ఇప్పటికింకా నా వయసు నూట పదహారు సంవత్సరాలే!
సమ్థింగ్ స్పెషల్
ఫిలోమేన వయసు ఇప్పుడు నూట పదహారు సంవత్సరాలు.
‘‘మీ దీర్ఘాయుష్షు వెనుక రహస్యం?’’
‘‘ఈ వయసులోనూ మీరు ఇంత చురుకుగా ఎలా ఉండగలుగుతున్నారు?’’ బాపతు ప్రశ్నలకు ఆమె చెప్పే సరదా సమాధానం-
‘‘నాకు రెండు వయసులు ఉన్నాయి. ఒకటి శారీరక వయసు. రెండు మానసిక వయసు. నా మానసిక వయసు పదహారు సంవత్సరాలే’’ పెరూలోని అండెస్ గ్రామంలో ఒక పేద కుటుంబంలో పుట్టిన ఫిలోమేన తన ఆరోగ్యానికి సంబంధించి పని గట్టుకొని చేసే ప్రత్యేక వ్యాయమాలు ఏమీలేవు. మేక పాలు ఇష్టంగా తాగుతుంది. మేక మాంసాన్ని, బంగాళదుంపలను మరింత ఇష్టంగా తింటుంది. ఇప్పటి వరకు తన చిన్ని గ్రామాన్ని ఎన్నడూ విడిచి వెళ్లలేదు.
పోషక విలువలు ఉన్న ఆహారాన్ని భుజించడమే తన దీర్ఘాయుష్షు వెనకగల రహస్యం అని చెబుతుంది ఫిలోమేన. ఆమె ఏ కారణం చెబుతున్నప్పటికీ... ఫిలోమేన దీర్ఘాయుష్షు రహస్యం కనుక్కోవడానికి కొందరు పరిశోధకులు ఇప్పుడు రంగంలోకి దిగారు.