కళేబరాల వాసన తో తరగతుల బహిష్కరణ..!
దిలావర్పూర్ : మండల కేంద్రమైన దిలావర్పూర్ ప్రాథమిక, ఉన్నత పాఠశాల ఆవరణ పరిసరాల్లో పందుల కళేబరాల దుర్గంధంతో మంగళవారం విద్యార్థులు పాఠశాల తరగతులను బహిష్కరించారు. గ్రామంలోని పందుల స్వైరవిహారం అధికమడంతో పాటు నిత్యం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న విద్యార్థులకు పాఠశాల పక్కనే మతి చెందిన పందుల కారణంగా మంగళవారం ఉదయం నుంచి పాఠశాలకు తీవ్ర దుర్గంధం వ్యాప్తి చెందడంతో పాఠశాలలోని నలుగురు విద్యార్థులు వాంతులు చేసుకున్నారు.
అలాగే మిగతా విద్యార్థులు సైతం తీవ్ర దుర్గంధం కారణంగా పాఠశాలలో ఉండమంటూ బయటకు పరుగులు తీశారు. ఉపాధ్యాయులు సైతం చేసిది ఏమీ లేక విద్యార్థులందరితో కలసి బయటకు వెళ్లారు.
మధ్యాహ్న భోజన సామగ్రి నంతటినీ ఆటోలో తరలించుకుని స్థానిక రేణుక ఎల్లమ్మ ఆలయ పరిసరాల్లో వనభోజనానికి తరలివెళ్లి విద్యార్థులకు అక్కడే పాఠాలు చెప్పి ఇండ్లకు తరలి వెళ్లారు. ఈసందర్భంగా పలువురు విదార్థులు మాట్లాడుతూ గ్రామంలో పందుల స్వైరవిహారంపై అధికారుల స్పందించాలని డిమాండ్ చేశారు.