11న ‘సాక్షి’ ఆధ్వర్యంలో మదుపరుల అవగాహన సదస్సు
సిటీబ్యూరో: ‘సాక్షి’ మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్, ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ బ్యాంక్ సంయుక్తంగా ఈ నెల 11న సాయంత్రం 5 గంటలకు
కూకట్‌పల్లిలోని జేఎన్టీయూహెచ్ యూజీసీ ఆడిటోరియంలో ఔత్సాహిక మదుపరుల కోసం అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాయి.
స్టాక్ మార్కెట్‌పై అవగాహన, లాభాలు పొందడం ఎలా? వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలు, బీమా అవసరాలు, పిల్లల చదువులు, వివాహం, పదవీ విరమణ ప్రణాళికలు, భవిష్యత్తు అవసరాల కోసం అనువైన పెట్టుబడి వంటి అంశాలపై నిపుణులు సలహాలు, సూచనలు ఇస్తారు. ఆసక్తిగల వారు ముందస్తుగా తమ పేర్లను 95055 55020 ఫోన్ నెంబర్లో నమోదు చేసుకోవాలి.