Phuket
-
థాయ్‌లాండ్‌లో భారత టెకీ దుర్మరణం
న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ థాయ్‌లాండ్‌లో దుర్మరణం పాలయ్యారు. ఫుకెట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వివరాలు.. మధ్యప్రదేశ్‌లోని ఛత్తార్‌పూర్‌కు చెందిన ప్రఙ్ఞా పలివాల్(29) బెంగళూరులో టెకీగా పనిచేస్తున్నారు. విధుల్లో భాగంగా ఫుకెట్‌లో జరుగుతున్న కంపెనీ వార్షిక సదస్సుకు ఆమె హాజరయ్యారు. ఈ క్రమంలో బుధవారం జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. మృత్యువాతపడ్డారు. ఈ విషయాన్ని ప్రఙ్ఞా సహోద్యోగి ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అయితే తమకు ఎవరికీ పాస్‌పోర్టు లేదని... ప్రఙ్ఞా శవాన్ని భారత్‌కు తీసుకురావాల్సిందిగా ఆమె కుటుంబ సభ్యులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అభ్యర్థించారు. ఈ విషయంపై స్పందించిన స్థానిక ఎమ్మెల్యే అలోక్ చతుర్వేది ప్రఙ్ఞా మృతదేహం ప్రస్తుతం ఫుకెట్‌లోని పటాంగ్ ఆసుపత్రిలో ఉందని.. ఆమె కుటుంబ సభ్యులకు సహాయం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఈ విషయంపై స్పందించారు. ‘ థాయ్‌లాండ్‌లో ఉన్న భారత ఎంబసీ బాధిత కుటుంబానికి తప్పక సహాయపడుతుంది. కఠిన సమయాల్లో వారికి తోడుగా ఉంటుంది అని ట్వీట్ చేశారు. ఇక మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కూడా ప్రఙ్ఞా కుటుంబానికి అన్ని విధాలుగా తోడు ఉంటామని ప్రకటించారు. -
ఆ బీచ్‌లో సెల్ఫీ తీసుకుంటే మరణ శిక్ష!
పుకెట్: పర్యాటకులకు హెచ్చరిక! బీచ్‌లో సెల్ఫీలు తీసుకుంటే మరణ శిక్ష విధిస్తారట. అదేంటీ? సెల్ఫీలు తీసుకుంటే తప్పేంటీ అనుకుంటున్నారా? అయితే, మీరు థాయ్‌లాండ్‌లోని పుకెట్ ఐలాండ్ గురించి తెలుసుకోవాలి. ఇక్కడ ఉన్న మాయ్ ఖావో బీచ్‌కు ఆనుకోని ఫూకెట్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్ వే ఉంది. ఇక్కడ విమానాలు ఈ బీచ్‌కు అత్యంత సమీపం నుంచి టేకాఫ్ అవుతాయి. దీంతో పర్యాటకులు తమ తలపై నుంచి వెళ్లే విమానాలతో సెల్ఫీలు దిగుతున్నారు. అయితే ఇది పర్యాటకులకు ప్రమాదకరమే కాకుండా, విమానాలకు కూడా ముప్పు కలిగించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పర్యాటకులు ఆ ప్రాంతానికి రాకుండా కఠిన శిక్షలు, జరిమానాలు విధించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు బీచ్‌ను సేఫ్టీ జోన్లోకి చేరుస్తామని ప్రకటించారు. ఈ నిబంధనలను అతిక్రమించే వారికి మరణ దండన లేదా జీవిత ఖైదు లేదా రూ.70 వేలు పైగా జరిమానాలు విధించేందుకు సిద్ధమవుతున్నారు. -
కోరి కొండచిలువను ముద్దాడబోయి..!
కోరి కొరివితో తల గోక్కోవడమంటే ఇదే కావొచ్చు. కొండచిలువను దగ్గరి నుంచి చూడాలంటేనే చాలా ధైర్యం కావాలి. అలాంటిది కొండచిలువ తలపై ముద్దు పెట్టాలని కోరిక పుడితే.. అది చూస్తూ ఉరుకుంటుందా? ఓ చైనీస్ పర్యాటకురాలికి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. థాయ్‌లాండ్‌లోని మానవ రహిత జంతువుల పార్క్‌గా పేరొందిన 'ఫుకెట్'కు ఆ చైనీస్ పర్యాటకురాలు ఈ నెల 9న వెళ్లింది. అక్కడ కొండచిలువను దగ్గరగా చూడటమే కాకుండా.. దానిని తలపై ముద్దాడేందుకు సాహసించింది. అంతే ఆమె ఇలా ముద్దాడిందో లేదో కొండచిలువ చివాల్న దాడి చేసింది. వెంటనే ఆమె ముక్కు పట్టుకొని గట్టిగా కొరికేసింది. దీనిని చూసి చుట్టు ఉన్నవారు షాక్‌తో గావు కేక పెట్టారు. కొండచిలువ దాడిబారిన పడిన చైనీస్ పర్యాటకురాలిని 29 ఏళ్ల జిన్ జింగ్గా గుర్తించారు. ఘటన జరిగిన వెంటనే ఆమెను ఫుకెట్ ఇంటర్నేషనల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అదృష్టమేమిటంటే ఆ కొండ చిలువ విషపూరితమైనది కాదు. కానీ కొండచిలువ దాడి వల్ల జింగ్ ముక్కుకు మాత్రం పలు కుట్లు పడ్డాయి. ఆ పార్క్‌లో స్నేక్ షో నిర్వహించే థాయ్ కంపెనీ జింగ్‌కు 3300 డాలర్లు పరిహారంగా చెల్లించింది.