విశాఖ పోర్ట్ అభివృద్ధికి మరిన్ని ప్రణాళికలు
విజయనగరం టౌన్, న్యూస్‌లైన్ : విశాఖ పోర్ట్ ట్రస్ట్‌ను మరింతగా అభివృద్ధి చేసేం దుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, పోర్ట్ సేవలు ఆయూ పరిశ్రమల యూజమాన్యాలు వినియోగించుకోవాలని విశాఖ పోర్ట్ ట్రస్ట్ డిప్యూటీ చైర్మన్ జీవీఎల్ సత్యకుమార్ అన్నారు. ఇక్కడ ఓ హోటల్లో ట్రేడ్ మీట్‌ను బుధవా రం నిర్వహించారు.
ఇందులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ 1933లో ఏడాదికి మూడు లక్షల టన్నుల కెపాసి టీ ఉండే ట్రస్ట్ 2014 నాటికి 800 లక్షల టన్నుల సామర్థ్యం ద్వారా ఎగుమతులు, దిగుమతులు జరుగుతున్నాయని చెప్పారు. జిల్లాలో ఉన్న పలు పరిశ్రమలు యూజ మాన్యాలతో సంప్రదింపులు జరిపి, విశాఖ పోర్ట్ ట్రస్ట్ సేవలపై పూర్తి స్థారుులో అవగాహన కల్పిస్తున్నట్టు తెలి పారు.
ఇతర పోర్టుల కంటే ధీటుగా విశాఖ పోర్టును అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామన్నారు పోర్టు సమీపంలో సముద్ర తీరం లోతు పెంచి పెద్ద పెద్ద షిప్పులు వచ్చే విధంగా ఏర్పాటు చేశామని చెప్పారు. జిల్లాలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు పోర్టు ట్రస్ట్ అందిస్తున్న సేవలను వినియోగించుకోవాలని సూచించారు. వ్యాపారంలో ప్రగతిని సాధించేందుకు వీలుగా అభివృద్ధి చేశామన్నారు.ప్రస్తుతం రోజుకు లక్ష టన్నుల మేరకు సరుకులను ఎగుమతి చేయగల సామర్థ్యం ఉందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విని యోగించడం ద్వారా కాలుష్యం బారిన పడకుండా చూశామని తెలిపారు.
జిల్లాలోని జిందాల్, ఫేకర్, ఎన్సీఎస్ సుగర్స్, మహామాయ, ఆంధ్రా ఫెర్రో ఎల్లారుుస్ వంటి పెద్ద పరిశ్రమలకు అందుబాటులో ఉండే విధం గా పోర్టు తన సేవలను విస్తృతం చేస్తోందన్నారు. మీట్ లో పోర్ట్ అధికారులు కల్యాణ్ చక్రవర్తి, ఎం.సుధీర్, కె.సత్యనారాయణ, సెంథిల్‌కుమార్, సీహెచ్ అవతారంనాయుడు, డాక్టర్ ఎస్వీ భాస్కరరావు పాల్గొన్నారు.