లే ఔట్
సామాజిక స్థలాలు మాయం పాత లే అవుట్ల పరిశీలన
684 లే అవుట్లకు అనుమతి
163 చోట్ల ఖాళీ స్థలాలు లభ్యం
200 ఎకరాలకు పైగా కనుమరుగు
హన్మకొండ : సామాజిక అవసరాల కోసం లే అవుట్లలో కేటాయించాల్సిన ఖాళీ స్థలాలు కబ్జా అయ్యూరుు. గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపు రెండు వందలకు పైగా స్థలాలు మాయమయ్యాయి. సుమారు 200 ఎకరాలు అన్యాక్రాంతమయ్యూరుు. నగరంలో కొత్తగా మార్కెట్లు, క్రీడాస్థలాలు నిర్మించేందుకు ఖాళీ స్థలాలను గుర్తించేందుకు చేపట్టిన కసరత్తులో ఈ నిజాలు వెలుగుచూశారుు.
జనవరిలో నాలుగు రోజుల పర్యటన సందర్భంగా వరంగల్ నగరంలో ఖాళీగా ఉన్న స్థలాల వివరాలు అంగుళంతో సహా సేకరించాలని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది రంగంలోకి దిగారు. ఇళ్ల నిర్మాణాలకు లే అవుట్ల అనుమతి పొందే ముందు ఇల్లు, రోడ్లు మినహాయించి పది శాతం స్థలాన్ని పార్కు, కమ్యూనిటీ హాలు, సామాజిక అవసరాలకు కేటాయించాలి. ఈ నిబంధనలు పాటిస్తూ రూపొందిం చిన లే అవుట్లలోనే నిర్మాణాలకు అనుమతిస్తారు. నగరంలో ఖాళీ ప్రదేశాల గుర్తింపు పనిలో భాగంగా 1940లో ఉన్న వరంగల్ మునిసిపాలిటీ లే అవుట్లు, ఆ తర్వాత ఏర్పడిన కాకతీయ ప్ట్టణాభివృద్ధి సంస్థ (కుడా)కు సంబంధించి 1982 నుంచి వచ్చిన లే అవుట్లతోపాటు డెరైక్టర్ ఆఫ్ టౌన్, కంట్రీ ప్లానింగ్‌ల వద్ద ఉన్న రికార్డులను నెలరోజుల నుంచి పరిశీలిస్తున్నారు. ఈ మూడు రకాలైన రికార్డులను పరిశీలించగా... నగరంలో దాదాపు 684 లే అవుట్లకు అనుమతి ఇచ్చినట్లుగా తేలింది.
సరిగా ఉన్నవి 163 మాత్రమే..
ప్రాథమిక అంచనాల ప్రకారం నగరంలో 684 లే అవుట్లలో నిర్మాణాలకు అనుమతి ఇచ్చినట్లుగా తేలింది. కానీ... ప్రస్తుతం అందుబాటులో ఉన్న రికార్డులను జీపీఎస్ ద్వారా పరిశీలించగా కేవలం 163 లే అవుట్లలోనే సామాజిక అవసరాల కోసం కేటాయించిన ఖాళీ స్థలాలు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన లే అవుట్లలో కొత్తగా నిర్మాణాలు వెలిశాయి. మొదటగా లే అవుట్లో పది శాతం ఖాళీ స్థలాలు చూపించి నిర్మాణాలకు అనుమతులు పొందిన వెంచర్ డెవలపర్లు, బిల్డర్లు.. ఆ తర్వాత కాలంలో నిబంధనలు తుంగలో తొక్కారు. సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాల్లో యథేచ్ఛగా నిర్మాణాలు చేపట్టి జేబులు నింపుకున్నారు. ఇవన్నీ కార్పొరేషన్ అధికారుల కనుసన్నల్లోనే జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తం 684 లే అవుట్లలో కేవలం 163 లేఅవుట్లలోనే ఖాళీ స్థలాలు అందుబాటులో ఉన్నట్లుగా తేలింది. కనుమరుగైన స్థలం దాదాపు 200 ఎకరాలకు పైగానే ఉంటుందని ప్రాథమిక అంచనా.
సర్ఫరాజ్ ఏం చేస్తారో?
కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి, పారిశుద్ధ్యం వంటి కీలక విభాగాల్లో కొంత కాలంగా స్తబ్ధత వాతావరణం నెలకొంది. గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా సర్ఫరాజ్ అహ్మద్ బాధ్యతలు చేపట్టిన తర్వాతే అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. నగరంలో కొత్తగా అత్యుత్తమ ప్రమాణాలతో కూరగాయలు, పూలు, పండ్ల మార్కెట్లు నిర్మించాలన్నా, క్రీడాస్థలాలను అందుబాటులోకి తేవాలన్నా ఖాళీ స్థలాల గుర్తింపు ఎంతో కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాల్లో కొత్తగా వెలిసిన నిర్మాణాల విషయంలో కమిషనర్ ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.