద్ధి సాధించాయి. ఎగుమతులకు ఊతమిచ్చే బల్క్ డ్రగ్స్, ఇంటర్మీడియేట్స్ ఈ త్రైమాసికంలో మాత్రం 8.38 శాతం మైనస్‌లోకి వెళ్లాయని ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ ఆర్.ఉదయ భాస్కర్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. దేశీయంగా ఫార్మా రంగం తిరోగమనంలో ఉన్నప్పటికీ ఏప్రిల్–జూన్‌లో ఎగుమతుల వృద్ధి సాధించడం విశేషమన్నారు. కొన్ని ప్రాంతాలు మినహా..: ఎగుమతుల్లో కొన్ని ప్రాంతాలు (రీజియన్లు) మినహా మిగిలినవన్నీ వృద్ధిని నమోదు చేశాయి. మధ్యప్రాచ్య మినహా ఆసియా, లాటిన్ అమెరికా దేశాలు, దక్షిణాసియా, కొన్ని యూరప్ దేశాలు నిరాశపరిచాయి. అయితే 2020 ఏప్రిల్–జూన్‌లో ఉత్తర అమెరికా మార్కెట్ ఎగుమతులకు ఊతమిచ్చింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ రీజియన్ 15.67 శాతం వృద్ధితో రూ.15,450 కోట్ల ఎగుమతులను నమోదు చేసింది. మొత్తం ఎక్స్‌పోర్ట్స్‌లో ఉత్తర అమెరికా వాటా అత్యధికంగా 38 శాతం ఉంది. వృద్ధి పరంగా మధ్య ప్రాచ్య దేశాలు 14 శాతం అధికమై రూ.2,220 కోట్లు, ఆసియాన్ ప్రాంతం 10.5 శాతం హెచ్చి రూ.2,580 కోట్లు సాధించాయి. పరిమాణంలో రెండో స్థానంలో ఉన్న ఆఫ్రికా మార్కెట్లు 0.4 శాతం పెరిగి రూ.6,510 కోట్లు, మూడో స్థానంలో ఉన్న యురోపియన్ యూనియన్ 6.9 శాతం అధికమై రూ.6,000 కోట్ల ఎగుమతులను నమోదు చేశాయి. -
అంచనాలు తప్పిన ఔషధ ఎగుమతులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఔషధ రంగానికి కోవిడ్–19 దెబ్బ పడింది. ఎగుమతుల అంచనా తప్పింది. 2019–20లో భారత్ నుంచి రూ.1,65,000 కోట్ల విలువైన ఔషధ ఉత్పత్తులు ఎగుమతి అవుతాయని ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఫార్మెక్సిల్) గతంలో అంచనా వేసింది. వాస్తవానికి రూ.1,54,350 కోట్ల విలువైన మందులు ఎగుమతి అయ్యాయి. అయితే 2018–19తో పోలిస్తే ఇది 7.57 శాతం వృద్ధి అని ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ రవి ఉదయ్ భాస్కర్ తెలిపారు. ఏప్రిల్–డిసెంబర్లో ఎగుమతుల వృద్ధి 11.5 శాతంగా ఉందని చెప్పారు. జనవరి–మార్చిలో 2.97 శాతం తిరోగమన వృద్ధి నమోదైంది. మొత్తం ఎగుమతుల్లో 72 శాతంగా ఉన్న డ్రగ్ ఫార్ములేషన్స్, బయలాజికల్స్ 9.5 శాతం వృద్ధి సాధించాయి. రెండవ అతిపెద్ద విభాగమైన బల్క్ డ్రగ్స్, డ్రగ్ ఇంటర్మీడియేట్స్ 0.73 శాతం తిరోగమన బాట పట్టాయి. 32.74 శాతం వాటా దక్కించుకున్న యూఎస్ఏకు ఎగుమతులు 15.8 శాతం అధికమై రూ.50,250 కోట్లకు చేరుకున్నాయి. -
ఫార్మా ఎగుమతులకు సుస్తీ!
5 శాతానికే పరిమితమైన వృద్ధి; వాణిజ్య శాఖ వృద్ధి లక్ష్యం 10%... రష్యా ఎగుమతుల్లో 15 క్షీణత దరల తగ్గుదల, నియంత్రణలూ కారణమే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్న ప్రభుత్వం గతేడాది ఫార్మా ఎగుమతుల విలువ రూ. 90,000 కోట్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డాలరుతో రూపాయి విలువ క్షీణించడంతో లబ్ధిపొందుదామనుకున్న దేశీయ ఫార్మా కంపెనీలకు అంతర్జాతీయ పరిణామాలు పెనుసవాళ్ళనే విసురుతున్నాయి. ఇప్పటికే అమెరికా వూర్కెట్ నియంత్రణలు, ధరల తగ్గుదలతో ఇబ్బంది పడుతున్న కంపెనీలకు తగ్గుతున్న ముడిచమురు ధరలు గట్టి షాక్‌నే ఇస్తున్నాయి. చమురు ఉత్పత్తిపై అత్యధికంగా ఆధారపడ్డ రష్యా, ఉక్రెయిన్ దేశాలు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటుండటంతో ఆ ప్రభావం ఫార్మా ఎగువుతులపై స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఈ ఏడాది ఫార్మా ఎగుమతుల్లో 10 శాతం వృద్ధి నమోదు చేయాలన్న కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ లక్ష్యం చేరుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. మొదటి ఎనిమిది నెలల కాలంలో దేశీయ ఫార్మా ఎగుమతుల వృద్ధి 5 శాతం దిగువకే పరిమితమైనట్లు ఫార్మాసూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియయా (ఫార్మెక్సిల్) తెలిపింది. ఏప్రిల్ నుంచి నవంబర్ నాటికి దేశీయ ఫార్మా ఎగుమతులు సుమారు 5 శాతం వృద్ధితో 10.22 బిలియన్ డాలర్లకు చేరాయి. గత మూడేళ్లుగా ఏటా 15% వృద్ధిని సాధిస్తున్నామని, పరిస్థితులను బట్టి ఈ ఏడాది వృద్ధిరేటు 10 శాతానికి కుదించినా అది చేరుకోవడం కష్టంగానే కనిపిస్తున్నట్లు ఫార్మెక్సిల్ డెరెక్టర్ జనరల్ పి.వి.అప్పాజీ తెలిపారు. ఈ ఏడాది మొదటి ఎనిమిది నెలల కాలంలో రష్యా ఫార్మా ఎగుమతుల్లో 15% క్షీణించాయి. గతేడాది సువూరు 350 మిలియన్ డాలర్లుగా ఉన్న రష్యా ఎగుమతులు ఈ 8 నెలల్లో 300 మిలియన్ డాలర్లుగా నమోదయియంది. గతేడాది మొత్తం దేశీయు ఫార్మా ఎగుమతులు 15 బిలియన్ డాలర్లు కాగా ఈ ఏడాది కనీసం 16.5 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని అంచనా వేశారు. రూపాయిల్లో పెరిగినా... రూపాయి విలువ క్షీణించడంతో దేశీయ కంపెనీల ఎగువుతుల ఆదాయం పెరిగినట్లు కనిపించినా డాలరు విలువలో వృద్ధి అంతగా ఉండకపోవచ్చని ఫార్మెక్సిల్ భావిస్తోంది. గతేడాది రూపాయల్లో చూస్తే ఎగుమతులు రూ. 90,000 కోట్లు ఉండగా, ఈ ఏడాది లక్ష కోట్ల అంచనాను దాటగలవున్న ధీమాను ఫార్మెక్సిల్ వ్యక్తం చేసింది. డాలరు విలువల్లో ఎగుమతుల వృద్ధి అంతగా లేకపోవడంపై కేంద్రం సీరియస్‌గా దృష్టిసారించినట్లు అప్పాజీ తెలిపారు. ముఖ్యంగా రష్యా కరెన్సీ రూబుల్ విలువ భారీగా పతనంకావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కంపెనీలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోందని, త్వరలోనే దీనికి ప్రత్యామ్నాయ మార్గాలను ప్రకటించనుందన్నారు. రష్యాకు ప్రధానంగా ఎగుమతి చేసే కంపెనీల్లో డాక్టర్ రెడ్డీస్, గ్లెన్వూర్క్, జేబీ కెమికల్స్, లూపిన్ తదితర దిగ్గజాలు ఉన్నాయి. డాక్టర్ రెడ్డీస్‌పై రష్యా ప్రభావం... హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న డాక్టర్ రెడ్డీస్ అమ్మకాల్లో 15 శాతం రష్యా నుంచే సవుకూరుతోంది. గడిచిన త్రైమాసికంలో డాక్టర్ రెడ్డీస్ రష్యా అమ్మకాల్లో 13 శాతం క్షీణత నమోదయియందని, ఇప్పుడు రూబుల్ ఇంకా పతనం కావడంతో వచ్చే రెండు త్రైమాసికాలు ఇదే విధమైన క్షీణత నమోదయ్యే అవకాశం ఉందని ఏంజెల్ బ్రోకింగ్ ఫార్మా రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ సరబ్జిత్ కౌర్ నన్గ్రా తెలిపారు. రాష్ట్రానికి చెందిన అరబిందో ఫార్మా, నాట్కో ఫార్మా కంపెనీలకు రష్యా నుంచి వచ్చే ఆదాయం స్వల్పంగా ఉండటంతో ఎగుమతులపై అంతగా ప్రభావం చూపే అవకాశం లేదని ఆ కంపెనీల ప్రతినిధులు తెలిపారు. ఎగుమతులను పెంచడానికి జపాన్ వంటి దేశాలకు విస్తరించాలని చూస్తున్నా అక్కడి నిబంధనలు అడ్డంకిగా మారాయి. ఎగుమతులను ప్రోత్సహించడానికి బ్రాండ్ ఇండియూ పేరుతో ప్రచార కార్యక్రవూన్ని చేపట్టినట్లు అప్పాజీ తెలిపారు. వచ్చే నాలుగు నెలల్లో పరిస్థితులు అనుకూలంగా మారితే లక్ష్యాన్ని చేరుకోగలవుని అప్పాజీ అభిప్రాయపడ్డారు.