ఫార్మా ఎగుమతులకు సుస్తీ! | Rouble fall to hit Indian pharma exports | Sakshi
Sakshi News home page

ఫార్మా ఎగుమతులకు సుస్తీ!

Published Tue, Jan 6 2015 1:45 AM | Last Updated on Sat, Sep 2 2017 7:15 PM

ఫార్మా ఎగుమతులకు సుస్తీ!

ఫార్మా ఎగుమతులకు సుస్తీ!

5 శాతానికే పరిమితమైన వృద్ధి; వాణిజ్య శాఖ వృద్ధి లక్ష్యం 10%...
రష్యా ఎగుమతుల్లో 15 క్షీణత    
దరల తగ్గుదల, నియంత్రణలూ కారణమే
ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్న ప్రభుత్వం
గతేడాది ఫార్మా ఎగుమతుల విలువ రూ. 90,000 కోట్లు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డాలరుతో రూపాయి విలువ క్షీణించడంతో లబ్ధిపొందుదామనుకున్న దేశీయ ఫార్మా కంపెనీలకు అంతర్జాతీయ పరిణామాలు పెనుసవాళ్ళనే విసురుతున్నాయి. ఇప్పటికే అమెరికా వూర్కెట్ నియంత్రణలు, ధరల తగ్గుదలతో ఇబ్బంది పడుతున్న కంపెనీలకు తగ్గుతున్న ముడిచమురు ధరలు గట్టి షాక్‌నే ఇస్తున్నాయి.

చమురు ఉత్పత్తిపై అత్యధికంగా ఆధారపడ్డ రష్యా, ఉక్రెయిన్ దేశాలు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటుండటంతో ఆ ప్రభావం ఫార్మా ఎగువుతులపై స్పష్టంగా కనిపిస్తోంది.  దీంతో ఈ ఏడాది ఫార్మా ఎగుమతుల్లో 10 శాతం వృద్ధి నమోదు చేయాలన్న కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ లక్ష్యం చేరుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. మొదటి ఎనిమిది నెలల కాలంలో దేశీయ ఫార్మా ఎగుమతుల వృద్ధి 5 శాతం దిగువకే పరిమితమైనట్లు ఫార్మాసూటికల్స్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియయా (ఫార్మెక్సిల్) తెలిపింది.

ఏప్రిల్ నుంచి నవంబర్ నాటికి దేశీయ ఫార్మా ఎగుమతులు సుమారు 5 శాతం వృద్ధితో 10.22 బిలియన్ డాలర్లకు చేరాయి. గత మూడేళ్లుగా ఏటా 15% వృద్ధిని సాధిస్తున్నామని,  పరిస్థితులను బట్టి ఈ ఏడాది వృద్ధిరేటు 10 శాతానికి కుదించినా అది చేరుకోవడం కష్టంగానే కనిపిస్తున్నట్లు  ఫార్మెక్సిల్ డెరెక్టర్ జనరల్ పి.వి.అప్పాజీ తెలిపారు. ఈ ఏడాది మొదటి ఎనిమిది నెలల కాలంలో రష్యా ఫార్మా ఎగుమతుల్లో 15% క్షీణించాయి.

గతేడాది సువూరు 350 మిలియన్ డాలర్లుగా ఉన్న రష్యా ఎగుమతులు ఈ 8 నెలల్లో 300 మిలియన్ డాలర్లుగా నమోదయియంది. గతేడాది మొత్తం దేశీయు ఫార్మా ఎగుమతులు 15 బిలియన్ డాలర్లు కాగా ఈ ఏడాది కనీసం 16.5 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని అంచనా వేశారు.
 
రూపాయిల్లో పెరిగినా...
రూపాయి విలువ క్షీణించడంతో  దేశీయ కంపెనీల ఎగువుతుల ఆదాయం పెరిగినట్లు కనిపించినా డాలరు విలువలో వృద్ధి అంతగా ఉండకపోవచ్చని ఫార్మెక్సిల్ భావిస్తోంది. గతేడాది రూపాయల్లో చూస్తే ఎగుమతులు రూ. 90,000 కోట్లు ఉండగా, ఈ ఏడాది లక్ష కోట్ల అంచనాను దాటగలవున్న ధీమాను ఫార్మెక్సిల్ వ్యక్తం చేసింది. డాలరు విలువల్లో ఎగుమతుల వృద్ధి అంతగా లేకపోవడంపై కేంద్రం సీరియస్‌గా దృష్టిసారించినట్లు అప్పాజీ తెలిపారు.

ముఖ్యంగా రష్యా కరెన్సీ రూబుల్ విలువ భారీగా పతనంకావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కంపెనీలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోందని, త్వరలోనే దీనికి ప్రత్యామ్నాయ మార్గాలను ప్రకటించనుందన్నారు. రష్యాకు ప్రధానంగా ఎగుమతి చేసే కంపెనీల్లో డాక్టర్ రెడ్డీస్, గ్లెన్‌వూర్క్, జేబీ కెమికల్స్, లూపిన్ తదితర దిగ్గజాలు ఉన్నాయి.
 
డాక్టర్ రెడ్డీస్‌పై రష్యా ప్రభావం...
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న డాక్టర్ రెడ్డీస్ అమ్మకాల్లో 15 శాతం రష్యా నుంచే సవుకూరుతోంది. గడిచిన త్రైమాసికంలో డాక్టర్ రెడ్డీస్ రష్యా అమ్మకాల్లో 13 శాతం క్షీణత నమోదయియందని, ఇప్పుడు రూబుల్ ఇంకా పతనం కావడంతో వచ్చే రెండు త్రైమాసికాలు ఇదే విధమైన క్షీణత నమోదయ్యే అవకాశం ఉందని ఏంజెల్ బ్రోకింగ్ ఫార్మా రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ సరబ్జిత్ కౌర్ నన్‌గ్రా తెలిపారు.

రాష్ట్రానికి చెందిన అరబిందో ఫార్మా, నాట్కో ఫార్మా కంపెనీలకు రష్యా నుంచి వచ్చే ఆదాయం స్వల్పంగా ఉండటంతో ఎగుమతులపై అంతగా ప్రభావం చూపే అవకాశం లేదని ఆ కంపెనీల ప్రతినిధులు తెలిపారు. ఎగుమతులను పెంచడానికి జపాన్ వంటి దేశాలకు విస్తరించాలని చూస్తున్నా అక్కడి నిబంధనలు అడ్డంకిగా మారాయి. ఎగుమతులను ప్రోత్సహించడానికి బ్రాండ్ ఇండియూ పేరుతో ప్రచార కార్యక్రవూన్ని చేపట్టినట్లు అప్పాజీ తెలిపారు. వచ్చే నాలుగు నెలల్లో పరిస్థితులు అనుకూలంగా మారితే లక్ష్యాన్ని చేరుకోగలవుని అప్పాజీ అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement