అధ్యక్షుడే లక్ష్యంగా బాంబు దాడి
మిలిటరీ అధికార ప్రతినిధి మేజర్ ఫైల్ మాన్ టాన్ ఈ ఘటనను ధృవీకరించారు. మానావి నగరం మీదుగా అధ్యక్షుడి కాన్వాయ్ వెళ్లే సమయంలో అధ్యక్షుడి ముందు వెళుతున్న ప్రత్యేక భద్రతా సిబ్బంది ఈ బాంబు దాడి బారిన పడ్డారు. మొత్తం 50 మంది వివిధ రకాల ప్రత్యేక సిబ్బంది అధ్యక్షుడి కాన్వాయ్ ముందు వెళుతుంటుంది. వీరి వెనుక పత్రికా సిబ్బంది, ఆర్మీ సిబ్బంది ఉంటారు. మౌతే గ్రూప్ అనే ఓ ఇస్లామిస్ట్ టెర్రరిస్టు గ్రూప్ ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు.