వేసవిలో బదిలీలు చేయూలి
ఖమ్మం: వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను నిర్వహించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు కృష్ణమోహన్ డిమాండ్ చేశారు. సంఘం జిల్లా సమావేశం ఆదివారం ఖమ్మం నగరంలో జరిగింది. ఈ సందర్భంగా కృష్ణమోహన్ మా ట్లాడుతూ పాఠశాలలో ఉపాధ్యాయుల సర్వీసు గరిష్ట కాలపరిమిపై హడావుడిగా కాకుండా శాస్త్రీయ దృష్టితో స్థిరమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.
పదోన్నతులు ఎలా సాధ్యమైతే ఆలా నిర్ణయం తీసుకోవాలని అన్నారు. పదవ తరగతి మూల్యాంకనం రేట్లను మూడు రెట్లు పెంచాలని, స్పెషల్ అసిస్టెంట్లకు డీఏ ఇవ్వాలని, నూతన పీఆర్సీ ప్రకారం టీఏ, డీఏ అమలయ్యేలా స్పాట్ ముగిసేలోపు ఉత్తర్వ్యూలు జారీ చేయాలన్నారు. రేషలైజేషన్ ఆలోచనను విరమించుకోవాలని ప్రాథమిక పాఠశాలలను విలీనంచేసి ఆంగ్లమీడియంబోధన ప్రవేశపెట్టాలని సమావేశంలో తీర్మానం చేశారు.
పీఆర్సీ బకాయిలు, జీపీఎఫ్ నగదు ఇవ్వాలని స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, పండిట్, పీఈటీలను అప్గ్రేడ్ చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు వెంకటేశ్వర్లు, కనకదుర్గ, వెంకట్రెడ్డి, జయరాజ్, శ్రీనివాస్చ ప్రసాద్, అబ్రహం, రంగారావు, రియాద్, నరసయ్య, వెంకటేశ్వరావు, సోమాల్ల తదితరులు పాల్గొన్నారు.