మీ మద్దతుతో ఎనలే ని ఉత్సాహం: మిలింద్
ముంబై: రొమ్ము కేన్సర్‌పై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన పింకథాన్ ర్యాలీలో పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొని మద్దతు పలకడం తనకు ఎంతో ఆనందం కలిగించిందని బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్ పేర్కొన్నాడు. నగరంలో ఆదివారం ఉదయం నిర్వహించిన పింకథాన్ ర్యాలీకి హాజరైన సందర్భం గా మాట్లాడుతూ ఇకపైకూడా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తామన్నాడు. కాగా ఈ పింకథాన్‌లో దాదాపు మూడువేల మంది మహిళలు పాల్గొన్నారు.
ఇందులో పాల్గొన్న వారిలో వివిధ కార్పొరేట్ సంస్థలకు చెందిన ఉద్యోగినులు, కళాశాలల విద్యార్థినులు, నర్సులు, మహిళా వైద్యులు ఉన్నారు. ఈ కార్యక్రమం హెల్త్‌కేర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, మేక్సిమస్ ఎంఐసీఈ అండ్ మీడియా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జరిగింది. బాలీవుడ్ తారలు గుల్‌పనగ్, మిలింద్ సోమన్, అల్ట్రా మారథానర్ దినేష్ మాధవన్‌లు పచ్చజెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. పది కిలోమీటర్ల పరుగులో జయశ్రీబోర్గి విజయకేతనం ఎగురవేయగా, ద్వితీయ, తృతీయ రన్నరప్‌లుగా సునీతా వాగ్మోడే, శ్వేతాదేవరాజ్లు నిలిచారు. ఇది ఐదుకిలో మీటర్ల పరుగులో జ్యోతి పంజాబీ తొలిస్థానంలో నిలిచారు. ఈ ర్యాలీ ఆద్యంతం ఉత్సాహంగా సాగింది.