Philanthropy charity organization
-
‘గివింగ్పీఐ’: దానకర్ణులు ఒక్కటయ్యారు..లక్ష కోట్లు విరాళం ఖాయం!
ముంబై: దాతల కుటుంబాలు చేతులు కలిపాయి. విప్రో ప్రేమ్జీ, జిరోదా నిఖిల్ కామత్, రోహిణి నీలేకని, నిసా గోద్రెజ్ సంయుక్తంగా ‘గివింగ్పీఐ’ పేరుతో నెట్వర్క్ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. 2030 నాటికి ఏటా బిలియన్ డాలర్లను సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన (ఎస్డీజీ) కోసం సమీకరించాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఈ ప్లాట్ఫామ్లో భాగమయ్యే ప్రతీ సభ్యుడు/సభ్యురాలు ఏటా కనీసం రూ.50 లక్షలను విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా 2030 నాటికి 5,000 మంది సభ్యుల స్థాయికి నెట్వర్క్ను విస్తరించాలని వీరు నిర్ణయించారు. అదితి, రిషబ్ ప్రేమ్జీ, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్, మనీషా, ఆశిష్ ధావన్, నిఖిల్ కామత్, నిసా గోద్రెజ్, రాజన్ నవాని, రోహిణి నీలేకని, స్కోల్ ఫౌండేషన్, టెరా సింగ్, వచాని, వాసవి భారత్ రామ్, వివేక్జైన్ ఈ నెట్వర్క్ ఏర్పాటుకు చేతులు కలిపిన వారిలో ఉన్నారు. భారత్లో 113 మంది బిలియనీర్లు, 6,884 అధిక ధనవంతులు ఉన్నారు. వీరి సంఖ్య వచ్చే ఐదేళ్లలో 12,000కు చేరుకుంటుందని బెయిన్ అండ్ కంపెనీ నివేదిక చెబుతోంది. అంతర్జాతీయంగా ఉన్న తోటివారిని వీరు స్ఫూర్తిగా తీసుకుని కుటుంబ దాతృత్వానికి ముందుకు వస్తే భారత్లో అదనంగా రూ.60,000 కోట్ల నుంచి రూ.లక్ష కోట్లు సమకూరతాయని అంచనా. -
మూడింతలు పెరిగిన సంపన్నుల విరాళాలు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నప్పటికీ అత్యంత సంపన్న కుటుంబ(హెచ్ఎన్ఐ) విరాళాలు 2020 ఆర్థిక సంవత్సరంలో మూడింతలు పెరిగి.. రూ.12,000 కోట్లకు చేరాయి. 2019 ఆర్థిక సంవత్సరం నుంచి చూస్తే ప్రైవేట్ రంగం ఇచ్చిన విరాళాల్లో మూడింట రెండొంతుల వాటాకు చేరాయి. బెయిన్ అండ్ కంపెనీ, దస్రా సంస్థలు కలిపి రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2020 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్ రంగ (విదేశీ, కార్పొరేట్, రిటైల్, అత్యంత సంపన్న వర్గాల(హెచ్ఎన్ఐ) కుటుంబాల) విరాళాలు మొత్తం రూ. 64,000 కోట్లుగా ఉండగా.. ఇందులో కుటుంబాల వాటా దాదాపు 20 శాతంగా ఉంది. మొత్తం నిధుల్లో విదేశీ వనరుల నుంచి వచ్చినది 25 శాతంగా ఉండగా, దేశీ కంపెనీలు కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) కింద కేటాయించినది 28 శాతంగాను, రిటైల్ ఇన్వెస్టర్ల వాటా మరో 28 శాతంగాను ఉంది. అయితే, దాతృత్వ కార్యక్రమాలకు ఇబ్బడి ముబ్బడిగా విరాళాలు వస్తున్నప్పటికీ సామాజిక సంక్షేమం మాత్రం కుంటినడకనే నడుస్తుండటం గమనార్హమని నివేదిక పేర్కొంది. ‘కుటుంబ దాతృత్వ కార్య కలాపాలు.. భారత అభివృద్ధి అజెండాను తీర్చిదిద్దేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. వీటికి మరింత ప్రోత్సాహం లభిస్తే దేశ శ్రేయస్సుకు తోడ్పడగలవు‘ అని తెలిపింది. విరాళాల్లో అత్యధిక భాగం వాటా విద్య, ఆరోగ్య రంగాలదే ఉంటోందని నివేదిక పేర్కొంది. విద్యా రంగానికి 47 శాతం, ఆరోగ్య రంగానికి 27 శాతం వాటా ఉందని వివరించింది. చదవండి: పిల్లల కోసం తల్లిదండ్రులు ఇలా ఆలోచిస్తే మంచిదే -
అవయవదానానికి 103 మంది విద్యార్థుల సుముఖత
విజయనగరం(చీపురుపల్లి): ఒకేసారి 103 మంది విద్యార్థులు అవయవదానికి ముందుకొచ్చి తమ గొప్ప మనసును చాటుకున్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి పట్టణంలోని శ్రీహర డిగ్రీ కళాశాలలో మానవీయత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బుధవారం అవయవదానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్పందించిన విద్యార్థులు మరణాంతరం తమ అవయవాలను దానం చేయడానికి అంగీకరిస్తూ అక్కడికక్కడే పత్రాలపై సంతకాలు చేసి మానవీయత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు బి.వి.గోవిందరాజులుకు అందజేశారు. అంతకుముందు కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో గోవిందరాజులు మాట్లాడుతూ... ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అవయవదానం చేయడం సామాజిక బాధ్యతగా ప్రతీ ఒక్కరూ గుర్తించాలన్నారు. దేశంలో కేవలం 0.16 శాతం మాత్రమే అవయవదానం జరుగుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజిన్ కార్యదర్శి ఐ.శ్రీను, శ్రీహర డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ ఎమ్.రాము, ప్రిన్సిపాల్ ఎమ్.శంకర్, అకడమిక్ కోఆర్డినేటర్ గోవింద్ తదితరులు పాల్గొన్నారు.