Philippines President Rodrigo Duterte
-
సంచలన ఆదేశాలు : గీత దాటితే.. కాల్చి చంపండి
మనీలా : కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలు భేఖాతరు చేస్తున్న వారిపై ఫిలిప్ఫీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించడం, వైద్య కార్మికులను దూషించడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని ఆయన చెప్పారు. ఇక ప్రభుత్వ ఆదేశాలను పెడచెవినపెట్టి కరోనా వ్యాప్తికి కారణమవుతున్నవారి విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిని సహించేది లేదని, వారిని కాల్చి చంపండి అంటూ రోడ్రిగో పోలీసులు, మిలటరీ అధికారులను ఆదేశించారు. దేశంలో లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న వారికి 4బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఆహారకొరతతో ఒక్కరు కూడా మరణించకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ గృహ నిర్బంధంలో ఉండి కరోనా వైరస్ ప్రబలకుండా సహకరించాలని కోరారు. ప్రతీరోజూ వందల సంఖ్యలో కరోనా వైరస్ కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో సమస్య తీవ్రత దృష్ట్యా లాక్ డౌన్ అమలు చేయాలని రోడ్రిగో డ్యూటెర్టే కోరారు. అయితే మానవ హక్కుల కార్యకర్తలతోపాటూ, నెటిజన్లు సామాజిక మాధ్యమాల ద్వారా అధ్యక్షుడి నిర్ణయాన్ని తీవ్రంగాఖండించారు. దీంతో కరోనా తీవ్రత దృష్ట్యా దేశాధ్యక్షుడు డ్యూటెర్టే ఇలా మాట్లాడారని, ప్రస్తుత పరిస్థితిని పోలీసులు అర్థం చేసుకోగలరని, పోలీసులు సంయమనంతో వ్యవహరించి ఎవరినీ కాల్చవద్దని ఫిలిఫ్పీన్స్ పోలీసు చీఫ్ కోరారు. -
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో సంచలన వ్యాఖ్యలు
మనీలా: ఫిలిప్పీన్స్ దేశ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టె (73)మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తను అనారోగ్యంతో బాధపడుతున్నాననీ, అది తీవ్రమైతే పదవీ విరమణకు సిద్ధంగా ఉన్నానంటూ అనూహ్య ప్రకటన చేశారు. ‘నా ఆరోగ్య పరిస్థితి ఏమిటో ఇంకా స్పష్టంగా తెలియదు. వైద్య పరీక్షల ఫలితాలకోసం ఎదురు చూస్తున్నాను. ఒక వేళ క్యాన్సర్ లాంటి తీవ్ర అనారోగ్యం పాలయితే.. అదీ థర్డ్ స్టేజ్‌లో ఉండి, ఇక నివారణ అసాధ్యం అని తేలితే’ అధ్యక్ష పదవిని వీడడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు. మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేట్లుతో ప్రసంగిస్తూ గురువారం రోడ్రిగో ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో డ్రగ్ మాఫియాపై ప్రత్యక్ష యుద్దం ప్రకటించిన రొడ్రిగో అధికారాన్ని 2016లో చేపట్టినప్పటి నుంచి లక్షలాదిమందిని హతమార్చి ఆధునిక హిట్లర్‌గా విమర్శలు పాలయ్యాడు. మద్యపానం, ధూమపానం సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయనకు ఇప్పటికే ఎండోస్కోపీ, కోలొనోస్కోపీ పరీక్షలు జరిగాయి. మరిన్ని పరీక్షలకు వైద్యులు సూచించినట్టు సమాచారం. మరోవైపు అధ్యక్షుడిగా రోడ్రిగో ఆరేళ్ల పదవీ కాలం 2022తో ముగియనుంది. కాగా సభావేదికపై దేశాధ్యక్షుడు రోడ్రిగో ఇటీవల ఓ మహిళకు బహిరంగంగా ముద్దుపెట్టడం తీవ్ర విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే. -
ఎవరీ పనిలేని దేవుడు?
సాక్షి, ముంబై: ఎవరీ పనిలేని దేవుడు? అంటూ వ్యాఖ్యలు చేసి ఫిలీప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డ్యూటర్ట్ వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం ఒక కార్యక్రమంలో ఆయన బైబిల్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బైబిల్ రచనపై మాట్లాడుతూ.. దేవుడు ఈవ్, ఆడంను ఎందుకు సృష్టించాలి. వారు సన్మార్గంలో నడవక మనందరికీ ఎందుకు జన్మనివ్వాలి? వారి పిల్లలమైన మనం ఇలా ఎందుకుండాలి? అని అన్నారు. మనం సృష్టించిన ప్రతి వస్తువు ఏదో ఒక సందర్భంలో దాని స్వభావానికి భిన్నంగా పని చేయొచ్చు కదా వ్యాఖ్యానించారు. ఫిలిప్పీన్స్‌లో నార్కోటిక్స్ డ్రగ్స్ మాఫియాను అరికట్టే క్రమంలో దేశాధ్యక్షుడు రొడ్రిగో డ్యూటర్ట్ ఎందరో చావులకు కారణమయ్యాడంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అమాయకులను పొట్టనబెట్టుకున్నారంటూ క్యాథలిక్ క్రైస్తవ మత పెద్దలు కూడా ఆయనపై తరచూ విమర్శలు గుప్పిస్తున్నారు. తనపై ఆరోపణలు చేసిన మత పెద్దలను విమర్శించే క్రమంలో.. డ్యూటర్ట్ క్రైస్తవ మత విశ్వాసాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో దేశ వ్యాప్తంగా దుమారం రేగింది. క్యాథలిక్ క్రైస్తవంపై, బైబిల్‌పై, దేవుడిపై ఇలాంటి కించపరిచే వ్యాఖ్యలు చేసే వ్యక్తి దేశానికి అధ్యక్షుడుగా ఉండరాదంటూ బిషప్ పోబ్లో విర్జిలో డేవిడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధ్యక్షుడిగా డ్యూటర్ట్ పనిరాడంటూ ఫేస్బుక్లో కామెంట్ చేశారు. దేశంలో దాదాపు 80 శాతం ఉన్న క్యాథలిక్ క్రైస్తవుల మత విశ్వాసాల పట్ల అధ్యక్షుడి తీరు సరిగా లేదని సోషల్ మీడియాలో ఆయనపై దుమ్మెత్తి పోస్తున్నారు. -
అధ్యక్షుడే లక్ష్యంగా బాంబు దాడి
-
అధ్యక్షుడే లక్ష్యంగా బాంబు దాడి
లానోవో డెల్ సుర్: పిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటర్టేకు పెను ప్రమాదం తప్పింది. ఆయనను లక్ష్యంగా దుండగులు బాంబు దాడికి పాల్పడ్డారు. గుర్తు తెలియని దుండగులు ఐఈడీ (ఇంప్రూవైస్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్)ను పేల్చారు. దీని ధాటికి అధ్యక్షుడి రక్షణ బాధ్యతలు చూసే సిబ్బంది(పీఎస్జీ)లో ఏడుగురు, ప్రత్యేక ఆర్మీ బలగంలోని ఇద్దరు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మారావి నగరంలో ఈ ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. మిలిటరీ అధికార ప్రతినిధి మేజర్ ఫైల్ మాన్ టాన్ ఈ ఘటనను ధృవీకరించారు. మానావి నగరం మీదుగా అధ్యక్షుడి కాన్వాయ్ వెళ్లే సమయంలో అధ్యక్షుడి ముందు వెళుతున్న ప్రత్యేక భద్రతా సిబ్బంది ఈ బాంబు దాడి బారిన పడ్డారు. మొత్తం 50 మంది వివిధ రకాల ప్రత్యేక సిబ్బంది అధ్యక్షుడి కాన్వాయ్ ముందు వెళుతుంటుంది. వీరి వెనుక పత్రికా సిబ్బంది, ఆర్మీ సిబ్బంది ఉంటారు. మౌతే గ్రూప్ అనే ఓ ఇస్లామిస్ట్ టెర్రరిస్టు గ్రూప్ ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు.