ఇద్దరు రైతుల ఆత్మహత్య
గుంటూరు: గుంటూరు జిల్లా గురజాల మండలం మాడుగుల గ్రామానికి చెందిన ఎనుగంటి పిచ్చయ్య(37) అనే రైతు సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. 8 ఎకరాల్లో వేసిన పత్తి పంట సరిగా పండలేదని మనస్తాపంతో పొలంలోనే పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలంలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధ తాళలేక ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. చేసిన అప్పులు తీర్చే మార్గం తోచక ఆత్మహత్యకు పాల్పడ్డాడని బంధువులు తెలిపారు.