అన్నయ్య మరణవార్త విని తమ్ముడి హఠాన్మరణం
రెండు గ్రామాలలో విషాదం
తుమ్మపాల: అన్నయ్య మరణవార్త విని తమ్ముడు హాఠాన్మరణం చెందిన సంఘటన అనకాపల్లి మండలం చింతనిప్పుల అగ్రహారంలో బుధవారం చోటు చేసుకుంది. తుమ్మపాలకు చెంది న పీలా వెంకటరావు, పీలా జోగి నాయుడు అన్నదమ్ములు. అన్నయ్య పీలా వెంకటరావు (48) చింతనిప్పుల అగ్రహారంలో అత్తవారింట కొన్నేళ్లుగా ఉంటున్నారు.
మూడు రోజుల క్రితం పీలా వెంకటరావు అనారోగ్యానికి గురయ్యారు. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందాక ఇంటికి వచ్చాడు. బుధవారం ఉదయం 10.00 గంటల సమయంలో మళ్లీ అస్వస్థతకు గురయి మరణించాడు. ఈ వార్త తెలిసి తమ్ముడు పీలా జోగినాయుడు (40) తుమ్మపాల నుంచి సిహెచ్.ఎన్. అగ్రహారం వచ్చాడు. అన్నయ్య అంత్యక్రియల్లో పాల్గొన్నాడు.
మనోవేదనతో అన్నయ్య మరణవార్తను తట్టుకోలేక ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. బంధువులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే తుమ్మపాల వద్ద మరణించాడు. వీరికి అన్నయ్య జగ్గప్పారావు ఉన్నారు. దీంతో ఇటు సిహెచ్.ఎన్. అగ్రహారంలోను, అటు తుమ్మపాలలోను విషాదం అలుముకుంది. వెంకటరావుకు భార్య ధనలక్ష్మి దహన సంస్కారాలు నిర్వహించారు.