వికలాంగుడి బలవన్మరణం
తొర్రూరు : ఓ వికలాంగుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఎండీ అఫ్జల్(25) అనే వికలాంగుడు సోడా బండి నడిపి జీవనం సాగించేవాడు.మనస్తాపానికి గురైన అతడు ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.