Physical violence
-
కదిలించే కథలు
వంద పదాల సారాన్ని ఒక్క దృశ్యం చూపిస్తుంది. జీవితకాలపు సందేశాన్ని పదిసెకండ్ల ఫిల్మ్ ప్రొజెక్ట్ చేస్తుంది. ఇప్పుడు సెల్యులాయిడ్ తరం కాదు.. సెల్యులర్ టైమ్! ఏదైనా అరచేతి ఫోన్లో ప్రత్యక్షం కావాలి. సెకన్లలో తెలిసిపోవాలి. ఇవ్వాళ్టి మార్కెట్ స్ట్రాటజీ కూడా బ్రివిటీనే. ఈ జనరేషన్ కోరుకుంటున్న ఆ డిమాండ్‌ను అనుసరించే ఫేస్బుక్ ఓ కొత్త ప్రయత్నాన్ని పోస్ట్ చేసింది. దాని పేరే థంబ్స్టాపర్స్. పదిసెకన్లలో కమర్షియల్ యాడ్స్‌ను ప్రమోట్ చేసే సిస్టమ్. ‘‘షార్ట్‌స్టోరీస్ మూవ్ హార్ట్స్’’ పేరుతో వాటిని ప్రదర్శించడం మొదలు పెట్టేసింది కూడా. ప్రముఖ దర్శకురాలు కిరణ్‌రావు తీసిన రెండు షార్ట్‌ఫిల్మ్స్‌తో. ధైర్యం చేయడానికి క్షణం చాలు.. గృహహింసకు వ్యతిరేకంగా కిరణ్‌రావు తీసిన షార్ట్‌ఫిల్మ్‌కి క్యాప్షన్ అది. భర్త చేతిలో శారీరక హింసకు గురైన ఓ గృహిణికి ఒక యువతి ఫోన్ ఇస్తుంది .. 100 నంబర్ డయల్ చేసి. ఒక లిప్తపాటు తాత్సారం చేసి ప్రెస్ బటన్ నొక్కుతుంది ఆ గృహిణి. అప్పుడు వస్తుందీ కాప్షన్.. ధైర్యం చేయడానికి క్షణం చాలు అని. ఇంటి నుంచే మొదలవ్వాలి.. ఇది ఆమె తీసిన ఇంకో షార్ట్‌ఫిల్మ్... జెండర్ డిస్క్రిమినేషన్ మీద. ఒక అమ్మ తన కొడుకు, కూతురికి రెండుగ్లాసుల్లో పాలు పోసి ఇస్తుంది. కూతురి గ్లాస్లో కన్నా కొడుకు గ్లాస్లో పాలు ఎక్కువగా ఉంటాయి. దాన్ని గమనించిన ఆ అబ్బాయి తన గ్లాస్‌లోంచి చెల్లి గ్లాస్‌లోకి పాలు వంపి.. రెండు గ్లాసుల్లో పాలను సమం చేస్తాడు. మార్పు మొదలవడానికి రెండు క్షణాలు చాలు అనే వ్యాఖ్యతో ఈ షార్ట్‌ఫిల్మ్ ముగుస్తుంది. గొంతుచించుకోకుండా నిరసన తెలపొచ్చు.. సిటీబస్‌లో.. నిలబడ్డ ఒక అబ్బాయి తన ముందు సీట్లో కూర్చున్న అమ్మాయి ఛాతీ వంక అదేపనిగా చూస్తూంటాడు. ఆ అమ్మాయి పక్కనే కూర్చున్న ఇంకో అబ్బాయి అది గమనించి తన షర్ట్ కాలర్‌ను ఛాతి కిందకు జారుస్తూ ‘‘ఇప్పుడు చూడు’’అన్నట్టుగా సైగ చేస్తాడు నిలబడ్డ అబ్బాయితో. అంతే అతను గతుక్కుమని చూపు తిప్పుకుంటాడు. ‘‘నాట్ ఆల్ ప్రొటెస్ట్స్ ఆర్ లౌడ్’’ అనే కాప్షన్ వస్తుంది. మాతృత్వానికి జెండర్ లేదు.. రుతుక్రమం గురించి నెట్లో సెర్చ్ చేసి కూతురికి వివరిస్తూంటాడు తండ్రి. ‘‘మదర్‌హుడ్ హాజ్ నో జెండర్’’ అనే మెస్సేజ్‌తో ముగుస్తుంది ఈ షార్ట్‌ఫిల్మ్. సామర్థ్యమే ముఖ్యం జిమ్‌లో.. ఒక స్థూలకాయురాలు.. అలవోకగా శీర్షాసనం వేస్తుంది అందరూ ఆశ్చర్యపోయేలా. అప్పుడు వస్తుంది కాప్షన్ ఎబిలిటీ మ్యాటర్స్ అని. అందమైన లోకం ఒక ట్రాన్స్ ఉమన్ పెట్టుకున్న చెవి జుంకాలు చూసి ‘‘ఎక్కడ కొన్నావ్.. చాలా బావున్నాయ్.. నీ అందాన్ని పెంచేలా’’ అంటూ కితాబిస్తుంది ఓ యువతి. ఆనందంగా ‘థాంక్స్’ చెప్తుంది ఆ ట్రాన్స్ ఉమన్. ‘‘యాన్ ఈక్వల్ వరల్డ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ వరల్డ్’’ అనే వ్యాఖ్యతో ఎండ్ అవుతుంది ఆ షార్ట్‌స్టోరీ. -
బతుకు పోరాటం సాగించిన సారిక
కోర్టుకు హాజరైన మరుసటి రోజే మృతి అడుగడుగునా ఇబ్బంది పెట్టిన భర్త అనిల్ వరంగల్ లీగల్ : వైవాహిక జీవితంలో అవమానాలు, మానసిక, శారీరక హింస ఎదుర్కొన్న మాజీ ఎంపీ సిరిసిల్ల రాజ య్య కోడలు సారిక.. ఆమెతో పాటు పిల్లలు బతకడానికి జీవనభృతి సాధిం చేందుకు కడదాక పోరాడింది. అయితే, ఈ న్యాయ పోరాటంలో ఆమెకు భర్త అని ల్ అడుగడుగునా అడ్డంకులు సృష్టిం చాడు. చివరకు కేసు వాయిదా కోసం ఈనెల 2న సారిక, అనిల్ జిల్లా కోర్టు ప్రాంగణంలోని నాలుగో అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యా రు. ఆ మరుసటి మరుసటి రోజే ఆమె పిల్లలతో కలిసి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం గమనార్హం. భర్త అనిల్, అత్తమామలు మాధవి, రాజయ్య మానసికంగా శారీరకంగా హింసిస్తున్నారని, పిల్లలకు సైతం భోజనం, విద్య, వైద్య వంటి కనీస అవసరాలుకల్పించకుండా వేధిస్తున్నారని సారిక ఫిర్యాదు మేరకు గృహహింస చట్టం కింద 2014 జూన్ 14న నాలుగో మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు లో కేసు నెంబర్ 6/2014 నమోదైంది. తనను వేధించకుండా చూడడంతో పా టు రెవెన్యూకాలనీలోని ఇంటి నుంచి పం పించకుండా చూడాలని, తన నుంచి అత్తమామలు తీసుకున్న 20 తులాల బంగా రం, 10 లక్షల నగదు ఇప్పించడంతో పా టు రూ.50లక్షల పరిహారం ఇప్పించాలని కోరుతూ ఆమె ఈ కేసు వేసింది. ఈ క్రమంలోనే 2015 జనవరి 13న సారికకు నెలకు రూ.6వేలు, పిల్లలు ముగ్గురికి రూ.3వేల చొప్పున మొత్తం రూ.15వేలు పోషణ నిమిత్తం అనిల్ చెల్లించాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, దీనిపై తనకు ఆదాయ వనరులు లేవంటూ అనిల్ జిల్లా కోర్టులో అప్పీల్ చేయగా.. ఆ అప్పీల్‌ను కోర్టు కొట్టివేసింది. తండ్రి రాజయ్య మాజీ ఎంపీ, తల్లి మాధవి అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నందున రూ.15వేలు చెల్లించడం సాధ్యమేనని జడ్జి రేణుక ఆ తీర్పులో పేర్కొన్నారు. అయినా జనవరి నుంచి జూలై 2015వరకు అనిల్ డబ్బు ఇవ్వకపోగా సారిక మళ్లీ కోర్టును ఆశ్రయించడంతో ఏడు నెలల డబ్బులో రూ. 45వేలు చెల్లించాడు. అయితే, తనకు భృతి చెల్లించకుండా వేధిస్తున్న భర్త అని ల్ను అరెస్టు చేయాలని కోర్టుకు విన్న విం చిన సారిక విచారణ నిమిత్తం సోమవా రం కోర్టుకు హాజరైంది. మరుసటి రోజు మంగళవారం అర్ధరాత్రి బుధవారం తెల్లవారుజామున అనుమానస్పద స్థితిలో పిల్లలతో సహా మృతి చెందింది. ఇలా తన హక్కుల సాధనకు నిరంతరం నిర్భయంగా నిలబడి న్యాయపోరాటం సాగిం చిన సారిక మరణం హత్యా? ఆత్మహ త్యా? అనేది మాత్రం తేలాల్సి ఉంది.