సాంపిల్స్ సేల్ చేస్తున్నారు
విజయనగరం : గంట్యాడ మండలానికి చెందిన ఓ మహిళ పట్టణంలోని ఓ ప్రైవేటు డాక్టర్ దగ్గరకు గైనిక్ సంబంధిత వ్యాధితో రెండు రోజులు క్రితం పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యునికి వద్దకు వెళ్లారు. అయితే ఆమెను పరిక్షించిన తర్వాత వైద్యుడు ఆమెకు అతని వద్ద ఉన్న శాంపిల్ మందులను ఇచ్చి రూ.200 తీసుకున్నారు. ఇటువంటి సంఘటనలు నిత్యం ప్రైవేటు క్లీనిక్ల్లో చోటుచేసుకుంటున్నాయి. ఉచితంగా ఇవ్వాల్సిన శాంపిల్ మందులను కూడ ప్రైవేటు వైద్యులు సొమ్ము చేసుకుంటున్నారు. కన్షల్టేషన్ ఫీజు, రూమ్ అద్దెలు, వైద్య పరిక్షలు ఫీజులు ఇలా అన్ని రకాల అమాంతం పెంచేసిన వైద్యులు మెడికల్ రిప్రంజెటేటివ్స్ ఉచితంగా శాంపిల్ మందులను, సిరప్లను కూడ అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు.
300 వరకు ప్రైవేటు ఆస్పత్రులు
జిల్లాలో 300 వరకు క్లీనిక్లు,నర్సింగ్ ఆస్పత్రులు ఉన్నాయి. అయితే వీరికి వారి కంపెనీ యొక్క మందుల ఏ మేరకు పనిచేస్తున్నాయో పరిశీలించాలని మందులను ఉచితంగా ఇస్తారు. వాటిని వైద్యులు రోగులకు ఉచితంగా ఇచ్చి వ్యాధి నయం అయినట్టు అయితే అమందులను మందుల దుకాణాల్లో కొనుగోలు చేసుకోవాలని ఆస్పత్రికి వచ్చే రోగులకు చెప్పాలి. కాని ఉచితంగా రోగులకు ఇవ్వాలని చెప్పిన మందులను కొంతమంది వైద్యులు కాసులు కోసం రోగులకు అమ్మేస్తున్నారు.
శాంపిల్ మందులు ద్వారా ఆదాయం
కన్షల్టేషన్ ఫీజుతో పాటు శాంపిల్ మందులను రోగులకు అంటగట్టి రోగులు నుంచి రూ.200 నుంచి రూ.400 వరకు వసూలు చేస్తున్నారు. దీంతో ఒక్కో వైద్యుడు రోజుకి వేలల్లో సంపాదిస్తున్నట్టు తెలిసింది. వైద్యులుతో పాటు కొన్ని మందుల దుకాణాల యాజమానులు కూడ మందులను విక్రయిస్తున్న ఆరోపణులు వినిపిస్తున్నాయి.
వివరణ
శాంపిల్ మందులు అమ్మకూడదు: శాంపిల్ మందులను అమ్మ కూడదు. ఎవరైనా శాంపిల్ మందులు అమ్మినట్టు అయితే ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. వైద్యుడిగాని,మందుల దుకాణాల యాజమానులు గాని శాంపిల్ మందులు అమ్మకూడదు. - యుగందర్, డ్రగ్ఇనస్పెక్టర్