జైపాల్‌రెడ్డి పోటీచేస్తే స్వాగతిస్తాం
చేవెళ్ల, న్యూస్‌లైన్: చేవెళ్ల పార్లమెంటు స్థానానికి సిట్టింగ్ ఎంపీ, కేంద్రమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి పోటీచేస్తే స్వాగతిస్తామని మాజీ హోంమంత్రి సబితారెడ్డి తనయుడు, యువజన కాంగ్రెస్ నాయకుడు పి.కార్తీక్‌రెడ్డి స్పష్టం చేశారు. చేవెళ్లలోని మార్కెట్‌యార్డులో శుక్రవారం చైర్మన్ మలిపెద్ది వెంకటేశంగుప్త అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండలంలోని కాంగ్రెస్‌పార్టీ సర్పంచులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కార్తీక్‌రెడ్డి మాట్లాడుతూ ఎంపీ జైపాల్‌రెడ్డి మరోమారు పోటీచేయాలని భావిస్తే అందరం స్వాగతిస్తామని, అందులో ఎలాంటి అనుమానాలు లేవని అన్నారు.
ఆయన పోటీచేయకుంటే తాను తప్పనిసరిగా బరిలో ఉంటానన్నారు. జైపాల్‌రెడ్డితోపాటు ఇతర ముఖ్య నాయకుల ఆశీస్సులు కూడా తనకు ఉన్నాయన్నారు. వచ్చేనెల 5వతేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర పునర్మిర్మాణ యాత్ర చేపట్టాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. నగర శివార్లలోని ఆర్మీ మైసమ్మ దేవాలయం నుంచి చేవెళ్ల, వికారాబాద్ మీదుగా తాండూరు వరకు ఈ యాత్ర కొనసాగుతుందన్నారు. ఎన్నికైన సర్పంచులు ప్రజల ఆశలను వమ్ముచేయకుండా వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. చేవెళ్ల సర్పంచ్ ఎం.నాగమ్మబాల్‌రాజ్, రాష్ట్ర ఎస్సీసెల్ కన్వీనర్ పి.వెంకటస్వామి, డీసీసీబీ వైస్‌చైర్మన్ పి.క్రిష్ణారెడ్డి, డెరైక్టర్ ఎస్.బల్వంత్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశంగుప్త, వైస్‌చైర్మన్ పి.గోపాల్‌రెడ్డి, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు వీరేందర్‌రెడ్డి, ఇంద్రన్న యువసేన జిల్లా అధ్యక్షుడు జి.రవికాంత్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీలు ఎం.బాల్‌రాజ్, పర్మయ్య, మాజీ వైస్ ఎంపీపీ శివానందం, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం.యాదగిరి తదితరులు మాట్లాడారు.
చేవెళ్ల ఎంపీ టికెట్‌ను దివంగత మాజీ హోంమంత్రి పి.ఇంద్రారెడ్డి వారసుడు కార్తీక్‌రెడ్డికి కేటాయిస్తేనే విజయం తథ్యమని పేర్కొన్నారు. కార్తీక్‌రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వాలని సమావేశం తీర్మానించింది. మార్కెట్‌కమిటీ డెరైక్టర్లు ఎండీ అలీ, మాధవగౌడ్, పార్వతమ్మ, సర్పంచులు అనురాధ, నాగమ్మ, స్వర్ణ, స్వరూప, అనుసూజ, శశికళ, శ్రీనివాస్‌గౌడ్, జంగారెడ్డి, గోపాల్‌రెడ్డి, వెంకటనర్సింహు లు, హన్మంత్‌రెడ్డి, శ్యామలయ్య, జంగ య్య, మాజీ సర్పంచులు పి.ప్రభాకర్, ఎం.సరస్వతి, నాయకులు జి.చంద్రశేఖర్‌రెడ్డి, వెంకటేశ్, అమర్నాధ్రెడ్డి, వనం మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.