pinning fire
-
అగ్నికి ఆహుతైన మామిడి చెట్లు
వీరబల్లి: పెద్దివీడు గ్రామం రెడ్డివారిపల్లెకు చెందిన జయపాల్రెడ్డి అనే రైతుకు సంబంధించి మూడు ఎకరాలలో మామిడి చెట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. గ్రామ సమీపాన లక్షలాది రూపాయలు ఖర్చు చేసి కంటికి రెప్పలా చూసుకున్నామని, ఇప్పుడు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించడంతో కాలిపోయాయని ఆయన రోదించారు. దీంతోపాటు డ్రిప్ కూడా పూర్తి స్థాయిలో దగ్ధమైందని ఆవేదన వ్యక్తం చేశారు. మామిడి చెట్లలో గరిక (గడ్డి) ఎక్కువగా ఉండటం వల్ల మంటలు రెట్టింపై వ్యాపించాయని పేర్కొన్నారు. సుమారు రూ.5 లక్షల మేర నష్టం కలిగిందన్నారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో పెంచుకున్నామని, పూర్తి స్థాయిలో కాలిపోవడం వల్ల తమ గోడు ఎవరికి తెలుపుకోవాలంటూ వాపోయారు. ఆ చెట్లకు 5 ఏళ్ల వయస్సు కలదని చెప్పాడు. సంబంధిత అధికారులు స్పందించి నష్ట పరిహారాన్ని అందించి, మళ్లీ మొక్కలను నాటుకునేందుకు డ్రిప్ సౌకర్యం కల్పించాలని ఆయన కోరాడు. -
అగ్నికి ఆహుతైన మామిడి చెట్లు
వీరబల్లి: పెద్దివీడు గ్రామం రెడ్డివారిపల్లెకు చెందిన జయపాల్రెడ్డి అనే రైతుకు సంబంధించి మూడు ఎకరాలలో మామిడి చెట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. గ్రామ సమీపాన లక్షలాది రూపాయలు ఖర్చు చేసి కంటికి రెప్పలా చూసుకున్నామని, ఇప్పుడు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించడంతో కాలిపోయాయని ఆయన రోదించారు. దీంతోపాటు డ్రిప్ కూడా పూర్తి స్థాయిలో దగ్ధమైందని ఆవేదన వ్యక్తం చేశారు. మామిడి చెట్లలో గరిక (గడ్డి) ఎక్కువగా ఉండటం వల్ల మంటలు రెట్టింపై వ్యాపించాయని పేర్కొన్నారు. సుమారు రూ.5 లక్షల మేర నష్టం కలిగిందన్నారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో పెంచుకున్నామని, పూర్తి స్థాయిలో కాలిపోవడం వల్ల తమ గోడు ఎవరికి తెలుపుకోవాలంటూ వాపోయారు. ఆ చెట్లకు 5 ఏళ్ల వయస్సు కలదని చెప్పాడు. సంబంధిత అధికారులు స్పందించి నష్ట పరిహారాన్ని అందించి, మళ్లీ మొక్కలను నాటుకునేందుకు డ్రిప్ సౌకర్యం కల్పించాలని ఆయన కోరాడు.