నిమ్మవాగులో బయటపడ్డ తుపాకులు
గుండాల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం ముత్తాపురం గ్రామ సమీపంలోని నిమ్మ వాగు చెరువులో రెండు తుపాకులు సోమవారం బయటపడ్డాయి. తుపాకులు రెండూ తుప్పుపట్టి ఉన్నాయి. స్థానికులు వాటిని గుర్తించి సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు తుపాకులను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మావోయిస్టులు వాగులో పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు.