జీవీకే బయోతో
స్వీడన్ కంపెనీ జట్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషదాల పరిశోధనలో జీవికే బయోతో కలిసి పనిచేయడానికి స్వీడన్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ మెడ్విర్ ముందుకొచ్చింది. ఇన్ఫెక్షన్తో వచ్చే వ్యాధులు, క్యాన్సర్ చికిత్స పరిశోధనలో మెడ్విర్కి మంచి పట్టుంది. కొద్ది నెలల క్రితం జీవీకే బయో పరిశోధన నివేదికలపై యూరోపియన్ మెడిసెన్స్ ఏజెన్సీ అనుమానాలు వ్యక్తం చేసిన తర్వాత తొలిసారిగా ఒక విదేశీ కంపెనీ కలిసి పనిచేయడానికి ముందుకొచ్చింది.