కోరి కొండచిలువను ముద్దాడబోయి..! | Chinese tourist bitten on the nose by a python | Sakshi
Sakshi News home page

కోరి కొండచిలువను ముద్దాడబోయి..!

Jan 12 2016 5:24 PM | Updated on Aug 13 2018 3:45 PM

కోరి కొండచిలువను ముద్దాడబోయి..! - Sakshi

కోరి కొండచిలువను ముద్దాడబోయి..!

కోరి కొరివితో తల గోక్కోవడమంటే ఇదే కావొచ్చు. కొండచిలువను దగ్గరి నుంచి చూడాలంటేనే చాలా ధైర్యం కావాలి.

కోరి కొరివితో తల గోక్కోవడమంటే ఇదే కావొచ్చు. కొండచిలువను దగ్గరి నుంచి చూడాలంటేనే చాలా ధైర్యం కావాలి. అలాంటిది కొండచిలువ తలపై ముద్దు పెట్టాలని కోరిక పుడితే.. అది  చూస్తూ ఉరుకుంటుందా? ఓ చైనీస్ పర్యాటకురాలికి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. థాయ్‌లాండ్‌లోని మానవ రహిత జంతువుల పార్క్‌గా పేరొందిన 'ఫుకెట్‌'కు ఆ చైనీస్ పర్యాటకురాలు ఈ నెల 9న వెళ్లింది. అక్కడ కొండచిలువను దగ్గరగా చూడటమే కాకుండా.. దానిని తలపై ముద్దాడేందుకు సాహసించింది. అంతే ఆమె ఇలా ముద్దాడిందో లేదో కొండచిలువ చివాల్న దాడి చేసింది. వెంటనే ఆమె ముక్కు పట్టుకొని గట్టిగా కొరికేసింది. దీనిని చూసి చుట్టు ఉన్నవారు షాక్‌తో గావు కేక పెట్టారు.

కొండచిలువ దాడిబారిన పడిన చైనీస్ పర్యాటకురాలిని 29 ఏళ్ల జిన్ జింగ్‌గా గుర్తించారు. ఘటన జరిగిన వెంటనే ఆమెను ఫుకెట్ ఇంటర్నేషనల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అదృష్టమేమిటంటే ఆ కొండ చిలువ విషపూరితమైనది కాదు. కానీ కొండచిలువ దాడి వల్ల జింగ్‌ ముక్కుకు మాత్రం పలు కుట్లు పడ్డాయి. ఆ పార్క్‌లో స్నేక్ షో నిర్వహించే థాయ్‌ కంపెనీ జింగ్‌కు 3300 డాలర్లు పరిహారంగా చెల్లించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement