picture viral
-
ఈ చిత్రంలో ఎన్ని గుర్రాలున్నాయో కనిపెట్టగలరా!
కొన్ని రకాల చిత్రాలు అత్యద్భుతంగా ఉంటాయి. పైగా వాటిలో దాగి ఉన్న అసలైన చిత్రాలను మనం తదేకంగా పరికించి చూస్తే గానీ గుర్తిచలేం. అయితే అలా గుర్తించడం కూడా ఒక అందమైన అనుభూతి అనే చెప్పాలి. కొంతమంది కళాకారులు భలే అద్భుతంగా గీస్తారు. అవి చూసినప్పుడు ఒకలా ఉంటుంది. కానీ కాస్త నిశితంగా పరిశీలించి చూస్తే అసలైన కళాఖండం అవగతమవుతుంది. అచ్చం అలానే ఉంటుంది ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం కూడా . (చదవండి: వలసదారుల పడవ బోల్తా: 11 మంది దుర్మరణం) అసలు విషయంలోకెళ్లితే...మంచు పర్వతాల్లో గుర్రాల గుంపు నిలబడి ఉన్న ఒక ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే మొదటగా మనకు ఆ చిత్రం చూసిన వెంటనే అక్కడ ఐదు గుర్రాలు మాత్రమే ఉన్నాయని అనిపిస్తుంది. కానీ నిజానికి అక్కడ ఏడు గుర్రాలు ఉంటాయి. మనం ఒక్కసారిగా పరికించి జాగ్రత్తగా చూస్తేగానీ మనకు అవగతమవ్వదు. ప్రస్తుతం ఈ చిత్రం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఒకసారి చూసి ఎన్ని గుర్రాలు ఉన్నాయో లెక్కపెట్టండి మరి. ఇక ఆలస్యం ఎందుకు త్వరపడండి. (చదవండి: సైకిలింగ్ చేయండి!... రుచికరమైన జ్యూస్‌ని ఆస్వాదించండి!!) -
దుమారం రేపుతున్న లాలు ఫొటో..
బిహార్ సీనియర్ జర్నలిస్ట్ రంజన్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న జావేద్ భట్ ఆ రాష్ట్ర మంత్రి తేజ్ ప్రతాప్‌తో కలవడం, ఫొటో దిగడంపై తీవ్ర విమర్శలు రాగా.. ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్‌తో కూడా జావేద్ కలిసున్న ఫొటో తాజాగా బయటకు రావడం దుమారం రేపుతోంది. ఓ వేదికపై కూర్చున్న లాలుతో జావేద్ మాట్లాడుతున్నట్టుగా ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మంత్రి తేజ్ ప్రతాప్.. లాలు కొడుకన్న విషయం తెలిసిందే. హత్య కేసులో నిందితుడితో తండ్రీకొడుకులు సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటకు రావడంతో వారిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆర్జేడీ నాయకులు నేరగాళ్లను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కాగా లాలుతో జావేద్ కలిసున్న ఫొటో పాతదని భావిస్తున్నారు. మంత్రి తేజ్ ప్రతాప్‌తో మాత్రం జావేద్ ఇటీవల కలిశాడు. రంజన్ హత్య కేసులో మరో నిందితుడు కైఫ్‌తో కలసి జావేద్ మంత్రితో కలిసున్న ఫొటో బయటకు వచ్చింది. దీనిపై మంత్రి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. రంజన్ హత్య కేసును సరిగా దర్యాప్తు చేయడం లేదని, సీబీఐతో విచారణ చేయించాలని కోరుతూ ఆయన భార్య ఆశ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఓ వైపు సీబీఐ నాయకులు ఈ కేసును విచారిస్తుండగా.. లాలు, ఆయన తనయుడుతో నిందితులు కలిసున్న ఫొటోలు బయటకు రావడంతో ఆర్జేడీ నాయకులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.