విద్యార్థి కిడ్నాప్
గుత్తి: పార్కులో ఆడుకుంటున్న చిన్నారిని గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి గుత్తి పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..అనంతపురంలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పనిచేసే అబ్రహాం కుమారుడు ఫిలిప్ విక్టర్ (7) గుత్తి ఆర్ఎస్లోని సెయింట్ మెరీస్‌లో 2వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు రోజు కావడంతో సాయంత్రం వేళ స్థానికంగా ఉన్న ఓ పార్కుకు తండ్రితో కలిసి Ðð ళ్లాడు. అయితే విక్టర్ చిన్నారులతో కలిసి ఆడుకుంటుండగా అబ్రహాం ఇంటికి వెళ్లిపోయాడు. తిరిగి రాత్రి 8 గంటల వేళ వచ్చి చూడగా పిల్లాడు కనిపించలేదు. అయితే బంధులెవరైనా తీసుకువెళ్లి ఉంటారని భావించిన అబ్రహాం ఇంటివద్దే చిన్నారికోసం ఎదురు చూశాడు. రాత్రి 11 గంటలైనా తన కుమారుడు ఇంటికి చేరకపోవడంతో గుత్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.